ఆఫీస్ నుంచి లాక్కెళ్లి రేప్: నిందితుడి లొంగుబాటు | Man Seen On Camera Dragging Punjab Woman Before Alleged Rape Surrenders | Sakshi
Sakshi News home page

ఆఫీస్ నుంచి లాక్కెళ్లి రేప్: నిందితుడి లొంగుబాటు

Published Sat, Apr 23 2016 1:32 PM | Last Updated on Thu, Oct 4 2018 8:31 PM

ఆఫీస్ నుంచి లాక్కెళ్లి రేప్: నిందితుడి లొంగుబాటు - Sakshi

ఆఫీస్ నుంచి లాక్కెళ్లి రేప్: నిందితుడి లొంగుబాటు

ముక్త్సర్: దేశవ్యాప్తంగానేకాక పలు అంతర్జాతీయ వార్తా సంస్థలు సైతం దునుమాడిన పంజాబ్ అత్యాచార సంఘటనకు సంబంధించిన కేసులో నిందితుడు ఎట్టకేలకు లొంగిపోయాడు.

ముక్త్సర్ పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై ఫిర్యాదుచేసి పాతిక రోజులైనా పోలీసులు పట్టించుకోవట్లేదని బాధితురాలైన దళిత యువతి జాతీయ ఎస్సీ కమిషన్ ను ఆశ్రయించడంతో శుక్రవారం ఈ ఉదంతం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. నిందితుడు గుర్జిందర్ సింగ్ శనివారం ఉదయం తమకు లొంగిపోయాడని, అతణ్ని న్యాయస్థానంలో హాజరుపరుస్తామని ముక్త్సర్ పోలీసులు తెలిపారు. కాగా, ఎస్సీ కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేసేంతవరకు చేష్టలుడిగి చూస్తుండిపోయిప పోలీసులపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

(చదవండి: ఆఫీస్ నుంచి ఈడ్చుకుపోయి అత్యాచారం చేశాడు)

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement