- జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు రవికుమార్
కష్టాన్ని ఇష్టంగా భావిస్తే విజయం సొంతం
Published Mon, Jan 30 2017 11:35 PM | Last Updated on Tue, Sep 5 2017 2:29 AM
మండపేట :
చదువు కోసం పడే కష్టాన్ని ఇష్టంగా భావిస్తే విజయం విద్యార్థి సొంతమవుతుందని జన విజ్ఞానవేదిక రాష్ట్ర అధ్యక్షుడు చల్లా రవికుమార్ అన్నారు. పట్టణంలోని టౌ¯ŒS హాల్‌లో ఎంఈఓ వై.వీరభద్రరావు అధ్యక్షతన పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు మనో ధైర్యాన్ని ఇచ్చేందుకు స్ఫూర్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్న కార్యక్రమంలో రవికుమార్ మాట్లాడుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలనుకునేవారు విజ్ఞాన సముపార్జన కోసం శ్రమపడాలన్నారు. అప్పుడే విజయం సాధించి, సమాజంలో గుర్తింపు పొందుతారన్నారు. లయ¯Œ్స క్లబ్ అధ్యక్షుడు కర్రి నారాయణరెడ్డి, ప్రభుత్వాస్పత్రి డిప్యూటీ సివిల్ సర్జ¯ŒS బి.సుబ్రహ్మణ్యేశ్వరి, ఆంగ్ల అ«ధ్యాపకులు సమర్పణకుమార్ మాట్లాడుతూ ప్రణాళికాబద్ధంగా విద్యార్థులు వ్యవహరించాలన్నారు. పాఠశాలల అధ్యాపక సిబ్బంది, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement