రాజేంద్రనగర్: మరో 20 రోజుల్లో ఆ యువకుడి వివాహం. పెళ్లి కార్డులను ముద్రించి ఇంటికి తీసుకువచ్చాడు. ఆదివారం నుంచి పంపిణీ చేద్దామని తల్లిదండ్రులు చెప్పడంతో సరే అన్నాడు. కాగా.. రుణానికి సంబంధించి ఈఎంఐ చెల్లించాలని బ్యాంకు నిర్వాహకులు ఇంటికి ఏజెంట్లను పంపించారని, ఫోన్లలో ఒత్తిడికి గురి చేయడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం..
రాజేంద్రనగర్ పరిధి శివరాంపల్లిలోని ఆదర్శనగర్‌కు చెందిన అవినాష్ వాగ్దే (25) ప్రైవేట్ ఉద్యోగి. నగరానికి చెందిన ఓ యువతితో ఈ నెల 26 అవినాష్ వివాహం జరగాల్సి ఉంది. శనివారం పెళ్లి పత్రికలను ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఇంటికి తీసుకువచ్చా డు. ఆదివారం ఉదయం నుంచి కార్డులు పంచుదామని తల్లిదండ్రులు, సోదరుడికి చెప్పాడు. అవినా ష్ రెండు ప్రైవేట్ బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నాడు. సకాలంలో చెల్లించడంలేదు. ఈఎంఐలు చెల్లించాలంటూ ఫోన్‌లో బ్యాంక్ సిబ్బంది తరచూ ఫోన్ చేస్తు న్నారు. దీంతో పాటు ఇంటికి ఏజెంట్లు వచ్చిపోతున్నారు.
పెళ్లి త్వరలో ఉండడం, డబ్బు సమకూర్చకపోవడం తదితర కారణాలతో అవినాష్ మనోవేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి ఇంట్లోని గదిలో ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి సోదరుడు సంతోష్ వాగ్దే ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అవినాష్ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సోదరుడి మృతికి బ్యాంక్ నిర్వాహకులే కారణమని సంతోష్ వాగ్దే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment