Interest Scheme
-
మహిళలకు జగన్ ‘ఆసరా’
సాక్షి, అమరావతి : చంద్రబాబు నయవంచనతో రాష్ట్రంలో కుదేలైన పొదుపు సంఘాల వ్యవస్థకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తిరిగి జీవంపోసింది. 2019 అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఏప్రిల్ 11 నాటికి వాటి పేరిట మహిళలకు బ్యాంకుల్లో ఉన్న అప్పు మొత్తం నాలుగు విడతల్లో వారికి చెల్లించేలా ‘వైఎస్సార్ ఆసరా’ పథకాన్ని అమలుచేయడంతో తిరిగి ఆ వ్యవస్థ గాడిలో పడింది. మన రాష్ట్రంలోని పొదుపు సంఘాల వ్యవస్థకు ఒక ప్రత్యేకత ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పావలా వడ్డీ పథకం ప్రవేశపెట్టడంతో రాష్ట్రంలో దాదాపు ప్రతి పేదింటి మహిళ ఈ పొదుపు సంఘాల్లో సభ్యురాలైంది. రాష్ట్రంలో ఈ పురోగతిని చూసి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ పథకానికీ శ్రీకారం చుట్టింది. మరోవైపు.. వైఎస్ ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత మహిళలు ప్రతినెలా ఎంతోకొంత పొదుపు చేసుకోవడం.. కుటుంబ అవసరాలకు సంఘం సభ్యులు ఉమ్మడిగా బ్యాంకుల నుంచి లోను తీసుకోవడం.. తిరిగి సకాలంలో అవి చెల్లించేవారు. ఈ సమయంలో 2014 ఎన్నికల ముందు, మహిళలెవరూ డ్వాక్రా రుణాలు చెల్లించవద్దని చంద్రబాబు పిలుపునిచ్చారు. వాటిని మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. కానీ, అధికారంలోకి వచ్చాక ఒక్క పైసా కూడా మాఫీ చేయలేదు. అప్పట్లో సంబంధిత శాఖ మంత్రిగా పనిచేసిన పరిటాల సునీత ఈ వి షయాన్ని అసెంబ్లీలో లిఖితపూర్వకంగా ప్రకటించారు. దీంతో అప్పటివరకు దేశా నికి ఆదర్శంగా నిలిచిన ఏపీలో పొదుపు సంఘాల వ్యవస్థ పూర్తిగా నిర్విర్యమైంది. చంద్రబాబు మాటలు నమ్మి బ్యాంకు రుణాలు చెల్లించని మహిళలు ఆ రుణాలపై వడ్డీ, చక్రవడ్డీలు పెరిగి బ్యాంకుల వద్ద డిఫాల్టర్లుగా మారారు. చివరకు.. ఒక దశలో వారు తమ రోజువారీ పొదుపు సంఘాల కార్యక్రమాలను దూరంపెట్టారు. సంఘాలకు జగన్ పూర్వవైభవం.. కానీ, వైఎస్ జగన్ 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు.. ‘పొదుపు’ మహిళల పేరిట అప్పటివరకు ఉన్న రూ.25,517 కోట్ల అప్పును వారికే నేరుగా నాలుగు విడతల్లో చెల్లించేందుకు సీఎం హోదాలో ఆయన వైఎస్సార్ ఆసరా పథకానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే మూడు విడతల్లో మొత్తం రూ.19,178.17 కోట్లను నేరుగా ఆయా మహిళల ఖాతాల్లో ఆయన జమచేశారు. మరోవైపు.. సకాలంలో బ్యాంకు రుణాలు చెల్లించే పొదుపు మహిళలకు ప్రభుత్వం వడ్డీ చెల్లించే విధానానికి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి శ్రీకారం చుడితే.. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం దానికి మంగళం పాడింది. కానీ, వైఎస్ జగన్ సీఎం అయ్యాక వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టారు. దీంతో మహిళలు తిరిగి పొదుపు సంఘాల కార్యక్రమాలపట్ల ఆసక్తి పెంచుకున్నారు. అలాగే, చంద్రబాబు తీరుతో అప్పట్లో 60 శాతం పైబడి సంఘాలు సీ, డీ గ్రేడ్లకు పడిపోతే.. ఇప్పుడు రాష్ట్రంలో 91 శాతానికి పైగా సంఘాలు ఏ, బీ గ్రేడ్‌లో కొనసాగుతున్నాయి. ఫలితంగా దేశంలోనే అత్యధికంగా మన రాష్ట్రంలో పొదుపు సంఘాల మహిళలు 99.5 శాతం మేర తమ రుణాలు సకాలంలో తిరిగి చెల్లిస్తున్నారు. -
