
సాక్షి, హైదరాబాద్: అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత దంపతులకు హైకోర్టులో ఊరట లభించింది. వారికి తెలంగాణ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా కొత్తపల్లి గీత దంపతులు రూ.25వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. కాగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను మోసం చేశారన్న కేసులో కొత్తపల్లి గీతకు సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో వారు సీబీఐ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన హైకోర్టు సీబీఐ కోర్టు తీర్పు అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణను డిసెంబర్ 16కి వాయిదా వేసింది.
చదవండి: (దశదిన కర్మరోజు వద్దామనుకున్నా.. అందువల్లే ఈ రోజు వచ్చా: రాజ్‌నాథ్ సింగ్)
Comments
Please login to add a commentAdd a comment