కట్టుకున్న భార్యను కడతేర్చాడు ఓ భర్త
ముదిగొండ: కట్టుకున్న భార్యను కడతేర్చాడు ఓ భర్త . ఈ సంఘటన ఖమ్మం జిల్లాలోని ముదిగొండ మండలం కమలాపురం ఎస్సీకాలనీలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గురుజాల శ్రీనివాస్ రావు అనే వ్యక్తి తన భార్యను గొంతు నులిమి చంపి అనంతరం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. హత్యకు వివాహేతర సంబంధం కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.