Muktsar
-
లిక్కర్ ప్రచారంలో దొర్లిన తప్పు.. అధికారుల క్షమాపణ
చండీగఢ్ : దుకాణాల వద్ద వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు నేటి నుండి మద్యాన్ని హోం డెలివరీ చేయనున్నట్లు పంజాబ్ రాష్ట్ర ఎక్సైజ్ అండ్ టాక్సేషన్ శాఖ తెలిపిన విషయం తెలిసిందే. అయితే పంజాబ్లోని ముక్త్సర్ స్థానిక పరిపాలనా విభాగం అధికారులు లిక్కర్ హోం డెలివరీ విషయాన్ని ప్రజలకు త్వరగా చేరేలా వివిధ మార్గాల ద్వారా తెలపానుకున్నారు. దీనిలో భాగంగా గుడుల్లో వినియోగించే లౌడ్స్పీకర్లలో కూడా లిక్కర్ హోం డెలివరీ చేయనున్నట్టు ప్రకటించాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై ప్రతిపక్ష అకాళీదళ్ నిప్పులు చెరిగింది. అయితే ఇది అనుకోకుండా జరిగిన తప్పిదం అంటూ స్థానిక పరిపాలనా విభాగం అధికారులు క్షమాపణలు కోరారు. (మద్యం ఇక హోం డెలివరీ..!) ముక్త్సర్ జిల్లా డిప్యూటీ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే వెనక్కు తీసుకుని, ఈ ఘటనతో సంబంధం ఉన్న అధికారులపై విచారణకు ఆదేశించాలని అకాళీదళ్ అధికారప్రతినిధి దల్జిత్ సింగ్ చీమా డిమాండ్ చేశారు. ముక్త్సర్ సాహీబ్ అనేది సిక్కు చరిత్రలోనే అత్యంత గౌరనీయమైన ప్రదేశం అని తెలిపారు. పరిపాలనా విభాగం ఉత్తర్వులు చూస్తుంటే మద్యంతో ఆదాయం పెంచుకోవాలని ప్రభుత్వం ఎంతలా ప్రయత్నిస్తుందో అర్థం అవుతోందన్నారు. ముక్త్సర్ డిప్యూటీ కమిషనర్ అర్వింద్ కుమార్ ఈ ఘటనపై క్షమాపణలు తెలిపారు. గురుద్వారాల్లోని లౌడ్ స్పీకర్లలో లిక్కర్ హోం డెలివరీ విషయాన్ని ప్రకటించాలని ఉత్తర్వుల్లో తెలపడం బాధాకరమని, ఇది అనుకోకుండా జరిగిన తప్పు అని తెలిపారు. సవరించిన ఉత్తర్వులను తిరిగి విడుదల చేశామన్నారు. మద్యాన్ని నేటి నుంచి హోం డెలివరీ చేయనున్నట్లు పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. లిక్కర్ డెలివరీ సమయాన్ని సంబంధిత శాఖ కమిషనర్లు నిర్ణయిస్తారని తెలిపింది. డెలివరీకి ఒక్కో ఇంటికి 2లీటర్ల మద్యమే అందుబాటులో ఉంటుంది. 21 వయసు దాటిన వారికి మద్యం డెలివరీ చేసేలా చర్యలు తీసుకున్నారు. దీనికోసం ప్రత్యేకంగా వెబ్సైట్ను కూడా రూపొందించారు. మద్యం షాపుల వద్ద తాకిడిని తగ్గించేందుకే సైట్ ప్రారంభించింది. మరోవైపు రాష్ట్రంలో మద్యం షాపులు కూడా తెరవనున్నారని, అయితే షాపింగ్ సముదాయాలు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు మాత్రమే తెరవనున్నట్లు పేర్కొన్నారు.(కరోనా.. 53 వేలకు చేరువలో కేసులు) -
ఆఫీస్ నుంచి లాక్కెళ్లి రేప్: నిందితుడి లొంగుబాటు
ముక్త్సర్: దేశవ్యాప్తంగానేకాక పలు అంతర్జాతీయ వార్తా సంస్థలు సైతం దునుమాడిన పంజాబ్ అత్యాచార సంఘటనకు సంబంధించిన కేసులో నిందితుడు ఎట్టకేలకు లొంగిపోయాడు. ముక్త్సర్ పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై ఫిర్యాదుచేసి పాతిక రోజులైనా పోలీసులు పట్టించుకోవట్లేదని బాధితురాలైన దళిత యువతి జాతీయ ఎస్సీ కమిషన్ ను ఆశ్రయించడంతో శుక్రవారం ఈ ఉదంతం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. నిందితుడు గుర్జిందర్ సింగ్ శనివారం ఉదయం తమకు లొంగిపోయాడని, అతణ్ని న్యాయస్థానంలో హాజరుపరుస్తామని ముక్త్సర్ పోలీసులు తెలిపారు. కాగా, ఎస్సీ కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేసేంతవరకు చేష్టలుడిగి చూస్తుండిపోయిప పోలీసులపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. (చదవండి: ఆఫీస్ నుంచి ఈడ్చుకుపోయి అత్యాచారం చేశాడు) -
ఆఫీస్ నుంచి ఈడ్చుకుపోయి అత్యాచారం చేశాడు
ముక్త్సర్: ఓ ఆడబిడ్డని కీచకుడు నడిరోడ్డుపై చెరపట్టాడు. బలవంతంగా లాక్కెళ్లి కారులో కుదేసి కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత ఆమెపై దారుణంగా అత్యాచారం చేశాడు. పట్టపగలు నడిరోడ్డుపై బలవంతంగా లాక్కుపోతున్నా ఏంటిది? అని ఎవ్వరూ అడగలేదు. విలవిలలాడిపోయిన ఆమెను ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. ఆఖరికి పోలీసులు కూడా! ముక్త్సర్ (పంజాబ్) నగరంలోని ఓ కంప్యూటర్ సెంటర్ లో పనిచేస్తోన్న దళిత యువతిని ఆమె ఊరికే చెందిన ఓ వ్యక్తి ఆఫీసు నుంచి బయటికి ఈడ్చుకెళ్లాడు. 100 మీటర్ల దూరంలో నిలిపిన కారు దగ్గరికి గుంజుకెళ్లి, ఆమెను కారులో పడేశాడు. నిత్యం జనం సంచరించే మెయిన్ రోడ్డుపై వాడు తన పశుబలాన్ని ప్రదర్శిస్తుంటే అందరూ చూస్తూ నిల్చున్నారేతప్ప ఏ ఒక్కరూ అడ్డుకోలేదు. కనీసం ఇదేంటని అడగలేదు. వాడు ఆమెను కారులో ఫామ్ హౌస్ కు తీసుకెళ్లి రాత్రంతా బంధించి పలుమార్లు అత్యాచారం చేశాడు. మార్చి 24న చోటుచేసుకున్న ఈ సంఘటనపై తర్వాతి రోజే బాధితురాలు ముక్త్సర్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. నిందితుడు బాధిత యువతిని ఆమె ఆఫీసు నుంచి యువతిని లాక్కెళ్లిన దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఒకరిద్దరు కొలిగ్స్ కూడా వాంగ్మూలం ఇస్తామన్నారు. అయినాసరే పోలీసులు ఇంకా ఆ కీచకుణ్ని అరెస్ట్ చేయలేదు. దీంతో యువతి జాతీయ ఎస్సీ కమిషన్ ను ఆశ్రయించింది. ఇంత ఘోరం జరిగి, సాక్ష్యాధారాలున్నా నిందితుణ్ని ఎందుకు అరెస్ట్ చేయలేదో చెప్పాలంటూ కమిషన్ తాజాగా పోలీసులకు నోటీసులు జారీచేసింది.