నిశ్చితార్థం రద్దయిందని ఘోరం | 32 Years Old Karnataka Man Who Chopped Off Head Of Minor Girl Arrested, Details Inside | Sakshi
Sakshi News home page

నిశ్చితార్థం రద్దయిందని ఘోరం

Published Sun, May 12 2024 8:01 AM | Last Updated on Sun, May 12 2024 2:49 PM

Karnataka man who chopped off minor girl

యశవంతపుర: నిశ్చితార్థం రద్దయిందనే ఉన్మత్త ఆవేశంలో 16 ఏళ్ల బాలికను తల నరికి హత్య చేసి పరారైన కిరాతకుడు ప్రకాశ్‌ను కొడగు పోలీసులు అరెస్ట్‌ చేశారు. జిల్లాలోని సోమవారపేట పరిధిలో సుర్జబ్బి ప్రభుత్వ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్న మీనా అనే బాలికతో అతనికి గతంలో ఇరుకుటుంబాల వారు నిశ్చితార్థం చేశారు.  

ఏడాది నుంచి ప్రేమ  
హత్యకు గురైన మీనా ఊరు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని హమ్మియాళకు చెందిన ప్రకాశ్‌ చిన్నచిన్న పనులు చేసుకొనేవాడు. ఏడాది నుంచి మీనా వెంటపడ్డాడు. రోజూ మీనాను ప్రకాశ్‌ బైకులో ఎక్కించుకొని స్కూల్‌ వద్ద వదిలేవాడు. ఫలితాలు వచ్చిన రోజునే నిశి్చతార్థంలో ఇద్దరినీ పెద్దలు కూర్చోబెట్టి ఉంగరాలు మారి్పంచారు. అయితే కొంతసేపటికి అధికారులు వచ్చి మైనర్‌ బాలికకు ఎలా పెళ్లి చేస్తారని ప్రశ్నించటంతో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు బాలిక తల్లిదండ్రులు సుబ్రమణ్య, జానకి తెలిపారు.

 ఆ తరువాత మీనాను మాటల్లో పెట్టిన ప్రకాశ్‌ ఆమె తల నరికి తీసుకెళ్లాడు. ఆమె తల్లిదండ్రులపైనా దాడి చేసి పరారయ్యాడు. ప్రకాశ్‌ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని శుక్రవారం సాయంత్రం నుంచి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. అది నిజం కాదని తేలింది. ఒక గ్రామంలో దాగి ఉన్న నిందితున్ని అరెస్టు చేసి విచారణ చేపట్టినట్లు జిల్లా ఎస్పీ కె.రామరాజన్‌ తెలిపారు. ఘటనాస్థలికి తీసుకెళ్లి  హత్య గురించి విచారించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement