చెప్పిన పని చేయలేదని ముక్కు కోశారు
చెప్పిన పని చేయలేదని ముక్కు కోశారు
Published Fri, Aug 18 2017 10:30 AM | Last Updated on Mon, Oct 8 2018 3:17 PM
భోపాల్ : మధ్యప్రదేశ్ లో ఓ దళిత కుటుంబంపై కుల వివక్ష దాడి జరిగింది. తాము చెప్పిన పని చేయలేదని అగ్రవర్ణానికి చెందిన ఓ కుటుంబం ఆమెపై దాడి చేసి ముక్కును కోసేశారు. రజ గ్రామంలో మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
జానకీ భాయ్(35) అనే మహిళ చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. తమ ఇంట్లో పనిలోకి రాలేదన్న కారణంతో ఓ కుటుంబం దాడికి తెగబడింది. "వారంతా నా భార్యపై దాడికి తెగబడ్డారు. అందులో ఇద్దరు వ్యక్తులు గొడ్డలితో ఆమె ముక్కును నరికేశారు. అడ్డుకోవటానికి వెళ్లిన నాపైనా దాడి చేశారని" ఆమె భర్త రాఘవేంద్ర చెబుతున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం మహిళ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది.
Advertisement
Advertisement