EMI payment
-
ఇంటి రుణం.. భారం దింపుకుందాం
గృహ రుణం.. రెండేళ్ల క్రితం వరకు ఇల్లు కొనుగోలుదారులకు ఆకర్షణీయంగా కనిపించిన సాధనం. కేవలం 6.7 శాతం వార్షిక రేటుపై ఇంటి కొనుగోలుకు రుణం లభించింది. కానీ, స్థూల ఆరి్థక పరిస్థితుల్లో వచ్చిన మార్పుల నేపథ్యంలో ఆర్బీఐ కీలక రేటును 2022 మే నుంచి 2.5 శాతం మేర పెంచింది. ఫలితంగా గృహ రుణం రేట్లు 9.5–10 శాతానికి చేరాయి. దీంతో అప్పటికే ఇంటి కోసం రుణం తీసుకున్న వారికి నెలవారీ ఈఎంఐ భారంగా మారింది. 15 ఏళ్ల కనిష్టాలకు చేరిన గృహ రుణ రేట్లు ఒక్కసారిగా భారంగా మారాయి. ఆ తర్వాత ద్రవ్యోల్బణం గరిష్టాల నుంచి కొంత మేర దిగివచ్చింది. అంతర్జాతీయంగా కఠినతర ద్రవ్య విధానం దాదాపు చివరి దశకు చేరింది. దీంతో వడ్డీ రేట్ల పెంపు సైతం ముగింపునకు వచ్చేసిందని విశ్లేషకుల అభిప్రాయం. ఆర్బీఐ సైతం రేట్ల యథాతథ స్థితినే కొనసాగిస్తోంది. అయినా కానీ, వడ్డీ రేట్ల తగ్గింపునకు మరికొన్ని త్రైమాసికాలు వేచి చూడాల్సి రావచ్చని భావిస్తున్నారు. దాదాపు అన్ని బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు రేట్ల పెంపు భారాన్ని రుణ గ్రహీతలకు బదిలీ చేశాయి. ఈ తరుణంలో ఈఎంఐ భారం తగ్గించుకునేందుకు ఉన్న మార్గాల్లో బ్యాలన్స్‌ను మరో రుణదాతకు బదిలీ చేసుకోవడం ఒకటి. దాని గురించి వివరించే కథనం ఇది... ఇంటి కోసం రుణం తీసుకున్న వారికి ప్రస్తుత ఈఎంఐ భారంగా అనిపిస్తే, అప్పుడు ఇతర బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు వసూలు చేస్తున్న వడ్డీ రేట్లను ఒక్కసారి పరిశీలించాలి. ఇతర సంస్థలతో పోలిస్తే మీ బ్యాంక్ అధిక రేటు వసూలు చేస్తున్నట్టు గుర్తిస్తే కనుక, అప్పుడు దాన్ని తక్కువ రేటుకు ఆఫర్ చేస్తున్న బ్యాంక్‌కు బదిలీ చేసుకోవడాన్ని పరిశీలించొచ్చు. ఇలా మిగిలి ఉన్న రుణాన్ని మరో సంస్థకు బదిలీ చేసుకునే ముందు, ఇందుకు అనుసరించాల్సిన ప్రక్రియ, ఇందుకు అయ్యే చార్జీలు, అసలు బదిలీ చేసుకోవడం వల్ల మిగిలే ప్రయోజనం ఎంత మేర? తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించడం అవసరం. ఫ్లోటింగ్ రేటు విధానంలో రేట్లను ఎలా నిర్ణయిస్తారనేది కూడా తెలుసుకోవాలి. రేట్ల విధానాలు.. గృహ రుణంపై ఫిక్స్డ్ (స్థిర), ఫ్లోటింగ్ (అస్థిర) రేట్ల విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఫ్లోటింగ్ రేటు రుణాలు ఆర్బీఐ కీలక రేట్ల సవరణకు అనుగుణంగా మార్పులకు లోనవుతుంటాయి. ఫిక్స్డ్ రేట్ విధానంలో నిరీ్ణత కాలం పాటు రుణంపై ఒకటే రేటు కొనసాగుతుంది. కనుక ఫ్లోటింగ్ రేట్ రుణాలతో పోలిస్తే ఫిక్స్డ్ రేట్ రుణాలపై వడ్డీ రేటు 1.5–2 శాతం వరకు అధికంగా ఉంటుంది. ప్రస్తుతం అధిక శాతం గృహ రుణాలు ఫ్లోటింగ్ రేట్ విధానంలోనే ఉంటున్నాయి. ఆర్బీఐ 2016లో మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్) విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇది ఇప్పటికీ కొనసాగుతోంది. బ్యాంక్‌లు లేదా ఎన్‌బీఎఫ్‌సీలకు నిధులపై అయ్యే వ్యయంతోపాటు, జీ–సెక్ ఈల్డ్స్, బ్యాంకింగ్ రంగంలో లిక్విడిటీ తదితర అంశాలు ఈ విధానంలో రేట్లను ప్రభావితం చేస్తాయి. బ్యాంక్ సొంతంగా రేట్లను నిర్ణయించుకునే స్వేచ్ఛ ఎంసీఎల్ఆర్ విధానంలో ఉంటుంది. ఎంసీఎల్ఆర్ అంటే క్లుప్తంగా నిధులపై బ్యాంక్‌లకు అయ్యే వ్యయం. దీనికి అదనంగా తనకు కావాల్సిన మార్జిన్‌ను బ్యాంక్ జోడించి రుణాలపై రేటును నిర్ణయిస్తుంది. ఆర్బీఐ రేట్లను మార్చినప్పుడు ఎంసీఎల్ఆర్లోనూ మార్పులు చోటు చేసుకుంటాయి. కానీ, వెంటనే కాదు. సాధారణంగా ఆరు నెలల నుంచి ఏడాది సమయం తీసుకుంటుంది. ఎంసీఎల్ఆర్లో ఒక్క రెపో రేటు కాకుండా, ఇతర అంశాలు కూడా రేట్లను ప్రభావితం చేస్తాయి. నిజానికి ఎంసీఎల్ఆర్ విధానం అంత పారదర్శకమైనది కాదు. రిటైల్ రుణ గ్రహీతలు దీన్ని అర్థం చేసుకోలేరు. ఈ లోపాలను అధిగమించేందుకు వీలుగా ఆర్బీఐ 2019లో రెపో లింక్డ్ లెండింగ్ రేట్ (ఆర్ఎల్ఎల్ఆర్)ను ప్రవేశపెట్టింది. రుణం బదిలీతో ఆదా ఎంత? వడ్డీ రేట్లు పెరిగినప్పుడు సాధారణంగా బ్యాంక్‌లు గృహ రుణాలపై ఈఎంఐని పెంచడానికి బదులు, రుణ కాలవ్యవధిని పెంచుతుంటాయి. దాంతో ఈఎంఐలో ఎలాంటి మార్పు ఉండదు. దీంతో ఇబ్బందేమీ లేదన్నట్టు వ్యవహరించరాదు. ప్రస్తుత బ్యాంక్ లేదా ఎన్‌బీఎఫ్‌సీతో మెరుగైన డీల్ కోసం సంప్రదించాలి. సానుకూల స్పందన రానప్పుడు మిగిలి ఉన్న రుణ బకాయిని మరో బ్యాంక్‌కు బదిలీ చేసుకోవడాన్ని పరిశీలించాలి. బ్యాలన్స్ బదిలీకి సంబంధించి అర్హత ఉందా? అన్నది తెలుసుకోవాలి. బ్యాలన్స్ బదిలీకి అనుమతించే విషయంలో కొన్ని బ్యాంక్‌లు, పూర్వపు సంస్థ వద్ద కనీసం 24 నెలల పాటు అయినా క్రమం తప్పకుండా ఈఎంఐ చెల్లించిన చరిత్రను అడుగుతున్నాయి. ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్లు, లేదా స్వా«దీనం చేసిన ఇళ్లకు సంబంధించి రుణం బ్యాలన్స్ బదిలీకే బ్యాంక్‌లు ఆసక్తి చూపిస్తున్నాయి. వీటికి అదనంగా వేతనం, క్రెడిట్ స్కోర్ కూడా కీలకమవుతాయి. ముఖ్యంగా మిగిలిన రుణాన్ని, తక్కువ వడ్డీ రేటుకు ఆఫర్ చేస్తున్న మరో సంస్థకు బదిలీ చేసుకోవడం వల్ల కొంత ఆదా చేసుకుందామని భావించే వారు.. అసలు ఎంత ఆదా అవుతుందన్న దానిపై అంచనాకు రావాలి. ఉదాహరణకు రూ.75 లక్షల రుణం, 20 ఏళ్ల కాలానికి మిగిలి ఉందని అనుకుందాం. 9.5 శాతం వడ్డీ రేటు ఆధారంగా దీని ఈఎంఐ రూ.69,910 అవుతుంది. ఈ రుణాన్ని బదిలీ చేసుకుంటే, కొత్త సంస్థ 9.1 శాతం రేటుకు ఆఫర్ చేసిందనుకుంటే, అప్పుడు ఎంతో ఆదా అవుతుంది. కొత్త సంస్థ వద్ద 9.1 శాతం రేటు ప్రకారం ఇదే రుణంపై ఈఎంఐ రూ.67,963 అవుతుంది. 20 ఏళ్ల కాలంలో రూ.4,67,280 ఆదా అవుతుంది. ఇది ఏడు నెలల ఈఎంఐకి సమానం. అంటే రుణం ఏడు నెలల ముందే తీరిపోతుంది. మరో సంస్థకు రుణాన్ని బదిలీ చేసుకోవడం వల్ల మిగిలే ప్రయోజనం ఇలా ఉంటుంది. రుణం తీసుకున్న తర్వాత పెరిగిన ఆదాయం, మెరుగుపడిన క్రెడిట్ స్కోర్, మెరుగైన చెల్లింపుల చరిత్ర ఆధారంగా కొత్త సంస్థ తక్కువ రేటుకు ఆఫర్ చేసే అవకాశాలు ఉంటాయి. వడ్డీ రేటు ఎంత తగ్గితే ఆదా అయ్యే మొత్తం అధికంగా ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ అయితే ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు తక్కువ రేట్లకు రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. 0.25–0.50 శాతం మేర వడ్డీ తక్కువగా ఉండి, రుణ చెల్లింపుల కాలం మరో 15 ఏళ్లు అయినా ఉంటే నిస్సంకోచంగా రుణాన్ని బదిలీ చేసుకోవచ్చు. 2024 మధ్య నుంచి వడ్డీ రేట్లు తగ్గితే, అప్పుడు ఈఎంఐ భారం మరింత దిగొస్తుంది. రూ. 20,000 వరకు చార్జీలు రుణ బదిలీలకు సంబంధించి న్యాయపరమైన, సాంకేతిక మదింపు చార్జీలు కూడా భరించాల్సి వస్తుంది. ఇవి రూ.5,000 నుంచి రూ. 20,000 వరకు ఉంటాయి. కొన్ని బ్యాంక్‌లు విడిగా పేర్కొనకుండా, ఈ మొత్తాన్ని ప్రాసెసింగ్ ఫీజులో కలిపేస్తున్నాయి. కనుక చార్జీల గురించి సమగ్రంగా అడిగి తెలుసుకోవాలి. ఇక మెమోరాండం ఆఫ్ డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్ (ఎంవోడీటీ) గురించి కూడా తెలుసుకోవాలి. రుణ గ్రహీత తన ఇంటి డాక్యుమెంట్లను రుణదాతకు స్వా«దీనం చేయడం. రుణం ఇచ్చే సంస్థ తన పేరిట ఆ ప్రాపరీ్టని రిజి్రస్టేషన్ చేయించుకుంటుంది. ఇందుకు అయ్యే చార్జీలను రుణ గ్రహీత భరించాల్సి వస్తుంది. ఈ చార్జీలు రుణంలో 0.1–0.2 శాతంగా ఉంటాయి. ఇందులో ఎలాంటి తగ్గింపు రాదు. సుమారు రూ.75 లక్షల గృహ రుణాన్ని ఒక సంస్థ నుంచి మరో సంస్థకు బదిలీ చేసుకుంటున్నారని అనుకుంటే, ఇందుకోసం పలు రకాల చార్జీల రూపంలో రూ.62,500 వరకు కోల్పోవాల్సి వస్తుంది. లీగల్ ఫీజులు, ప్రాసెసింగ్ ఫీజుల్లో తగ్గింపు పొందడం ద్వారా ఈ భారాన్ని వీలైనంత తగ్గించుకోవచ్చు. పారదర్శక.. రెపో లింక్డ్ లెండింగ్ రేట్ రెపో లింక్డ్ లెండింగ్ రేట్ ఎంతో పారదర్శకమైనది. రెపో రేట్‌కు బ్యాంక్‌లు తమకు కావాల్సిన మార్జిన్‌ను కలిపి రుణాలపై రేట్లను నిర్ణయిస్తాయి. దీంతో రుణ గ్రహీతలు సైతం సులభంగా అర్థం చేసుకోగలరు. రెపో రేటు పెరిగి, తగ్గినప్పుడు తమపై పడే భారం ఎంతన్నది సులభంగా తెలుసుకోగలరు. అంతేకాదు రేట్ల విధానం సులభంగా ఉండడంతో, ఆర్బీఐ రెపో రేటును సవరించిన వెంటనే బ్యాంక్‌లు రుణ గ్రహీతలకు దాన్ని బదలాయిస్తాయి. సాధారణంగా ఆర్బీఐ రెపో రేటు సవరణ అనంతరం వారం నుంచి నెల రోజుల వ్యవధిలో ఆర్ఎల్ఎల్ఆర్ రుణాల రేట్లు మార్పులకు లోనవుతాయి. రెపో రేటు విధానంలో.. వడ్డీ రేట్లు తగ్గించడం, పెంచడం వేగంగా జరుగుతుంది. కనుక వడ్డీ రేట్లు పెరిగే క్రమంలో ఆ భారం వెంటనే రుణ గ్రహీతలకు బదలాయింపు అవుతుందని గుర్తు పెట్టుకోవాలి. ఈ విధానంలో బ్యాంక్‌లు సాధారణంగా రెపో రేటుపై 2.5–3 శాతాన్ని తమ మార్జిన్ కింద చార్జ్ చేస్తుంటాయి. ప్రస్తుతం గృహ రుణాలపై బ్యాంక్‌లు 9.5–10 శాతం వసూలు చేస్తున్నాయి. రెపో రేటు 6.5 శాతంపై 3–3.5 శాతం మార్జిన్‌గా వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్బీఎఫ్సీలు అయితే 10.5 శాతం వరకు చార్జ్ చేస్తున్నాయి. అయితే, ఇదే రేటు అందరికీ ప్రామాణికంగా అమలవుతుందని చెప్పలేం. రుణం మొత్తం, కాల వ్యవధి, క్రెడిట్ స్కోర్ తదితర అంశాలు కూడా రేటుపై ప్రభావం చూపిస్తాయి. రేట్ల అస్థిరతలు పెద్ద పట్టింపు కాదంటే, రిటైల్ రుణ గ్రహీతలకు ఎంసీఎల్ఆర్ కంటే ఆర్ఎల్ఎల్ఆర్ రేటు అనుకూలంగా ఉంటుంది. చార్జీల పట్ల అవగాహన ఫిక్స్డ్ వడ్డీ రేటు విధానంలో రుణం తీసుకున్న వారు, మరో సంస్థకు దాన్ని బదిలీ చేసుకోవడం ఖరీదైన వ్యవహారమే అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే రుణం ఇచి్చన సంస్థ మిగిలి ఉన్న రుణాన్ని బదిలీ చేసేందుకు గాను, ఆ మొత్తంపై 2–4 శాతం వరకు చార్జ్ వసూలు చేయవచ్చు. అదే ఫ్లోటింగ్ రేట్ విధానంలో రుణం తీసుకుని ఉంటే, ఎలాంటి ముందస్తు చెల్లింపుల రుసుములు లేకుండా మిగిలి ఉన్న రుణాన్ని మరో బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీకి బదిలీ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్లోటింగ్ రేట్ రుణాలపై ముందస్తు చెల్లింపుల చార్జీలను ఆర్బీఐ నిషేధించింది. అయితే రుణాన్ని మరో సంస్థకు బదిలీ చేసుకోవాలంటే రుణ గ్రహీత కొన్ని రకాల చార్జీలు భరించాల్సి వస్తుంది. అన్ని బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తున్నాయి. రుణంపై (బదిలీ చేసుకునే మొత్తం) 0.50 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజు కింద చాలా బ్యాంక్‌లు తీసుకుంటున్నాయి. కొన్ని ప్రభుత్వరంగ బ్యాంక్‌లు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయడం లేదు. నూతన తరం బ్యాంక్‌లు, కొన్ని ఎన్బీఎఫ్సీలు 3 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజు తీసుకుంటున్నాయి. కాకపోతే అన్ని బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీల్లో ఒకే మాదిరి చార్జీలు ఉంటాయని అనుకోవద్దు. కనుక ఆయా సంస్థల వెబ్సైట్లకు వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. నేరుగా సంప్రదింపులు చేయడం ద్వారా చార్జీల భారం లేకుండా చూసుకోవచ్చు. బదిలీ చేస్తే అయ్యే వ్యయాలు బదిలీ రుణం :రూ.75 లక్షలు ప్రాసెసింగ్ ఫీజు రుణంపై: 0.3–3% వరకు లీగల్ ఫీజు :రూ.5,000–20,000 ఎంవోటీడీ చార్జీలు :రుణంపై 0.1–0.2 శాతం ఫ్రాంకింగ్ చార్జీలు :రుణంపై 0.1–0.2 శాతం -
ఈ బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్: రుణాలపై భారీగా తగ్గనున్న భారం
సాక్షి,ముంబై: ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రుణ వినియోగదారులకు తీపి కబురు చెప్పింది. ఇటీవలి కాలంలో రుణాలపై వడ్డీరేట్ల పెంపుతో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు తాజా నిర్ణయంతో వడ్డీ రేట్లను తగ్గించి భారీ ఊరటనిచ్చింది.మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్(ఎంసీఎల్ఆర్)ని 85 బేసిస్ పాయింట్లను తగ్గించింది. ఫలితంగా ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి ఈఎంఐ భారం తగ్గనుంది. బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం, సవరించిన రుణ రేట్లు ఏప్రిల్ 10 నుంచే అమల్లోకి వచ్చాయి. ఎంసీఎల్ఆర్ రేటు తగ్గింపు తర్వాత బ్యాంకు ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ 8.65 శాతం నుంచి 7.8 శాతానికి తగ్గింది. నెల రోజుల ఎంసీఎల్ఆర్ రేటు 8.65 శాతం నుంచి 7.95 శాతానికి తగ్గింది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ 40 బేసిస్ పాయింట్లు తగ్గి 8.30 శాతానికి, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 10 బేసిస్ పాయింట్లు తగ్గి 8.7 శాతానికి దిగొచ్చింది. మరోవైపు 1-3 ఏళ్ల కాలానికి చెందిన ఎంసీఎల్ఆర్ స్థిరంగా ఉంటాయని బ్యాంకు ప్రకటించింది. కాగా రివ్యూలో ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లనుయథాతథంగానే ఉంచిన సంగతి తెలిసిందే. (‘ఆడి చాయ్‌వాలా’ ఏమైంది భయ్యా? వైరల్ వీడియో) ఇదీ చదవండి: Lava Blaze-2: అదిరిపోయే ఫీచర్లు: పరిచయ ఆఫర్ చూస్తే ఫిదా! -
టీడీపీ నేతపై కేసు: ఏసీలు కొన్నాడు.. రుణం తీర్చనన్నాడు!
సాక్షి, చిత్తూరు: ఓ ఫైనాన్స్ సంస్థ రుణంతో ఏసీలు కొని, బకాయిలు కట్టనందుకు టీడీపీ మండల అధికార ప్రతినిధి హేమాద్రినాయుడుపై కేసు నమోదు చేసినట్లు గుడిపాల ఎస్ఐ రాజశేఖర్ ఆదివారం తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు.. రామభద్రాపురం గ్రామానికి చెందిన హేమాద్రినాయుడు అతని భార్య హరిణి పేరున బజాజ్‌ఫైనాన్స్‌లో 2020 జనవరి 8వ తేదీన రెండు ఏసీలు కొన్నారు. రెండు ఏసీలకు గాను రూ.1,04 లక్షలు కట్టాల్సి ఉంది. ఇందులో రూ.34,660 డౌన్ పేమెంట్ కింద బజాజ్‌ఫైనాన్స్‌కు కట్టారు. మిగిలిన మొత్తం బజాజ్ ఫైనాన్స్ సంస్థ రుణంతో, చిత్తూరులోని రిలైన్స్ మార్ట్‌లో రెండు ఏసీలను కొనుగోలు చేశారు. ఇందుకు గాను ప్రతినెలా రూ.8,700 ఈఎంఐ కట్టాల్సి ఉంది. సెప్టెంబర్ నెలకు ఈఎంఐ కట్టలేదు. ఇందుకుగాను చిత్తూరులోని కొంగారెడ్డిపల్లెలో ఉన్న బజాజ్ ఫైనాన్స్ మేనేజర్ సురేష్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయకపోవడంతో ఆదివారం రామభద్రాపురంలోని హేమాద్రినాయుడు ఇంటికి కలెక్షన్ ఏజెంట్ పద్మనాభన్‌తో పాటు వచ్చారు. దీంతో ఆగ్రహించిన హేమాద్రినాయుడు తన ఇంటికి రావడానికి నీకు ఎంత ధైర్యం..రా అంటూ అతన్ని దుర్భాషలాడుతూ అతనిపై చేయి చేసుకొన్నారు. ‘గుడిపాల మండలం తెలుగుదేశం నాయకుడ్ని నేను, ఫోన్ చేస్తే 200 మంది ఇప్పుడే వస్తారు, నీ కథ తెలుస్తా.’ అంటూ భయబ్రాంతులకు గురిచేశాడు. దీంతో సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. గుడిపాల మండలం రామభద్రాపురం పంచాయతీ సర్పంచ్‌గా హేమాద్రినాయుడు భార్య హరిణి ప్రస్తుతం పనిచేస్తున్నారు. -
20 రోజుల్లో వివాహం.. ఈఎంఐ ఒత్తిళ్లు తట్టుకోలేక...
రాజేంద్రనగర్: మరో 20 రోజుల్లో ఆ యువకుడి వివాహం. పెళ్లి కార్డులను ముద్రించి ఇంటికి తీసుకువచ్చాడు. ఆదివారం నుంచి పంపిణీ చేద్దామని తల్లిదండ్రులు చెప్పడంతో సరే అన్నాడు. కాగా.. రుణానికి సంబంధించి ఈఎంఐ చెల్లించాలని బ్యాంకు నిర్వాహకులు ఇంటికి ఏజెంట్లను పంపించారని, ఫోన్లలో ఒత్తిడికి గురి చేయడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రాజేంద్రనగర్ పరిధి శివరాంపల్లిలోని ఆదర్శనగర్‌కు చెందిన అవినాష్ వాగ్దే (25) ప్రైవేట్ ఉద్యోగి. నగరానికి చెందిన ఓ యువతితో ఈ నెల 26 అవినాష్ వివాహం జరగాల్సి ఉంది. శనివారం పెళ్లి పత్రికలను ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఇంటికి తీసుకువచ్చా డు. ఆదివారం ఉదయం నుంచి కార్డులు పంచుదామని తల్లిదండ్రులు, సోదరుడికి చెప్పాడు. అవినా ష్ రెండు ప్రైవేట్ బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నాడు. సకాలంలో చెల్లించడంలేదు. ఈఎంఐలు చెల్లించాలంటూ ఫోన్లో బ్యాంక్ సిబ్బంది తరచూ ఫోన్ చేస్తు న్నారు. దీంతో పాటు ఇంటికి ఏజెంట్లు వచ్చిపోతున్నారు. పెళ్లి త్వరలో ఉండడం, డబ్బు సమకూర్చకపోవడం తదితర కారణాలతో అవినాష్ మనోవేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి ఇంట్లోని గదిలో ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి సోదరుడు సంతోష్ వాగ్దే ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అవినాష్ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సోదరుడి మృతికి బ్యాంక్ నిర్వాహకులే కారణమని సంతోష్ వాగ్దే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. -
కార్డు చెల్లింపులు.. ఇవాల్టి నుంచే కొత్త రూల్స్
RBI Auto-Debit Payments Rules: డెబిట్, క్రెడిట్ కార్డు యూజర్లకు ముఖ్యగమనిక. ఆటోమేటిక్ చెల్లింపులకు సంబంధించి ఆర్బీఐ కొత్త నిబంధన ఇవాల్టి (అక్టోబర్ 1) నుంచి అమలు అయ్యింది. కొత్త రూల్ ప్రకారం.. చెల్లింపుదారుడి ధృవీకరణ లేకుండా ఇకపై ఐదు వేలకు మించి ఆటోమేటిక్ చెల్లింపులు జరగవు. కచ్చితంగా ఓటీపీ కన్ఫర్మేషన్ జరగాల్సిందే. ఈ విషయాన్ని గుర్తించాలని చెల్లింపుదారులను ఆర్బీఐ అప్రమత్తం చేస్తోంది. అక్టోబర్ 1, 2021 నుంచి ఐదు వేలకు మించిన ఆటోమేటిక్ డెబిట్ చెల్లింపులు.. అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్ (AFA) ఉంటేనే ఆ ట్రాన్జాక్షన్ సక్రమంగా జరిగేది. అంటే ఆటోమేటిక్‌గా కట్ కాకుండా.. ఓటీపీ కన్ఫర్మేషన్ ద్వారానే ఆ చెల్లింపు జరుగుతుంది. వ్యక్తిగత చెల్లింపుల భద్రత కోసం ఈ నిబంధన తీసుకొచ్చినట్లు ఆర్బీఐ చెబుతోంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సబ్ స్క్రిప్షన్ ప్యాక్‌లు, ఫోన్ రీఛార్జీలు, బిల్ పేమెంట్స్, ఇన్సురెన్స్ ప్రీమియమ్, యుటిలిటీ బిల్స్(ఐదు వేలకు మించినవి) ఈ పరిధిలోకి వస్తాయి. ఐదు వేల లోపు ఆటోమేటిక్ కార్డు చెల్లింపులు, అలాగే ‘వన్స్ ఓన్లీ’ పేమెంట్స్‌కు మాత్రం కొత్త నిబంధనలు వర్తించవు. హోం లోన్స్ ఈఎంఐగానీ, ఇతరత్ర ఈఎంఐపేమెంట్స్‌గానీ ఐదువేల రూపాయలకు మించి ఆటోడెబిటింగ్ ఫెసిలిటీ ఉండేది ఇన్నాళ్లూ. అయితే ఇకపై ఇలా కుదరదు. మ్యానువల్‌గా అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ తరహా పేమెంట్స్‌కు యూజర్ల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తారనే ఊహాగానాలు వినిపించినప్పటికీ.. అలాంటిదేం లేదని స్పష్టం చేసింది ఆర్బీఐ. కాకపోతే తాముపేర్కొన్న విధంగా నిబంధనలు పాటించని బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకొనున్నట్లు మొదటి నుంచి చెబుతూ వస్తోంది ఆర్బీఐ. ఈ తరుణంలో ఇప్పటికే చాలా బ్యాంకులు కస్టమర్లకు అలర్ట్ మెసేజ్‌లను, మెయిల్స్‌ను పెట్టేశాయి. చదవండి: లోన్ తీసుకునేవాళ్లకు బ్యాంకుల బంపర్ ఆఫర్స్ -
ఈఎంఐ పేమెంట్స్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్
Auto-Debit For EMI Payments: హోం లోన్స్ ఇతరత్ర నెలవారీ చెల్లింపుల కోసం ఆటో డెబిట్ పేమెంట్ మోడ్‌ను ఆశ్రయిస్తున్నారా? బ్యాంక్ ఖాతా, డెబిట్, క్రెడిట్, మొబైల్ వాలెట్స్ వాడుతున్నారా? అయితే అక్టోబర్ 1 నుంచి అమలు కాబోతున్న కొత్త నిబంధనలను తెలుసుకోండి. ఈ తేదీ నుంచి బ్యాంకులుగానీ, ఇతరత్ర ఫైనాన్షియల్ సంస్థలుగానీ ఆటోమేటిక్ పేమెంట్స్ కోసం కస్టమర్ల నుంచి ‘అదనపు ధృవీకరణ’ను తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. లేకుంటే చెల్లింపులు జరగబోవని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఎలాంటి వాటిపై ప్రభావం అంటే.. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సబ్ స్స్ర్కిప్షన్, మొబైల్ బిల్ పేమెంట్స్, ఇన్సురెన్స్ ప్రీమియమ్, యుటిలిటీ బిల్స్ ఈ పరిధిలోకి వస్తాయి. ఐదు వేల లోపు చెల్లింపుల మీద, అలాగే ‘వన్స్ ఓన్లీ’ పేమెంట్స్‌కు సైతం కొత్త నిబంధనలు వర్తించవు. గడువు తర్వాత తాముపేర్కొన్న విధంగా నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకొనున్నట్లు కూడా స్పష్టం చేసింది ఆర్బీఐ. ఎక్స్ట్రా ఛార్జీలు?? హోం లోన్స్ ఈఎంఐగానీ, ఇతరత్ర పేమెంట్స్‌గానీ ఐదువేల రూపాయలకు మించి ఆటోడెబిట్ మోడ్‌లో కట్ అయ్యేవిధంగా కొందరు సెట్ చేసుకుంటారు కదా. అయితే వీళ్లు ఇకపై మ్యానువల్‌గా అప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానుండగా.. యూజర్ల నెత్తిన పిడుగు తప్పదనే మరోప్రచారం మొదలైంది. ఈ తరహా పేమెంట్స్‌కు యూజర్ల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తారనే కథనాలు కొన్ని జాతీయ మీడియా వెబ్సైట్లలో కనిపిస్తున్నాయి. అయితే ఈ ప్రచారంపై ఆర్బీఐ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఆర్బీఐతో చర్చలకు.. మరోవైపు ప్రైవేట్ బ్యాంకులు ఈ నిబంధన అమలుపై మల్లగుల్లాలు చేస్తున్నాయి. నిజానికి యూజర్ల భద్రత అంశం, ఆన్లైన్ మోసాల కట్టడి అంశాల్ని పరిగణనలోకి తీసుకుని ఆర్బీఐ ఈ నిబంధనను రెండేళ్ల క్రితమే ప్రతిపాదించింది. ఏప్రిల్ 1, 2021 నుంచే ఈ విధానాన్ని అమలు చేయాలనుకుంది. కానీ, ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు కొంత గడువు కోరడంతో.. ఇప్పుడు అక్టోబర్ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. అయితే ప్రైవేట్ బ్యాంకులు ఈ నిబంధన సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఖాతాదారులు, యూజర్లకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రయత్నిస్తామని ప్రకటిస్తూనే.. మరోవైపు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకులు ఆర్బీఐతో చర్చలకు సిద్ధం కావడం కొసమెరుపు. చదవండి: నిలువునా ముంచేసిన బ్యాంకు.. ఊరట అందించిన ఆర్బీఐ -
ఆగస్టు 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే!
