బిట్రగుంటకు చెందిన దీపా పొదుపు గ్రూపు సభ్యులు మస్తాన్‌బీకి పావలా వడ్డీ పథకం కింద రుణం మంజూరు చేశారు. బ్యాంకు నిబంధన ప్రకారం పూర్తివడ్డీతో నెలనెలాక్రమం తప్పకుండా రుణం చెల్లించింది. నిర్ణీత గడువులోగా రుణం చెల్లించిన ఈమెకు పావలా వడ్డీ రీయింబర్స్‌మెంట్ మంజూరు చేయాల్సి ఉంది. 2011 నుంచి ఆమె మండల సమాఖ్యలు, జిల్లా అధికారుల చుట్టూ తిరుగుతోంది. ఇదిగో..అదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు. వడ్డీ రీయింబర్స్‌మెంట్ వస్తుందో రాదో.. కూడా తెలియని దుస్థితి.
వింజమూరుకు చెందిన మహాలక్ష్మి పొదుపు గ్రూపు సభ్యులు ఆదిలక్ష్మి పరిస్థితి కూడా ఇదే. ఈమెకు 2011 నాటికి వడ్డీ రీయిం బర్స్‌మెంట్ రావాల్సి ఉంది. ఇంత వరకు ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితి మస్తాన్‌బీ, ఆదిలక్ష్మిలదే కాదు.. జిల్లా వ్యాప్తంగా ఎందరో మహిళలకు రూ.18.58 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది.
పావలా వడ్డీ పథకానికి తూట్లు
Published Sun, Feb 2 2014 3:40 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 AM
Advertisement