సాక్షి, అమరావతి : ఆర్ధిక ఇబ్బందుల్లోనూ రాష్ట్రంలో ‘వైఎస్సార్ సున్నా వడ్డీ' పథకం అమలు చేయనున్నట్లు ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ సోమవారం వెల్లడించారు. ఈ మేరకు పొదుపు సంఘాల ఖాతాల్లోకి రూ.1,400 కోట్లు విడుదల చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 24న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా పథకం పునఃప్రారంభం చేయనున్నట్లు తెలిపారు. దీని ద్వారా 93 లక్షల మంది పొదుపు సంఘాల మహిళలకు ప్రయోజనం చేకూరనుందని అన్నారు. (రోడ్డుపై ఆటలాడిన చిరుత పులి పిల్లలు)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాం నుంచే అమలులో ఉన్న ‘వైఎస్సార్ సున్నా వడ్డీ' పథకాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. 2016 జూన్ నుంచి ఈ పథకం అమలుకు నోచుకోలేదని, వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ పథకాన్ని పునఃప్రారంభించనుందని తెలిపారు. స్వయం సహాయక సంఘాలు తీసుకున్న రుణాలపై వడ్డీ చెల్లింపుల కోసం రూ.765 కోట్లు విడుదల చేస్తూ ఆర్ధికశాఖ ప్రత్యేక కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. (ఈ రోజు నాకెంతో ప్రత్యేకం)
Comments
Please login to add a commentAdd a comment