మీరు ఎక్కువగా బ్యాంకు సంబంధిత లావాదేవీలు చేస్తుంటారా? అయితే, మీకు ఒక ముఖ్య గమనిక. ఆగస్టు 1 నుంచి బ్యాంకుకు సంబంధించిన కొత్త నిబందనలు అమలులోకి రానున్నాయి. ఈ కొత్త నిబంధనల వల్ల సామాన్యుల మీద ఎక్కవగా భారం పడనుంది. ఏటీఎం లావాదేవీలు, ఎల్పీజీ ధరలు, వేతనాలు, పెన్షన్లు ఇలా చాలా అంశాలకు సంబంధించి కొత్త మార్పులు ఆగస్టు 1 నుంచి చోటు చేసుకొనున్నాయి. సాధారణంగా ప్రతీ నెల ప్రారంభంలో కొత్త నిబందనలు అమల్లోకి వస్తుంటాయి. మరి ఆగస్టు 1 నుంచి అమలులోకి రానున్న కొత్త రూల్స్ ఏంటీ? అవి మిమ్మల్ని ఏ విధంగా ప్రభావితం చేయనున్నయో? తెలుసుకోండి. వేతనం, ఈఎమ్ఐ చెల్లింపులు: నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్(ఎన్ఏసీహెచ్) నిబంధనలలో ఆర్బీఐ మార్పు చేయడం వల్ల సెలవు రోజుల్లో కూడా విద్యుత్, గ్యాస్, టెలిఫోన్, నీరు, జీతం, మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్ సంబంధిత లావాదేవీలు సెలవు రోజుల్లో కూడా జరగనున్నాయి. ఈ కొత్త మార్పులు ఆగస్టు 1, 2021 నుంచి అమల్లోకి వస్తాయి. రియల్ టైమ్ గ్రాస్ సెటిల్ మెంట్(ఆర్ టీజిఎస్), ఎన్ఏసిహెచ్ సేవలు 24ఎక్స్7 అందుబాటులో ఉంటాయని ఆర్బీఐ పేర్కొంది. ఎన్ఏసీహెచ్ అనేది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్ పీసీఐ) చేత నిర్వహించబడుతుంది. ఎటిఎమ్ క్యాష్ విత్ డ్రా: జూన్ నెలలో ఆర్బీఐ తీసుకొచ్చిన మరో ఆర్డర్ ప్రకారం, ఆగస్టు 1 నుంచి ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్స్(ఏటీఎం) చార్జీలు పెరగనున్నాయి. ఏటీఎం కేంద్రాల నిర్వహణ భారంగా మారిందన్న బ్యాంక్ ఆందోళన నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఇంటర్ చేంజ్ ఫీజ్ ను ₹2 పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. తాజాగా వచ్చే ఆగస్టు 1 నుంచి ఏటీఎం కేంద్రాల్లోనూ ఒక్కో ఆర్ధిక లావాదేవీపై ఇంటర్ ఛేంజ్ ఫీజు రూ.15 నుంచి రూ.17కు, ఆర్ధికేతర లావాదేవీలపై రూ.5 నుంచి రూ.6కు పెరగనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు చెందిన డెబిట్ కార్డులు 90 కోట్ల వరకు వాడుకలో ఉన్నాయి. ఐపీపీబీ డోర్ స్టెప్ సేవలు ఖరీదు: ఇప్పటి వరకు ఉచితంగా అందిస్తున్న ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ డోర్ స్టెప్ సేవలకు ఇక నుంచి ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఛార్జీలను, సేవింగ్స్ అకౌంట్ల వడ్డీ రేట్లను ఐపీపీబీ సవరించింది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఛార్జీలు 01 ఆగస్టు 2021 నుంచి వర్తిస్తాయి. ప్రస్తుతం, డోర్ స్టెప్ బ్యాంకింగ్ సంబంధించి ఎలాంటి ఛార్జీలు లేవు. ఇక ఆగస్టు 1, 2021 నుంచి ప్రతి కస్టమర్ ఐపీపీబీ డోర్ స్టెప్ అభ్యర్థనకు బ్యాంకింగ్ ఛార్జీల కింద రూ.20 + జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఒకే కస్టమర్ ఎక్కువ సార్లు అభ్యర్థనలు చేయడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ సర్వీస్ ఛార్జీలు: భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు ఐసీఐసీఐ తన దేశీయ పొదుపు ఖాతాదారులకు నగదు లావాదేవీలు, ఎటిఎం ఇంటర్ చేంజ్, చెక్ బుక్ ఛార్జీల సవరించిన్నట్లు తెలిపింది. ఈ మార్పులు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ వెబ్ సైట్ తెలిపింది. అన్ని నగదు లావాదేవీలపై ఛార్జీల సవరణ వర్తిస్తుంది.ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలలో నెలకు మొత్తం 4 ఉచిత నగదు లావాదేవీలను అనుమతించింది. ఆ తర్వాత లావాదేవీలకు ఛార్జీలు వర్తిస్తాయి.ప్రతి ఆర్థిక లావాదేవీకి బ్యాంకు ₹20, ఆర్థికేతర లావాదేవీకి ₹8.50 వసూలు చేస్తుంది. ఆగస్టు 1 నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారుల హోమ్ బ్రాంచీలో నగదు లావాదేవీ పరిమితి నెలకు రూ.1 లక్ష వరకు ఉచితం. లక్షకు పైగా జరిపే ప్రతి లావాదేవిపై ₹1,000కు ₹5 చెల్లించాలి. కనీస రుసుము ₹150గా ఉంది. ఎల్పీజీ ధరలు: ఎల్పీజీ ధరలను గ్యాస్ ఏజెన్సీలు ప్రతి నెల ఒకటో తేదీన సవరిస్తాయి. జూలై నెల 1 తేదీన ఎల్పీజీ ధరలను రూ. 26 పెంచాయి. మరి ఈ నెల పెరగనున్నాయా? తగ్గనున్నాయా? అనేది ఆగస్టు 1 తేదీన తెలవనుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ): 15సీఏ, 15సీబీ ఫామ్స్ ఎలక్ట్రానిక్ ఫైలింగ్ విషయంలో పలు సడలింపులు ఇచ్చింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. గతంలో జూలై 15 వరకు ఉన్న చివరి తేదీని ఆగస్ట్ 15కి పొడిగించింది. -
ఉద్యోగులకు, పెన్షన్ దారులకు ఆర్బీఐ శుభవార్త!
ఉద్యోగులకు, పెన్షన్ దారులకు ఆర్బీఐ శుభవార్త అందించింది. ఇక మీ జీతం, పెన్షన్ డబ్బులు సెలవు రోజుల్లో పడనున్నాయి. ఇప్పటి వరకు వేతనం, పెన్షన్ డబ్బులు, ఈఎమ్ఐ చెల్లింపులు చేయడం అనేది బ్యాంక్ సెలవు రోజుల్లో వీలు కాకపోయేది. కానీ, కొత్తగా ఆర్బీఐ నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్(ఎన్ఏసీహెచ్) నిబంధనలలో మార్పు చేయడం వల్ల సెలవు రోజుల్లో కూడా మీ జీతం, పెన్షన్ డబ్బులు మీ ఖాతాలో జమ కానున్నాయి. ఈ కొత్త మార్పులు ఆగస్టు 1, 2021 నుంచి అమల్లోకి వస్తాయి. ఇకపై జీతాలు, పెన్షన్, వడ్డీ, ఈఎంఐలు, టెలిఫోన్ బిల్లులు, గ్యాస్ బిల్లులు, సిస్టమెటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లాంటివన్నీ ఒకటో తేదీన జమ/కట్ కావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు బ్యాంక్ పనిదినాల కోసం మీ జీతం లేదా పెన్షన్ డబ్బుల క్రెడిట్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఎన్ఏసీహెచ్ సేవలు వారానికి ఏడు రోజులు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం, బ్యాంకులు తెరిచి ఉన్నప్పుడు ఎన్ఏసీహెచ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. కొన్నిసార్లు నెల మొదటి రోజు వారాంతంలో వస్తుంది. దీని కారణంగా ప్రజలు బ్యాంక్ పని దినం వరకు వేచి ఉండాలి. జూన్ క్రెడిట్ పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వినియోగదారుల అందించే సేవలను మరింత పెంచడానికి రియల్ టైమ్ గ్రాస్ సెటిల్ మెంట్(ఆర్ టీజిఎస్), ఎన్ఏసిహెచ్ సేవలు 24ఎక్స్7 అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఎన్ఏసీహెచ్ అనేది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్ పీసీఐ) చేత నిర్వహించబడుతుంది. -
రుణగ్రహీతలకు ‘సుప్రీం’ ఊరట!
న్యూఢిల్లీ: తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఆగస్టు 31వరకు మొండిపద్దుల కిందకు రాని అకౌంట్లు వేటినీ ఎన్పీఏలుగా ప్రకటించవద్దని గతంలో ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను సుప్రీంకోర్టు మరో రెండు వారాలు పొడిగించింది. మారటోరియం సమయంలో చెల్లించని వాయిదాలపై వడ్డీ విధింపు అంశాన్ని పరిశీలించేందుకు ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేశామని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది. రెండు వారాల్లో ఈ విషయమై అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆర్బీఐ, కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది. అన్ని అంశాలను సమగ్రంగా పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాలని సూచిస్తూ విచారణను ఈనెల 28కి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఈ విషయంలో తుది నిర్ణయానికి ఇదే ఆఖరు అవకాశమని, ఆపై ఈ అంశాన్ని వాయిదా వేయడం కుదరదని కోర్టు స్పష్టం చేసింది. కరోనా సంక్షోభం వేళ ఈఎంఐలపై మారటోరియం విధిస్తూ గతంలో ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సమయంలో చెల్లించని వాయిదాలపై వడ్డీ వేయడాన్ని సవాలు చేస్తూ రుణగ్రహీతలు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు, తుది ఆదేశాలు ఇచ్చేవరకు ఆగస్టు 31వరకు ఎన్పీఏలు కాని ఏ అకౌంట్లనూ ఎన్పీఏలుగా ప్రకటించవద్దని ఆదేశించింది. వడ్డీపై వడ్డీతో ఇబ్బంది..: ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న రుణ పునర్వ్యవస్థీకరణతో 95 శాతం మంది రుణగ్రహీతలకు న్యాయం జరగదని క్రెడాయ్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టు దృష్టికి తెచ్చారు. బ్యాంకులు రుణగ్రహీతల అకౌంట్ల డౌన్‌గ్రేడింగ్ చేస్తూనే ఉన్నాయని, దీన్ని నిలిపివేయాలని, మారటోరియంను పొడిగించాలని కోరారు. బ్యాంకులు మారటోరియం సమయానికి చక్రవడ్డీలు లెక్కకడుతున్నాయని మరో న్యాయవాది రాజీవ్ దత్తా చెప్పారు. లక్షలాది మంది కరోనా కారణంగా ఆస్పత్రుల పాలయ్యారని, అనేకమంది ఉపాధి కోల్పోయారని, ఈ సమయంలో వడ్డీ మీద వడ్డీ అడగడం సబబు కాదని వాదించారు. అయితే ఉన్న నియమాల ప్రకారమే డౌన్‌గ్రేడింగ్ జరుగుతోందని ఆర్బీఐ న్యాయవాది వీ గిరి చెప్పారు. అన్ని అంశాలను అత్యున్నత స్థాయిలో పరిశీలిస్తున్నందున రెండువారాల సమయం ఇవ్వాలని కోరారు. తాజా విచారణలో కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ప్రభుత్వం అన్ని అంశాలనూ అత్యున్నత స్థాయిలో పరిశీలిస్తోందని చెప్పారు. సరైన నిర్ణయం తీసుకొనేందుకు రెండువారాల సమయం ఇవ్వాలని కోరారు. వాదనలన్నీ విన్న కోర్టు 2 వారాల్లో సరైన పరిష్కారంతో రావాలని, ఆపై తాము తుది నిర్ణయం తీసుకుంటామంది. రాజీవ్ మహర్షి నేతృత్వం మారటోరియం సమయంలో రుణాలపై వడ్డీ రద్దు అంశాన్ని సమీక్షించి, సిఫారసులు చేయడానికి రాజీవ్ మహర్షి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం గురువారం ప్రకటించింది. -
వడ్డీమీద వడ్డీనా..?