నవంబర్ 5 కల్లా ఖాతాల్లో డబ్బులు
ముంబై/న్యూఢిల్లీ: మారటోరియంలో రుణాలపై చక్రవడ్డీ మాఫీ పథకాన్ని నవంబర్ 5లోగా అమలు చేయాలని బ్యాంకులు, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలను రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. స్కీమ్‌కి అనుగుణంగా సాధారణ వడ్డీ, చక్రవడ్డీ మధ్య వ్యత్యాసానికి సంబంధించిన మొత్తాన్ని నిర్దిష్ట రుణగ్రహీతల ఖాతాల్లో గడువులోగా జమ చేసే ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది. ‘రుణాలిచ్చే అన్ని ఆర్థిక సంస్థలు నిర్దిష్ట స్కీమ్ నిబంధనల ప్రకారం నిర్దేశిత గడువులోగా తగు చర్యలు తీసుకోవాలి‘ అని ఆదేశిస్తూ ఆర్బీఐ మంగళవారం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. అటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ విషయాన్ని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ‘6 నెలల వ్యవధికి సంబంధించి చక్రవడ్డీ, సాధారణ వడ్డీ మధ్య వ్యత్యాసాన్ని ఎక్స్‌గ్రేషియాగా చెల్లించే స్కీము నిబంధనలను అమలు చేయాలంటూ ఆర్థిక సంస్థలకు ఆర్బీఐ సూచించింది‘ అని ఆమె పేర్కొన్నారు. మరోవైపు, ఇదే వివరాలను సుప్రీం కోర్టుకు కూడా కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది. రుణగ్రహీతలు మారటోరియం ఎంచుకున్నా, ఎంచుకోకపోయినా లేదా పాక్షికంగా ఎంచుకున్నా .. అర్హులైన వారందరికీ ఈ స్కీమును వర్తింపజేస్తున్నట్లు వివరించింది. నిర్దిష్ట నిధులను రుణగ్రహీతల ఖాతాల్లో జమ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి రీయింబర్స్‌మెంట్‌కు బ్యాంకులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది. ‘ఆర్థిక పరిస్థితులు, రుణగ్రహీతల తీరుతెన్నులు, ఎకానమీపై ప్రభావం తదితర అంశాలన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం‘ అని వివరించింది. నేపథ్యం ఇదీ.. కరోనా వైరస్‌పరమైన ప్రతికూల పరిణామాలతో కుదేలైన రుణగ్రహీతలకు కాస్త వెసులుబాటునిచ్చే విధంగా రుణ బాకీల చెల్లింపును కొంతకాలం వాయిదా వేసుకునే వీలు కల్పిస్తూ ప్రభుత్వం మార్చి 1 నుంచి ఆగస్టు 31 దాకా ఆరు నెలల పాటు రెండు విడతలుగా మారటోరియం ప్రకటించింది. అయితే, ఈ వ్యవధిలో అసలుపై వడ్డీ మీద వడ్డీ కూడా వడ్డించే విధంగా బ్యాంకుల నిబంధనలు ఉన్నాయి. ఈ చక్రవడ్డీ భారాన్ని సవాలు చేస్తూ రుణగ్రహీతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో వారికి ఊరటనిచ్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది. సామాన్యుడి దీపావళి పండగ మీ చేతుల్లోనే ఉందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తాజా స్కీమ్ రూపొందించింది. స్కీమ్ ఇలా... రూ. 2 కోట్ల దాకా రుణాలకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. గృహ రుణాలు, విద్యా రుణాలు, క్రెడిట్ కార్డు బకాయిలు, వాహన రుణాలు, చిన్న..మధ్య తరహా సంస్థల లోన్స్, కన్జూమర్ డ్యూరబుల్ లోన్స్ మొదలైనవి దీని పరిధిలోకి వస్తాయి. పథకం ప్రకారం .. మారటోరియం ప్రకటించిన ఆరు నెలల కాలానికి గాను సాధారణ వడ్డీ, చక్ర వడ్డీకి మధ్య గల వ్యత్యాసాన్ని బ్యాంకులు ఆయా రుణ గ్రహీతల ఖాతాల్లో జమ చేస్తాయి. ఆ తర్వాత రీయింబర్స్‌మెంట్‌కు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటాయి. మారటోరియంను ఎంచుకోకుండా యథాప్రకారం రుణాల నెలవారీ వాయిదాలను చెల్లించడం కొనసాగించిన వారికి కూడా ఇది వర్తిస్తుంది. -
అక్కచెల్లెమ్మలకు అండగా సున్నా వడ్డీ
-
‘వైఎస్సార్ సున్నా వడ్డీ’కి రూ. 765 కోట్లు విడుదల
-
‘వైఎస్సార్ సున్నా వడ్డీ’కి రూ. 765 కోట్లు విడుదల
సాక్షి, అమరావతి : ఆర్ధిక ఇబ్బందుల్లోనూ రాష్ట్రంలో ‘వైఎస్సార్ సున్నా వడ్డీ' పథకం అమలు చేయనున్నట్లు ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ సోమవారం వెల్లడించారు. ఈ మేరకు పొదుపు సంఘాల ఖాతాల్లోకి రూ.1,400 కోట్లు విడుదల చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 24న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా పథకం పునఃప్రారంభం చేయనున్నట్లు తెలిపారు. దీని ద్వారా 93 లక్షల మంది పొదుపు సంఘాల మహిళలకు ప్రయోజనం చేకూరనుందని అన్నారు. (రోడ్డుపై ఆటలాడిన చిరుత పులి పిల్లలు) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాం నుంచే అమలులో ఉన్న ‘వైఎస్సార్ సున్నా వడ్డీ' పథకాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. 2016 జూన్ నుంచి ఈ పథకం అమలుకు నోచుకోలేదని, వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ పథకాన్ని పునఃప్రారంభించనుందని తెలిపారు. స్వయం సహాయక సంఘాలు తీసుకున్న రుణాలపై వడ్డీ చెల్లింపుల కోసం రూ.765 కోట్లు విడుదల చేస్తూ ఆర్ధికశాఖ ప్రత్యేక కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. (ఈ రోజు నాకెంతో ప్రత్యేకం) -
పావలా వడ్డీ పథకానికి తూట్లు
బిట్రగుంటకు చెందిన దీపా పొదుపు గ్రూపు సభ్యులు మస్తాన్‌బీకి పావలా వడ్డీ పథకం కింద రుణం మంజూరు చేశారు. బ్యాంకు నిబంధన ప్రకారం పూర్తివడ్డీతో నెలనెలాక్రమం తప్పకుండా రుణం చెల్లించింది. నిర్ణీత గడువులోగా రుణం చెల్లించిన ఈమెకు పావలా వడ్డీ రీయింబర్స్మెంట్ మంజూరు చేయాల్సి ఉంది. 2011 నుంచి ఆమె మండల సమాఖ్యలు, జిల్లా అధికారుల చుట్టూ తిరుగుతోంది. ఇదిగో..అదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు. వడ్డీ రీయింబర్స్మెంట్ వస్తుందో రాదో.. కూడా తెలియని దుస్థితి. వింజమూరుకు చెందిన మహాలక్ష్మి పొదుపు గ్రూపు సభ్యులు ఆదిలక్ష్మి పరిస్థితి కూడా ఇదే. ఈమెకు 2011 నాటికి వడ్డీ రీయిం బర్స్మెంట్ రావాల్సి ఉంది. ఇంత వరకు ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితి మస్తాన్‌బీ, ఆదిలక్ష్మిలదే కాదు.. జిల్లా వ్యాప్తంగా ఎందరో మహిళలకు రూ.18.58 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది.