
రాయచూరు రూరల్: యాదగిరి జిల్లాలో నాలుగు రోజులు క్రితం ఓ యువతిని అటకాయించిన కొందరు దుండగులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన యాదగిరి తాలుకా కంచగారహళ్లి క్రాస్ వద్ద జరిగింది. సచిన్ అనే యువకుడు ఈ ఘటనకు బాధ్యుడిగా పోలీసులు గుర్తించారు. వివరాలు... తల్లిదండ్రులు లేని దివ్యాంగురాలు సవిత (35) సోదరుడితో కలిసి నివాసం ఉంటోంది.
నాలుగు రోజుల క్రితం ఆమెకు నిశ్చితార్థం జరిగింది. శనివారం యథావిధిగా ఆమె పొలం పనులకు వెళ్లింది. ఈక్రమంలో సచిన్, అతని స్నేహితులు ఆమెను ఎత్తుకుని ఓ నిర్జన ప్రదేశంలో అత్యాచారం చేసి కత్తితో తీవ్రంగా గాయపరిచి చిత్రహింసలకు గురిచేశారు.
చెవి, మెడ, గొంతు వద్ద తీవ్రంగా గాయపరిచారు. సృహతప్పి పడిఉన్న బాధితురాలిని స్థానికులు కలబుర్గి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు
Comments
Please login to add a commentAdd a comment