న్యూఢిల్లీ: కోవిడ్–19 కష్ట కాలంలో బ్యాంకింగ్ రుణ బకాయిల నెలవారీ చెల్లింపులపై (ఈఎంఐ) ప్రకటించిన మారటోరియం విధానం ఇందుకు సంబంధించిన ప్రయోజనం నెరవేరేట్లు లేదని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇది వడ్డీమీద వడ్డీ విధింపులా ఉందని పేర్కొంటూ, ఇలాంటి విధానంలో ఔచిత్యం ఏదీ కనబడ్డంలేదని వ్యాఖ్యానించింది. కేసు తదుపరి విచారణను ఆగస్టు మొదటి వారానికి వాయిదా వేసిన జస్టిస్ అశోక్ భూషన్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం, మారటోరియం పథకాన్ని పునఃసమీక్షించాలని కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) లకు సూచించింది. ఈ అంశాన్ని పరిశీలించాలని కేంద్రానికి ప్రత్యేకంగా సూచించిన అత్యున్నత న్యాయస్థానం, ఈ వ్యవహారాన్ని బ్యాంకులకు పూర్తిగా వదిలేయరాదనీ స్పష్టంచేసింది. ఇది కస్టమర్‌కు, బ్యాంకులకు మధ్య వ్యవహారమని కేంద్రం చెప్పనేరదనీ తెలిపింది. అసలు ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయని అత్యున్నత న్యాయస్థానం ఈ సందర్భంగా పేర్కొంది. ఇందులో మారటోరియం కాలంలో అసలు వడ్డీ విధించకపోవడం ఒకటికాగా, వడ్డీమీద వడ్డీ విధింపు (మారటోరియం కాలంలో వడ్డీని అసలుకు కలిపి, తిరిగి వడ్డీ విధించడం) రెండవదని అభిప్రాయపడింది. మొత్తం వడ్డీ రద్దుకాకపోయినా, వడ్డీమీద వడ్డీనైనా తొలగించే విధానం ఉండాలని సూచించింది. 21వ అధికరణకు విఘాతం కోవిడ్–19 నేపథ్యంలో బ్యాంకింగ్ రుణ బకాయిల నెలవారీ చెల్లింపులపై ఆగస్టు 31వ తేదీ వరకూ అమలుకానున్న మారటోరియం సమయంలో విధించే వడ్డీరేటు సమంజసం కాదంటూ, ఆగ్రాకు చెందిన గజేంద్ర శర్మ అనే వ్యక్తి దాఖలు చేసిన ఒక పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఈ అంశాన్ని విచారిస్తున్న త్రిసభ్య ధర్మాసనంలో జస్టిస్ అశోక్ భూషన్, జస్టిస్ ఎస్కే కౌల్, ఎంఆర్ షాలు ఉన్నారు. నిజానికి మే 31 వరకూ అమల్లో ఉన్న ‘మారటోరియం’ను ఆగస్టు 31 వరకూ పొడిగించిన సంగతి తెలిసిందే. మారటోరియం కాలంలో వడ్డీ భారం వేయడం రుణ గ్రహీతలకు శిక్ష విధించడమేనని పిటిషనర్ తరఫు న్యాయవాది అతున్నత న్యాయస్థానానికి విన్నవించారు. రాజ్యాంగంలోని 21వ అధికరణం కల్పిస్తున్న ‘జీవించే హక్కు’కు ఇది విఘాతం కలిగిస్తోందని కూడా కోర్టుకు తెలిపారు. మారటోరియం సమయంలో వడ్డీభారం లేని రుణ పునఃచెల్లింపులకు వీలుకల్పిస్తూ కేంద్రం, ఆర్బీఐలకు ఆదేశాలు ఇవ్వాలనీ ఆయన కోరారు.ఈ అంశంపై కొత్త మార్గదర్శకాలు తెచ్చే అవకాశం ఏదైనా ఉంటుందా? అన్న అంశంపై ఆలోచన చేయాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌కూ తాజాగా సుప్రీం సూచించింది. మా ప్రయోజనాలకు విఘాతం: డిపాజిటర్లు రుణ చెల్లింపులపై మారటోరియం కాలంలో వడ్డీని మాఫీ చేస్తే అది బ్యాంకు డిపాజిటర్ల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని అఖిల భారత డిపాజిటర్ల అసోసియేషన్ (ఏఐబీడీఏ) ఆందోళన వ్యక్తం చేసింది. ఎటువంటి వడ్డీ మాఫీ అయినా అది రుణ సంస్కృతిని దెబ్బతీస్తుందని, బ్యాంకుల ఆర్థిక పరిస్థితిపై దాని ప్రభావం ఉంటుందని పేర్కొంది. రుణాలపై వడ్డీ మాఫీకి అనుమతిస్తే.. అప్పుడు బ్యాంకులు అనివార్యంగా తమ వడ్డీ ఆదాయ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు డిపాజిట్లపై వడ్డీ రేట్లను మరింత తగ్గిస్తాయని ఏఐబీడీఏ ఆందోళన వ్యక్తం చేసింది. చారిత్రకంగా చూస్తే రుణాలపై వడ్డీ రేట్లను మాఫీ చేస్తే సార్వభౌమ (కేంద్ర ప్రభుత్వం) రక్షణ ఉంటుందని, కానీ ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయ నష్టాలున్న పరిస్థితుల్లో అందుకు అవకాశం ఉండదని పేర్కొంది. వడ్డీ రద్దు అంత తేలిక్కాదు: కేంద్రం, ఆర్బీఐ కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా త్రిసభ్య ధర్మాసనం ముందు తన వాదనలు వినిపిస్తూ, రుణాలపై వడ్డీ పూర్తి రద్దు బ్యాంకులకు అంత తేలిక్కాదని విన్నవించారు. బ్యాంకులు కూడా తమ డిపాజిట్లకు వడ్డీరేటు చెల్లించాలన్న విషయాన్ని గుర్తించాల్సి ఉంటుందని అన్నారు. రూ.133 లక్షల కోట్ల డిపాజిట్లు బ్యాంకుల వద్ద ఉన్నాయని సొలిసిటర్ జనరల్ వివరించారు. రుణాలపై వడ్డీని రద్దు చేస్తే, బ్యాంకింగ్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. ఆర్థిక స్థిరత్వానికీ ఇది ప్రతికూలమన్నారు. బ్యాంక్స్ అసోసియేషన్, ఎస్బీఐ న్యాయవాది ఈ అంశంపై విచారణను మూడు నెలలు వాయిదా వేయాలని సుప్రీంకోర్టును కోరారు. అసలు వడ్డీరద్దు అంశంపై ఇప్పటికిప్పుడు ఒక నిర్ణయం తీసుకోవడం ‘ముందస్తు’ నిర్ణయం అవుతుందని, ప్రతి ఖాతాకు సంబంధించి వేర్వేరుగా ఈ అంశాన్ని పరిశీలించాల్సి ఉంటుందనీ ఆయన అన్నారు. మారటోరియం కాలంలో వడ్డీ తొలగిస్తే, బ్యాంకింగ్‌పై ఆ ద్రవ్య భారం ఎంత ఉందన్న విషయంపైనా ఒక అంచనాకు రావాల్సి ఉందని న్యాయవాది పేర్కొన్నారు. -
రుణం కాకూడదు భారం!
‘మన పరిధిల్లోనే మనం జీవించాలి’ ఆర్థిక నిపుణులు ఇచ్చే సూచన ఇది. అంటే తమకు వస్తున్న ఆదాయాన్ని మించి ఖర్చులకు వెళ్లకపోవడం సురక్షితం. మెరుగైన జీవనం కోరుకునే వారు.. ముందు తమ ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించాలి. అయితే, ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో అప్పు అవసరం ఏర్పడవచ్చు. తీసుకునే రుణం మీకు లాభం తెచ్చిపెట్టాలి కానీ, మీ విలువను హరించివేసి అప్పుల ఊబిలోకి నెట్టేయకూడదు. అదే విధంగా మీ జీవిత లక్ష్యాలకు విఘాతంగా మారకూడదు. అవకాశం ఉన్నంత మేర రుణం పుచ్చుకోవడం కాకుండా.. తమ చెల్లింపుల సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవడం శ్రేయస్కరం. మన దేశంలో బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు.. రుణం ఇచ్చే ముందు దరఖాస్తు దారుల నెలవారీ నికర ఆదాయంలో 50 శాతాన్ని చెల్లింపుల సామర్థ్యంగా పరిగణనలోకి తీసుకుంటాయి. అప్పటికే ఏవైనా రుణాలు తీసుకుని ఈఎంఐ చెల్లిస్తుంటే ఆ మొత్తాన్ని నికర ఆదాయం నుంచి మినహాయించి రుణ అర్హతలను నిర్ణయిస్తాయి. ఉదాహరణకు రమణ ప్రతీ నెలా నికరంగా రూ.లక్ష చొప్పున వేతనం పొందుతున్నాడని అనుకుంటే.. అందులో 50 శాతం రూ.50,000 అవుతుంది. అయితే, అప్పటికే రమణ తన కారు కోసం రూ.10,000 ఈఎంఐ చెల్లిస్తున్నాడు. దీంతో రమణ వద్ద మిగిలి ఉన్న రుణ చెల్లింపుల సామర్థ్యం రూ.40,000 అవుతుంది. ఈ విధంగా చూస్తే.. 9 శాతం వడ్డీ రేటుపై 15 ఏళ్ల కాలానికి రూ.40 లక్షల గృహ రుణాన్ని రమణ సొంతం చేసుకోవచ్చు. నెలవారీ ఆదాయంలో 50 శాతానికి ఈఎంఐను ఖరారు చేస్తే.. మిగిలిన 50 శాతం నుంచి మీ ఖర్చులుపోను భవిష్యత్తు లక్ష్యాల కోసం పొదుపు చేసుకునేందుకు దాదాపు మిగిలేది ఏమీ ఉండదు. దీంతో కొన్నింటి విషయంలో రాజీ పడాల్సి వస్తుంది. కొనుగోళ్లను వాయిదా వేసుకోవాల్సి రావచ్చు. ఎత్తు పల్లాలను ఎదుర్కొనే వెసులుబాటు కూడా తగ్గిపోతుంది. అందుకే మీకున్న గరిష్ట రుణ అర్హత పరిధిలో ఎంత వరకు రుణం తీసుకుంటే.. నెల నెలా చెల్లింపులు చేయడం సౌకర్యంగా ఉంటుందన్నది మీరే నిర్ణయించుకోవాలి. మీ జీవన వ్యయాలు, ప్రస్తుత ఈఎంఐల మొత్తంతోపాటు.. ఇతర లక్ష్యాల కోసం ఆదాయంలో 15–20 శాతం మేర పొదుపును మినహాయించిన తర్వాతే ఈఎంఐపై స్పష్టతకు రావాలి. విలువను పెంచుకునేందుకు.. పెట్టుబడి కోసం, ఆస్తి కొనుగోలు కోసమో రుణం తీసుకుంటుంటే అందులో ‘లాభం’ సూత్రం దాగుండాలి. తీసుకున్న రుణానికి చేస్తున్న ఖర్చులకు మించి ఆదాయం ఇచ్చేది అయితేనే ప్రయోజనం లభిస్తుంది. లేదా కనీసం మీ నికర విలువను పెంచే వాటిపై రుణాన్ని ఖర్చు చేసినా పయ్రోజనం సిద్ధిస్తుంది. మన దేశంలో రిటైల్ రుణాలపై (గృహ రుణం మినహా) వడ్డీ రేట్లు అధిక స్థాయిల్లోనే ఉంటున్నాయి. ఈ రేట్లకు మించి పెట్టుబడులపై రాబడినిచ్చే సాధానాలు అరుదే. అయితే, తీసుకుంటున్న రుణాన్ని మీ నికర విలువను (నెట్‌వర్త్) తగ్గించేది కాకుండా పెంచేదానిపై ఇన్వెస్ట్ చేయడం మంచి విధానం అవుతుంది. ఇది ఎలా అంటారా..? భూమి కొనుగోలు, ఉన్నత విద్యార్హతల కోసం రుణం తీసుకోవడం. కొనుగోలు చేసిన భూమి విలువ పెరిగినా.. అదనపు విద్యార్హత అధిక ఆదాయానికి దారితీసినా మీ రుణ లక్ష్యం నెరివేరినట్టే. ఇలా కాకుండా రుణం తీసుకుని ఆకర్షణీయమైన ఫీచర్లతో చూడముచ్చటగా ఉన్న డబుల్ డోర్ ఫ్రిడ్జ్, స్మార్ట్‌ఫోన్, హోమ్ థియేటర్ సిస్టమ్స్ వంటివి కొనుగోలు చేశారనుకోండి.. కాలం గడుస్తున్న కొద్దీ అవి విలువను కోల్పోతాయి. వీటి వల్ల రెండు విధాలా నష్టం ఎదురవుతుంది. వీటి కోసం రుణం తీసుకోవడం వల్ల వడ్డీ రూపంలో నష్టం ఒకటి అయితే.. కొనుగోలు చేసిన ఈ వస్తువుల విలువ కొంత కాలానికి జీరోకి చేరుకోవడం మరో నష్టం. వినియోగం కోసం లేక వినోద అనుభవం కోసం రుణం తీసుకోవడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని అర్థం చేసుకోవాలి. కనీసం జీవితంలో ముఖ్యమైన లక్ష్యాల కోసం తగినంత నిధిని సమకూర్చుకునే వరకు అయినా.. ఇటువంటి వినియోగ, వినోద, విలాసాల కోసం రుణానికి దూరంగా ఉండడం ఆరోగ్యకరం. సామర్థ్యాన్ని మించొద్దు.. వేతన జీవులకు ఏటా ఎంతో కొంత ఆదాయం పెరుగుతుండడం సహజం. అయి తే, కచ్చితంగా పెరుగుతుందని అన్ని సందర్భాల్లోనూ చెప్పలేము. సమీప కాలంలో ఆదాయం పెరుగుతుందన్న అంచనాతో అధిక ఈఎంఐను ఎంచుకునే వారు కూడా ఉంటారు. కానీ, ఇలా చేయడం వల్ల పెరిగే వేతనంతో తొందరగా రుణ భారాన్ని తొలగించుకునే అవకాశాన్ని కోల్పోయినట్టవుతారు. ముఖ్యంగా కరోనా నేపథ్యంలో ఉద్యోగ, వేతన కోతలను చవిచూస్తున్నారు. ఆర్థిక సంక్షోభాల్లోనూ లేదా విడిగా ఆయా కంపెనీలు సంక్షోభాల్లోకి వెళ్లిన సందర్భాల్లో ఉద్యోగులకు రిస్క్ ఏర్పడుతుంది. కనుక భవిష్యత్తులో ఆదాయం పెరుగుతుందన్న అంచనాలతో కాకుండా.. ప్రస్తుత చెల్లింపుల సామర్థ్యాన్ని మించి రుణాలకు వెళ్లకుండా ఉండడం మంచిది. మెరుగైన ఆఫర్ రుణం తీసుకునే ముందు వడ్డీ రేటు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. నేడు వడ్డీ రేట్లు తక్కువ స్థాయిలకు దిగొస్తున్నాయి. బ్యాంకులు రెపో ఆధారిత రుణాలను 6–7 శా తానికే ఆఫర్ చేస్తున్నాయి. కనుక రుణం తీసుకునే ముందు పలు సంస్థలను సంప్రదించి తక్కువ రేటుకు రుణాన్ని పొందడం వల్ల చెల్లింపుల భారాన్ని కొంతైనా తగ్గించుకోవచ్చు. అధిక ఈఎంఐ రుణం తీసుకునే సమయంలో చాలా మంది ఈఎంఐపైనే ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. రుణమిచ్చే సంస్థలు చెల్లింపులు సౌకర్యంగా ఉండేందుకు.. దీర్ఘకాలానికి రుణాన్ని, తక్కువ ఈఎంఐపై ఆఫర్ చేస్తుంటాయి. కానీ, కాల వ్యవధిని (లోన్ టర్మ్) దీర్ఘకాలానికి నిర్ణయించడం వల్ల.. రుణ గ్రహీత కంటే రుణదాతకే ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వడ్డీ చెల్లింపులు సుదీర్ఘకాలం పాటు కొనసాగుతాయి. ఉదాహరణకు రూ.50 లక్షల రుణాన్ని 15 సంవత్సరాల కాలానికి 9 శాతం వడ్డీపై తీసుకున్నారని అనుకుందాం. అప్పుడు నెలవారీ చెల్లించాల్సిన వాయిదా (ఈఎంఐ) రూ.50,713 అవుతుంది. దీంతో 15 ఏళ్ల కాలానికి చెల్లించే మొత్తం రూ.91.28 లక్షలు అవుతుంది. ఒకవేళ రుణ కాల వ్యవధి 20 ఏళ్లకు పెంచుకుంటే ఈఎంఐ రూ.44,986 అవుతుంది. కానీ, 20 ఏళ్లలో చెల్లించే మొత్తం రూ.1.07 కోట్లకు పెరుగుతుంది. 15 ఏళ్ల కాలంలో వడ్డీ రూపంలో చెల్లించేది రూ.41.2 లక్షలు అయితే, 20 ఏళ్ల కాలంలో రూ.57.9 లక్షలుగా ఉంటుంది. కనుక రుణం విషయంలో కాల వ్యవధిని పెంచుకోకుండా, ఈఎంఐ పెంచుకునే విషయమై బ్యాంకుతో సంప్రదింపులు చేసుకోవాలి. వడ్డీ రేట్లు పెరుగుతూ పోతుంటే వాస్తవ ఈఎంఐకి అదనంగా వెసులుబాటు ఉన్నంత మేరకు చెల్లించుకోవడం ఇంకా మంచిది. -
రుణాలపై మారటోరియం: సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : మారటోరియం వ్యవధిలో పేరుకుపోయిన రుణ వాయిదాల(ఈఎంఐ)పై బ్యాంకులు వడ్డీని వసూలు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐకి సుప్రీంకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఈఎంఐల చెల్లింపుపై మారటోరియంను ఆగస్ట్ 31 వరకూ ఆర్బీఐ పొడిగించిన అనంతరం ఈ పిటిసన్ దాఖలైంది. ఆర్బీఐ తొలుత రుణ వాయిదాల చెల్లింపుపై మూడు నెలల మారటోరియం ప్రకటించి మరో మూడు నెలల పాటు పొడిగించిందని పిటిషనర్ తరపు వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ రాజీవ్ దత్తా పేర్కొన్నారు. కోవిడ్-19 సంక్షోభ సమయంలో ఇప్పుడు ఉపశమనం అవసరమని, చెల్లించని వాయిదాలపై వడ్డీ వేస్తూ చక్రవడ్డీతో నడ్డివిరచరాదని ఆయన సర్వోన్నత న్యాయస్ధానాన్ని అభ్యర్ధించారు. దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో ప్రజల రాబడి పడిపోయిన క్రమంలో మారటోరియం సమయంలో రుణ వాయిదాలపై వడ్డీ వసూలు చేయడం అన్యాయమని దత్తా ఆందోళన వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌తో ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండంగా మారటోరియం సమయంలో చెల్లించని రుణ వాయిదాలపై వడ్డీ భారం మోపడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. చదవండి : ఆర్బీఐకి చిదంబరం కీలక సూచన కరోనా వైరస్ సంక్షోభంతో వివిధ రంగాల్లో పనిచేసే పలువురు ఉద్యోగులను జీతం చెల్లించకుండా యాజమాన్యాలు సెలవుపై వెళ్లాలని కోరాయని గుర్తుచేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు దీనిపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐని కోరుతూ నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై వచ్చే వారం విచారణ కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేసింది. -
‘వాయిదా’ మరో 3 నెలలు పొడిగింపు?
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడి కోసం లాక్‌డౌన్‌ను మరింతగా పొడిగించిన నేపథ్యంలో రుణాల వాయిదాలపై విధించిన మారటోరియంను కూడా మరో 3 నెలలు పొడిగించే అవకాశం రిజర్వ్ బ్యాంక్ పరిశీలనలో ఉంది. లాక్డౌన్ కొనసాగింపు కారణంగా ఇటు వ్యక్తులు, అటు సంస్థలకు ఆదాయాలొచ్చే మార్గాలు లేనందున మారటోరియంను పొడిగించాలంటూ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సహా వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను ఆర్బీఐ పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. లాక్డౌన్ నేపథ్యంలో మూడు నెలల పాటు వాయిదాల చెల్లింపులపై మారటోరియం విధిస్తూ మార్చి 27న ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీని గడువు మే 31తో ముగిసిపోనుంది. అయితే, లాక్డౌన్ పొడిగించడం, ఎత్తివేత తర్వాత కూడా రుణ గ్రహీతలకు తక్షణమే తగు ఆదాయాలు వచ్చే అవకాశం లేకపోవడం వంటి అంశాల కారణంగా మారటోరియంను పొడిగించడమే శ్రేయస్కరమని ప్రభుత్వ రంగ బ్యాంకు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కష్టకాలంలో ఇటు రుణగ్రహీతలకు, అటు బ్యాంకులకు ఇది ఊరటనివ్వగలదని పేర్కొన్నారు. -
‘వైఎస్సార్ సున్నా వడ్డీ’కి రూ. 765 కోట్లు విడుదల
-
‘వైఎస్సార్ సున్నా వడ్డీ’కి రూ. 765 కోట్లు విడుదల
సాక్షి, అమరావతి : ఆర్ధిక ఇబ్బందుల్లోనూ రాష్ట్రంలో ‘వైఎస్సార్ సున్నా వడ్డీ' పథకం అమలు చేయనున్నట్లు ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ సోమవారం వెల్లడించారు. ఈ మేరకు పొదుపు సంఘాల ఖాతాల్లోకి రూ.1,400 కోట్లు విడుదల చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 24న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా పథకం పునఃప్రారంభం చేయనున్నట్లు తెలిపారు. దీని ద్వారా 93 లక్షల మంది పొదుపు సంఘాల మహిళలకు ప్రయోజనం చేకూరనుందని అన్నారు. (రోడ్డుపై ఆటలాడిన చిరుత పులి పిల్లలు) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాం నుంచే అమలులో ఉన్న ‘వైఎస్సార్ సున్నా వడ్డీ' పథకాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. 2016 జూన్ నుంచి ఈ పథకం అమలుకు నోచుకోలేదని, వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ పథకాన్ని పునఃప్రారంభించనుందని తెలిపారు. స్వయం సహాయక సంఘాలు తీసుకున్న రుణాలపై వడ్డీ చెల్లింపుల కోసం రూ.765 కోట్లు విడుదల చేస్తూ ఆర్ధికశాఖ ప్రత్యేక కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. (ఈ రోజు నాకెంతో ప్రత్యేకం) -
మీ ఈఎంఐ కట్ చేయొద్దా?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శ్రీనివాస్‌కు ఎస్బీఐ బ్యాంక్‌లో వాహన రుణం ఉంది. ప్రతి నెల లాగే రూ.6,150 ఈఎంఐ వాయిదా గడువు ఏప్రిల్ 6. కాబట్టి మీ బ్యాంక్ ఖాతాలో సరిపడా నగదు నిల్వ ఉంచుకోవాలని సందేశం వచ్చింది’’ కిషోర్‌కు హెచ్‌డీఎఫ్‌సీలో పర్సనల్ లోన్ ఉంది. తనక్కూడా ఖాతాలో తగిన నిల్వ ఉంచుకోవాలని మెసేజ్ వచ్చింది. అయినా అదేంటి? ఆర్బీఐ మూడు నెలల మారటోరియం ప్రకటించిందిగా.. మళ్లీ ఈ మెసేజ్ ఏంటని శ్రీనివాస్, కిషోర్ సందేహం. నిజానికిది వీళ్లిద్దరి సందేహమే కాదు. క్రెడిట్ కార్డ్స్‌తో సహా పర్సనల్ లోన్, వెహికల్ లోన్, హౌసింగ్ లోన్... ఇలా అన్ని రకాల రుణ ఖాతాదారులదీనూ!!. కరోనా వైరస్ నేపథ్యంలో దేశంలో నెలకొన్న ఆర్థిక అనిశ్చితి కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నెలవారీ రుణ వాయిదా (ఈఎంఐ) చెల్లింపుల మీద మూడు నెలల మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. మన దేశంలో చాలా వరకు ఈఎంఐలు ప్రతి నెలా మొదటి వారంలో ఆటోమేటిక్‌గా కస్టమర్ బ్యాంక్ ఖాతా నుంచి కట్ అవుతుంటాయి. ఈఎంఐను దృష్టిలో పెట్టుకొని ఖాతాలో నగదు నిల్వ ఉంచుకుంటారు. అయితే ఆర్బీఐ మారటోరియం నేపథ్యంలో సిస్టమ్ సాఫ్ట్‌వేర్‌లో మూడు నెలల మారిటోరియంను లాక్ చేశామని, దీంతో ఆటోమేటిక్‌గా ఈఎంఐ నిలిచిపోతుందని ఎస్బీఐకి చెందిన సీనియర్ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలియజేశారు. ఒకవేళ ఈఎంఐ కట్ అయితే గనక ఆందోళన చెందవద్దని.. సంబంధిత మొబైల్ సందేశాన్ని బ్యాంక్ శాఖకు మెయిల్ ద్వారా తెలియజేస్తే.. తిరిగి ఖాతాలో సొమ్ము జమ అవుతుందని వెల్లడించారు. ఈఎంఐ వాయిదా వద్దా? ఒకవేళ ఎవరైనా రుణ ఖాతాదారులు మూడు నెలల మారటోరియాన్ని వద్దనుకుంటే మాత్రం ఖాతాదారులే స్వయంగా లేదా మెయిల్ ద్వారా సంబంధిత బ్యాంక్ శాఖను సంప్రదించాల్సి ఉంటుంది. ఏ బ్యాంక్ నుంచైతే ఈఎంఐ కట్ అవుతుందో ఆ బ్యాంక్ శాఖకు సమాచారం అందించాలి. ఉదాహరణకు బ్యాంక్ అకౌంట్ ఎస్బీఐలో ఉండి, వాహన రుణం హెచ్‌డీఎఫ్‌సీలో ఉందనుకుందాం. అలాంటప్పుడు ఈఎంఐ కట్ అవుతుంది ఎస్బీఐలోనే కనక.. రుణ వాయిదాను నిలుపుదల చేయాల్సిన అవసరం లేదని సంబంధిత ఎస్బీఐ శాఖకు మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఈ పద్ధతిలో ఎవరైనా కస్టమర్లు మూడు నెలల పాటు కాకుండా ఒకటి లేదా రెండు నెలలు మాత్రమే మారటోరియం కావాలన్నా కూడా ఎంపిక చేసుకునే వీలుంటుందని బ్యాంక్ అధికారులు తెలియజేశారు. ఈసీఎస్ పరిస్థితేంటి? ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీసెస్ (ఈసీఎస్), డిమాండ్ డ్రాఫ్ట్, (డీడీ), ఓవర్ డ్రాఫ్ట్ (ఓడీ) వంటి ద్వారా ఈఎంఐ ఉపసంహరణ ఉన్న ఖాతాదారులు మారటోరియం ఆప్షన్‌ను ఎంచుకోవాలనుకుంటే మాత్రం వ్యక్తిగతంగా గానీ మెయిల్ లేదా ఇతర డిజిటల్ మాధ్యమాల ద్వారా గానీ సంబంధిత బ్యాంక్ శాఖను సంప్రదించాలి. అంతే తప్ప భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నందువల్ల బ్యాంకే స్వయంగా ఈసీఎస్‌ను నిలుపుచేసే నిర్ణయాన్ని తీసుకోబోదని ఎస్బీఐకి చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలియజేశారు. క్రెడిట్ కార్డ్ బాకీలు, ఈఎంఐలకు కూడా ఈ మారటోరియం వర్తిస్తుంది. మూడు నెలల తర్వాత కట్టవచ్చు. కాకపోతే ఈ మూడు నెలల సమయానికి అసలుపై వడ్డీ భారం పడుతూనే ఉంటుంది. ఎలాంటి రుణాలకు మారటోరియం? క్రెడిట్ కార్డ్ చెల్లింపులతో సహా కార్పొరేట్, ఎంఎస్ఎంఈ, రిటైల్, వ్యవసాయ, వాహన, విద్య, గృహ, వ్యక్తిగత అన్ని రకాల రుణాలకు ప్రిన్సిపల్ అమౌంట్, వడ్డీ రెండింటికీ కూడా మూడు నెలల మారటోరియం వర్తిస్తుంది. ఈ మారటోరియం సమయాన్ని డిఫాల్ట్‌గా, మొండిబకాయిలుగా పరిగణించరు. మారటోరియం వినియోగించిన కస్టమర్ల సిబిల్ స్కోర్ మీద ఎలాంటి ప్రభావం లేకుండా బ్యాంక్‌లు సంబంధిత వివరాలను క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు (సీఐసీ) అందించాలని ఆర్బీఐ ఆదేశించింది. ఏయే బ్యాంక్లంటే.. అన్ని కమర్షియల్ బ్యాంకులు, ప్రాంతీయ, గ్రామీణ, స్మాల్ ఫైనాన్స్, లోకల్ బ్యాంకులు, సహకార బ్యాంకులు, ఆల్ ఇండియా ఫైనాన్షియల్ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలలో మార్చి నుంచి మే మధ్య అన్ని రుణ చెల్లింపులకు ఈ మారటోరియం వర్తిస్తుంది. -
రుణ గ్రహీతలకు భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడంతో.. ఆర్బీఐ కీలక ప్రకటన రుణ గ్రహీతలకు భారీ ఊరటనిచ్చింది. వచ్చే 3నెలలు అన్ని లోన్ల ఈఎంఐలపై మారటోరియం విధించింది. దీంతో గృహ రుణాలతో సహా అన్నిరకాల రుణాలపై మూడు నెలలు ఈఎంఐలు కట్టకుండా వెసులుబాటు కల్పించినట్లు అయింది. దేశంలోని అన్ని బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలకు ఇది వర్తిస్తుందని గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. అలాగే మూలధన సమీకరణ కోసం ఇబ్బందులు పడుతున్న బ్యాంకులను ఎన్పీఏలుగా ప్రకటించమని ఆయన చెప్పారు. సహకార సహా, అన్ని రకాల రుణాలపై కూడా 3 నెలలు విధించిన తాజా మారటోరియం తో ఇప్పుడు కట్టాల్సిన రుణాలను గడువు తర్వాత ఎప్పుడైనా చెల్లించవచ్చు. ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించే క్రమంలో భాగంగా ప్రధానంగా నాలుగు చర్యలు తీసుకున్నట్టు శక్తికాంత దాస్ తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణకు ప్రణాళికలను సిద్దం చేయడం,మార్కెట్లలో లిక్కిడిటీ స్థిరత్వం, బ్యాంకుల రుణాల ప్రక్రియలో నిలకడ, చెల్లింపుల్లో సడలింపు చర్యలు, మార్కెట్ అస్థిరతను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు గవర్నర్ వెల్లడించారు. ఈ మేరకు బ్యాంకులు, రుణాలు జారీ చేసే సంస్థలకు సంబంధిత మార్గదర్శకాలను ఆర్బీఐ జారీచేసింది. ఈ క్రమంలో రెపో రేటును 75శాతం బేసిస్ పాయింట్లకు తగ్గించి 4.40 శాతానికి తీసుకొచ్చామని చెప్పారు. రివర్స్ రెపో రేటును కూడా 90 బేసిస్ పాయింట్ల తగ్గించామన్నారు. వినియోగదారులకు తమ డిపాజిట్లు, నగదుపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని తెలిపారు. వైరస్ పట్ల సురక్షితంగా వుంటూ డిజిటల్ లావాదేవీలకు ప్రాధాన్యత ఇవ్వాలని శక్తికాంతదాస్ సూచించారు. (కరోనా ప్రభావం: ఆర్బీఐ కీలక నిర్ణయం) -
రెపో రేటు కోత : ఈఎంఐ ఎంత తగ్గనుంది?
సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గురువారం రెపో రేటును పావు శాతం తగ్గించింది. ప్రతిసారి పావు శాతం (25 బేసిక్ పాయింట్లు) చొప్పున తగ్గించడంతో ఈ ఏడాది ప్రారంభంలో 6.5 శాతంగా ఉన్న రెపో రేటు తాజా నిర్ణయంతో 5.75 శాతానికి చేరింది. మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవంగా తీసుకున్న ఈ నిర్ణయంతో రెపో రేటు 10ఏళ్ల కనిష్టానికి చేరింది. రెపో రేటు తగ్గిన నేపథ్యంలో గృహ, వాహన రుణాలపై వడ్డీ భారం తగ్గనుంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం రెపో రేటు ప్రయోజనాలను బ్యాంకులు కస్టమర్లకు బదలీ చేస్తే ఈఎంఐ భారం తగ్గనుంది. ఉదాహరణకు ప్రభుత్వరంగ దిగ్గజం ఎస్బీఐ నుంచి రూ.30 లక్షల హోమ్ లోన్ తీసుకుంటే (20 ఏళ్ల కాలపరిమితి) ఇప్పటి వరకు 8.6 శాతం వడ్డీ రేటు ప్రకారం ఈఎంఐ 26,225, అయితే తాజా తగ్గింపుతో వడ్డీ రేటు 8.35కు తగ్గి, ఈఎంఐ 25,751 కానుంది. పదేళ్ల కాలపరిమితితో 25 లక్షల హోమ్ లోన్ తీసుకుంటేప్రస్తుత ఈఎంఐ రూ. 31,332 ఉంటే తాజా తగ్గింపుతో ఇది దాదాపు 30,996గా ఉండవచ్చు. అంటే రుణమొత్తం పూర్తయ్యేనాటికి లెక్కిస్తే రుణ దాత కట్టాల్సిన మొత్తంలో దాదాపు 40,000 కు పైగా భారం తగ్గుతుంది. ఈ తగ్గింపు రేట్లు వాహనాల రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు కూడా వర్తిస్తుంది. ఉదాహరణకు 7 ఏళ్ల కాలపరిమితితో రూ.10 లక్షల కారు లోన్ తీసుకుంటే, ఈఎంఐ రూ.16,089 నుంచి రూ.15,962కి తగ్గుతుంది. -
గృహ రుణం ప్రీపేమెంట్ చేస్తున్నారా?
గృహ రుణం అనేది ఒక్క రోజుతో తీరిపోయేది కాదు. చాలా సంవత్సరాల పాటు కొనసాగుతుంటుంది. ఈ క్రమంలో కొన్నిసార్లు ఈఎంఐలు కట్టడం భారం కావొచ్చు. అలాంటప్పుడు అనుకోకుండా పెద్ద మొత్తం ఎప్పుడైనా చేతికి వస్తే ముందుగా.. గృహ రుణాన్ని ప్రీ-పేమెంట్ చేసి కొంతైనా భారం తగ్గించుకోవాలనుకుంటాం. మరి అలాంటి సందర్భాల్లో ఏయే అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి? గరిష్టంగా ఎలా ప్రయోజనం పొందవచ్చు? అన్నది తెలియచెప్పేదే ఈ కథనం. అత్యవసర పరిస్థితుల కోసం ప్రణాళిక.. గృహ రుణం అనేది ఒకటి రెండేళ్లలో తీరేది కాదు. దీర్ఘకాలం కొనసాగుతుంది. భవిష్యత్‌లో ఏదైనా ఇతర రుణం తీసుకోవాలన్నా దానిపై కూడా ఇది ప్రభావం చూపుతుంది. ఇప్పటికే ఒక భారీ గృహ రుణం ఉన్నందున భవిష్యత్‌లో మరో రుణం తీసుకోవడం కొంత కష్టం కావొచ్చు. గతంలో డిఫాల్ట్ అయిన పక్షంలో ఒకవేళ ఎలాగోలా రుణం దక్కించుకున్నా, వడ్డీ రేటు భారీగా ఉంటుంది. దీనికితోడు రుణం మొత్తం తీరేలోగా ఇతరత్రా ఏవో అత్యవసరాలు వస్తూనే ఉంటాయి. వీటి కారణంగా ఒకోసారి ఈఎంఐల చెల్లింపు కష్టం కూడా కావొచ్చు. ఇలా జరగకుండా ఉండాలంటే.. కనీసం ఆరు నెలల ఈఎంఐ మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ గా ఉంచడం గానీ లేదా అవసరమైన వెంటనే నగదుగా మార్చుకోగలిగే వీలు కల్పించే సాధనంలో గానీ ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఈ మొత్తం పోగా మిగతా డబ్బును ప్రీపేమెంటు కోసం ఉపయోగించవచ్చు. గృహ రుణాన్ని మరో బ్యాంకుకు బదిలీ చేయడం.. కొన్ని సార్లు మీరు రుణం తీసుకున్న బ్యాంకుకన్నా మరో బ్యాంకు తక్కువ వడ్డీ రేటుపై లోన్లు ఇస్తుంటాయి. అడిగితే ప్రస్తుత బ్యాంకు కూడా వడ్డీ రేటు తగ్గించే అవకాశాలూ ఉన్నాయి. అలా కుదరనప్పుడు మీ లోన్‌ను సదరు బ్యాంకుకు బదలాయించవచ్చు. అయితే ఇలా చేసేటప్పుడు కొత్త బ్యాంకు వసూలు చేసే ప్రాసెసింగ్ ఫీజు, వర్తించే స్టాంపు డ్యూటీ మొదలైన ఖర్చులను పరిగణనలోకి తీసుకోవాలి. ఒకవేళ కొత్త బ్యాంకుకు బదలాయించే ఖర్చులకన్నా తక్కువగా.. కొంత ఫీజుతో ప్రస్తుత బ్యాంకే వడ్డీ రేటు తగ్గించేందుకు ఒప్పుకుంటే, దానితోనే కొనసాగవచ్చు. అనిల్ కొత్తూరి సీఈవో, ఎడెల్వీస్ హౌసింగ్ ఫైనాన్స్ తీర్చే ముందు చూడాల్సిందేమంటే.. * అనుకోకుండా వచ్చిన డబ్బును గృహ రుణానికి ప్రీ-పేమెంట్‌గా చెల్లించే ముందు గమనించాల్సిందేమిటంటే ఒక్కసారి ప్రీ-పే చేసిన తర్వాత ఆ మొత్తాన్ని మళ్లీ వెనక్కి తీసుకోవడం కుదరదు. కాబట్టి ఆ డబ్బు ఇక మన చేతిలో లేనట్లే. ఆ తర్వాతెప్పుడైనా ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినా, ఇతరత్రా ఏ అవసరాలు వచ్చినా ఆ డబ్బు అందుబాటులో ఉండదు. * కాబట్టి మంచి రాబడినిచ్చే పెట్టుబడి సాధనం ఏదైనా అందుబాటులో ఉంటే.. అందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల వచ్చే రాబడులను .. ప్రీపేమెంటు వల్ల వచ్చే ప్రయోజనాలను బేరీజు వేసుకోవాలి. హోమ్ లోన్ తీర్చేయడం వల్ల వచ్చే ప్రయోజనాల కన్నా ఇతర సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే రాబడి ఎక్కువగా ఉన్న పక్షంలో అటువైపు మొగ్గుచూపడం ఉత్తమం. దీనివల్ల ఆర్థిక ప్రయోజనంతో పాటు ఇతరత్రా అవసరాలేమైనా తలెత్తినప్పుడు ఉపయోగించుకోవడానికి మన డబ్బు కూడా మనకు అందుబాటులో ఉంటుంది. * ఫిక్స్డ్ రేటుపై తీసుకున్న రుణాన్ని ముందస్తుగా చెల్లించేస్తే.. ప్రీపేమెంట్ పెనాల్టీ కట్టాల్సి రావొచ్చు. కనుక, దీన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. * ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్నాక కూడా రుణాన్ని ప్రీపేమెంటు చేయదల్చుకున్న పక్షంలో రీషెడ్యూలింగ్‌కి సంబంధించి మీ ముందు రెండు చాయిస్‌లు ఉంటాయి. మొదటిదేంటంటే.. నెలవారీ ఈఎంఐ మొత్తాన్ని ఇప్పుడు కడుతున్నంతే చెల్లింపులు కొనసాగించడం. దీనివల్ల ముందుగా నిర్దేశించుకున్న గడువుకన్నా ముందే మీ రుణం తీరుతుంది. రెండోది ప్రతి నెలా కట్టే ఈఎంఐ పరిమాణాన్ని కొంత తగ్గించుకోవడం. తద్వారా ముందుగా పెట్టుకున్న గడువు నాటికి రుణం తీరుతుంది. అయితే, కట్టాల్సిన ఈఎంఐ భారం కొంత తగ్గుతుంది. * పెరిగే నెలవారీ ఖర్చుల కోసం మరింత డబ్బు అవసరమవుతున్న పక్షంలో రెండో చాయిస్‌ను ఎంచుకోవచ్చు. అలా కాని పక్షంలో యథాప్రకారంగా అదే ఇన్స్టాల్మెంట్ కొనసాగిస్తూ రుణా న్ని గడువుకు ముందుగానే తీర్చేయవచ్చు.