ఆఫీస్ నుంచి ఈడ్చుకుపోయి అత్యాచారం చేశాడు | Dalit Woman Dragged Out Of Office, Kidnapped And Raped In Punjab | Sakshi
Sakshi News home page

ఆఫీస్ నుంచి ఈడ్చుకుపోయి అత్యాచారం చేశాడు

Published Fri, Apr 22 2016 7:35 PM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM

బాధితురాలి ఆఫీస్ ముందున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు - Sakshi

బాధితురాలి ఆఫీస్ ముందున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు

ముక్త్సర్: ఓ ఆడబిడ్డని కీచకుడు నడిరోడ్డుపై చెరపట్టాడు. బలవంతంగా లాక్కెళ్లి కారులో కుదేసి కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత ఆమెపై దారుణంగా అత్యాచారం చేశాడు. పట్టపగలు నడిరోడ్డుపై బలవంతంగా లాక్కుపోతున్నా ఏంటిది? అని ఎవ్వరూ అడగలేదు. విలవిలలాడిపోయిన ఆమెను ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. ఆఖరికి పోలీసులు కూడా!

ముక్త్సర్ (పంజాబ్) నగరంలోని ఓ కంప్యూటర్ సెంటర్ లో పనిచేస్తోన్న దళిత యువతిని ఆమె ఊరికే చెందిన ఓ వ్యక్తి ఆఫీసు నుంచి బయటికి ఈడ్చుకెళ్లాడు. 100 మీటర్ల దూరంలో నిలిపిన కారు దగ్గరికి గుంజుకెళ్లి, ఆమెను కారులో పడేశాడు. నిత్యం జనం సంచరించే మెయిన్ రోడ్డుపై వాడు తన పశుబలాన్ని ప్రదర్శిస్తుంటే అందరూ చూస్తూ నిల్చున్నారేతప్ప ఏ ఒక్కరూ అడ్డుకోలేదు. కనీసం ఇదేంటని అడగలేదు. వాడు ఆమెను కారులో ఫామ్ హౌస్ కు తీసుకెళ్లి రాత్రంతా బంధించి పలుమార్లు అత్యాచారం చేశాడు. మార్చి 24న చోటుచేసుకున్న ఈ సంఘటనపై తర్వాతి రోజే బాధితురాలు ముక్త్సర్ పోలీసులకు ఫిర్యాదుచేసింది.

నిందితుడు బాధిత యువతిని ఆమె ఆఫీసు నుంచి యువతిని లాక్కెళ్లిన దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఒకరిద్దరు కొలిగ్స్ కూడా వాంగ్మూలం ఇస్తామన్నారు. అయినాసరే పోలీసులు ఇంకా ఆ కీచకుణ్ని అరెస్ట్ చేయలేదు. దీంతో యువతి జాతీయ ఎస్సీ కమిషన్ ను ఆశ్రయించింది. ఇంత ఘోరం జరిగి, సాక్ష్యాధారాలున్నా నిందితుణ్ని ఎందుకు అరెస్ట్ చేయలేదో చెప్పాలంటూ కమిషన్ తాజాగా పోలీసులకు నోటీసులు  జారీచేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement