Upper Caste Attack
-
తమతో కూర్చొని భోజనం చేశాడని చంపేశారు!
డెహ్రాడూన్: ఆధునికంగా మనిషి ఎంత ఎదుగుతున్నా.. ఇంకా కులం పేరుతో జరిగే హత్యలు ఆగడం లేదు. ఓవైపు టెక్నాలజీ పెరుగుతున్నా.. మరోవైపు రోజురోజుకు దళిత, గిరిజనులపై అగ్రకులంవారి దాష్టికం తగ్గడంలేదు. తాజాగా ఓ దళిత వ్యక్తిని ఆగ్రకులానికి చెందిన కొందరు దాడి చేసి చంపారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరఖండ్‌లోని చంపావత్ జిల్లాలో ఓ గ్రామంలో జరిగిన వివాహవేడుకలో రమేశ్‌రామ్ అనే దళిత వ్యక్తి తమతో పాటు కూర్చొని భోజనం చేశాడని అగ్రకులానికి చెందినవారు అతనిపై దాడికి దిగారు. చదవండి: Bigg Boss Kirik Keerthi: బిగ్‌బాస్ కంటెస్టెంట్‌పై బీర్ బాటిల్‌తో దాడి తమకు దూరంగా ఉండి భోజనం చేయాలన్న నియయాన్ని అతడు ఉల్లంఘించాడని చావబాదారు. దీంతో తీవ్రంగా గాయపడిన రమేశ్‌రామ్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అగ్రకులానికి చెందిన కొంతమంది వివాహం వేడుకలో తన భర్తపై తీవ్రంగా దాడిచేశారు. వారి దాడి కారణంగానే తన భర్త మృతి చెందడని రమేశ్‌రామ్ భార్య తులసిదేవి పోలీసులు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. -
ఆ అమ్మాయితో మాట్లాడినందుకు గుండు గీయించి..
జైపూర్: దేశంలో కులవివక్ష ఏస్థాయిలో ఉందో చెప్పే ఉదంతం ఇది. ఎన్ని చట్టాలు, ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా కొందరు మనుషులు సాటి మనుషుల పట్ల మానవత్వాన్ని మరచి అనాగరికంగా ప్రవర్తిస్తున్నారు. వివరాల్లోకెళ్తే.. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో దారుణం సంఘటన చోటుచేసుకుంది. దళిత యువకుడు అగ్రకులాల అమ్మాయితో మాట్లాడడాన్ని జీర్ణించుకోలేని కొందరు పెద్ద మనుషులు అతడికి గుండు కొట్టించారు. మెకానిక్ షాప్‌లో పనిచేసే రాహుల్ మేఘావాల్ అనే యువకుడు ఈ నెల 18న అతడికి తెలిసిన అగ్ర కులానికి చెందిన యువతితో మాట్లాడాడు. వీరిద్దరు ఓ కాఫీ హోటల్లో కలుసుకొని మాట్లాడుతుండగా గమనించిన అగ్ర వర్ణ కుల పెద్దలు, అమ్మాయి కుటుంబ సభ్యులు రాహుల్ ఇంటిపై దాడి చేశారు. అంతేగాక ఆ యువకుడికి గుండు గీయించి అవమానపరిచారు. అతనిపై, కుటుంబ సభ్యులపై విచక్షణ మరిచి మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. చదవండి: ముగ్గురిని బలిగొన్న అక్రమ సంబంధం -
చెప్పిన పని చేయలేదని ముక్కు కోశారు
భోపాల్ : మధ్యప్రదేశ్ లో ఓ దళిత కుటుంబంపై కుల వివక్ష దాడి జరిగింది. తాము చెప్పిన పని చేయలేదని అగ్రవర్ణానికి చెందిన ఓ కుటుంబం ఆమెపై దాడి చేసి ముక్కును కోసేశారు. రజ గ్రామంలో మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జానకీ భాయ్(35) అనే మహిళ చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. తమ ఇంట్లో పనిలోకి రాలేదన్న కారణంతో ఓ కుటుంబం దాడికి తెగబడింది. "వారంతా నా భార్యపై దాడికి తెగబడ్డారు. అందులో ఇద్దరు వ్యక్తులు గొడ్డలితో ఆమె ముక్కును నరికేశారు. అడ్డుకోవటానికి వెళ్లిన నాపైనా దాడి చేశారని" ఆమె భర్త రాఘవేంద్ర చెబుతున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం మహిళ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది.