
ఎయిడ్స్ వచ్చిందని చెప్పని భర్తను..
బరేలీ: హెచ్ఐవీ ఉందనే కారణంతో అత్తమామలు అతడి భార్యతో కుట్ర చేసి హత్య చేశారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని ఖమారియా అనే గ్రామనికి చెందిన వ్యక్తికి అట్టాపట్టి అనే గ్రామానికి అమ్మాయితో 2013లో వివాహం అయింది. ట్రక్కు డ్రైవర్ గా పనిచేస్తున్న అతడు ఏడాదిన్నర కిందట తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అప్పటి నుంచి తన అత్తమామల ఇంట్లో ఉండటం మొదలుపెట్టాడు. వాస్తవానికి అతడికి ఆ సమయంలో ఎయిడ్స్ సోకింది.
అయితే, ఆ విషయం ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచాడు. ఎవరికీ తెలియకుండా భోజిపురాలోని యాంటీ రిట్రో వైరల్ థెరపీ కేంద్రానికి వెళ్లి అక్కడే ఉండి థెరపీ పూర్తి చేసుకున్నాడు. థెరపీ సెషన్ పూర్తయ్యాక తిరిగి అత్తగారింటికి వెళ్లాడు. ఈ లోగా ఇంట్లో వాళ్లకు అతడికి ఎయిడ్స్ సోకిందని తెలిసింది. దీంతో అతడిని ఎవరికీ తెలియకుండా చంపేశారు. ఎలా చనిపోయాడని చెబితే సరైన కారణాలను గ్రామస్తులకు చెప్పలేకపోయారు. పైగా శరవేగంగా అంత్యక్రియలు పూర్తి చేసేందుకు పూనుకోగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడి వచ్చిన పోలీసులు విచారణ ప్రారంభించగా అసలు విషయం తెలిసింది.