ఉద్యోగం చేయడం ఇష్టంలేని వారు సొంతంగా బిజినెస్ చేసి ఎదగాలనుకుంటారు. అయితే బిజినెస్ చేయడానికి కావాల్సిన డబ్బు చేతిలో ఉండకపోవచ్చు. అలాంటి సమయంలో బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలనుకుంటున్నారు. బ్యాంక్ నుంచి బిజినెస్ లోన్ తీసుకునే ముందు తప్పకుండా కొన్ని విషయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబందించిన మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం..
సిబిల్ స్కోర్
ఒక వ్యక్తి లోన్ తీసుకోవాలనుంటే ఏ బ్యాంక్ అయినా.. ఫైనాన్స్ సంస్థ అయినా ముందుగా క్రెడిట్ స్కోల్ లేదా సిబిల్ స్కోర్ చెక్ చేస్తుంది. సిబిల్ స్కోర్ ఆధారంగానే ఎంత లోన్ వస్తుంది, వడ్డీ రేటు వంటివి నిర్ణయిస్తారు. క్రెడిట్ స్కోర్ 685 పాయింట్ల కంటే ఎక్కువగా ఉంటేనే సులభంగా లోన్ పొందవచ్చు. ఈ స్కోర్ పెంచుకోవాలనుంటే గడువు తేదీ లోపల ఈఎంఐ చెల్లించాలి, క్రెడిట్ కార్డు బిల్లులు కూడా క్లియర్ చేసుకోవాలి.
వయసు
బిజినెస్ చేయాలనుకునే వ్యక్తి వయసు కూడా చాలా ముఖ్యం. కాబట్టి వ్యాపారం చేయాలనుకునే వ్యక్తి వయసు కనీసం 24 ఏళ్లకంటే ఎక్కువ ఉండాలి. ఈ వయసులో కష్టపడే తత్త్వం ఉంటుంది. సాధించాలనే తపన ఉంటుంది. అంతకన్నా తక్కువ వయసున్న వారు బిజినెస్ చేస్తే.. బహుశా ముందుకు వెళ్ళలేరేమో అని బ్యాంకులు భావిస్తాయి.
బిజినెస్ ప్లాన్
బ్యాంక్ నుంచి లోన్ తీసుకునే ముందు.. మీరు ఎలాంటి బిజినెస్ చేస్తారనేది సంబంధిత అధికారులకు వెల్లడించాల్సి ఉంటుంది. మీ బిజినస్ ప్లాన్ బాగుంటే.. భవిష్యత్తులో ఆ వ్యాపారం ముందుకు సాగుతుందని బ్యాంక్ భావిస్తే త్వరగా లోన్ మంజూరవుతుంది. ఇది మీ ఆర్థిక అవసరాలను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది.
వార్షిక ఆదాయం
లోన్ ఇచ్చే బ్యాంక్ ఖచ్చితంగా.. సదరు వ్యక్తి వార్షిక ఆదాయం ఎంత అనేది కూడా గమనిస్తుంది. దీన్నిబట్టి ఆ వ్యక్తి లోన్ చెల్లించగలడా? లేదా అనేది బేరీజు వేసుకుంటుంది.
ఇదీ చదవండి: అందుకే లగ్జరీ కారు కొనలేదు: ఎడెల్వీస్ సీఈఓ
బిజినెస్ లోన్ రకాలు
పర్సనల్ లోన్, వెహికల్ లోన్ వంటి వాటికి.. చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి బ్యాంక్ లోన్ మంజూరు చేస్తుంది. బిజినెస్ లోన్ ఇవ్వడానికి రూల్స్ వేరుగా ఉంటాయి. ఆస్తుల ఆధారంగా లోన్ తీసుకోవడం చాలా ఉత్తమం అని పలువురు నిపుణులు చెబుతారు. ఇలాంటి వాటికి వడ్డీ రేటు కూడా కొంత తక్కువగా ఉంటుంది. ఎలాంటి ఆస్తులు లేకుండా నేరుగా లోన్ తీసుకోవాలనుంటే.. ఇది అందరికీ సాధ్యమవుతుందనుకోవడం కొంత కష్టమే. వీటిని అన్‌సెక్యూర్డ్ లోన్‌లు అంటారు. ఒకవేలా ఇలాంటి లోన్స్ తీసుకుంటే వడ్డీ రేటు కూడా ఎక్కువగానే ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment