
తిరుత్తణి: పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని మోసగించిన యువకుడిని తిరుత్తణి మహిళా పోలీసులు సోమవా రం అరెస్ట్ చేశారు. ఆర్కాడు కుప్పానికి చెందిన యువతి (26) రాణిపేట జిల్లా ముప్పదువెడి గ్రామానికి చెందిన వినోద్‌కుమార్(30)కు ఈ ఏడాది జనవరిలో పెద్దలు నిశ్చితార్థం చేశారు. ఆరు నెలల తర్వాత వివాహం చేయాలని నిర్ణయించారు.
దీంతో వినోద్‌కుమార్ తరచూ యువతి ఇంటికి వెళ్లేవాడు. ఈ క్రమంలో ఇద్దరూ శారీరకంగా దగ్గరయ్యరు. నెల రోజులుగా వినోద్‌కుమార్ యువతితో మాట్లాడడం లేదు. యువతి విచారించగా బెంగళూరుకు చెందిన యువతిని వివాహం చేసుకునేందుకు నిశ్చియించినట్లు తెలుసుకుంది. దీనిపై తిరుత్తణి మహిళా పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన సీఐ కార్తిక నిందితుడు వినోద్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment