లక్నో: మన దేశంలో న్యాయవ్యవస్థ మీద గౌరవం ఉన్నప్పటికీ.. ఆ నత్తనడక విధానాల మాత్రం ఎందుకనో విమర్శలు చేయకుండా ఉండలేం. తాజాగా అలాంటి ఘటన ఒకటి యూపీలో జరిగింది.
దాదాపు 28 ఏళ్ల కిందటి నాటి కేసులో.. ఓ పెద్దాయనకు తాజాగా నోటీసులు అందాయి. ఆ సమన్లను ఇంటికి వెళ్లి మరీ అందించిన పోలీసులు.. కోర్టు విచారణకు హాజరు కాకపోతే అరెస్ట్ చేస్తామంటూ హెచ్చరించి వెళ్లారు. అసలే పక్షవాతంతో మంచానికే పరిమితమైన ఆ పెద్దాయన ఆ నోటీసులు చూసి ఇంకా వణికిపోతున్నాడట. ఇంతకీ ఆ పెద్దాయన చేసిన నేరం.. రవాణా శాఖలో డ్రైవర్‌గా పని చేస్తూ ఆ టైంలో ఓ బర్రెను ఢీ కొట్టి అతను చంపాడట.
ఆ కేసుకు సంబంధించి నోటీసులు ఇప్పుడు బరేలీ పోలీసులు బరాబాన్కీలో ఉన్న ఇంటికి వెళ్లి మరీ అందజేశారు. ఆ సమన్లను చూసి పాపం 83 ఏళ్ల అచ్చన్ షాక్ తిన్నాడట. 1994 ప్రాంతంలో ఘటన జరిగితే.. పోలీసులు ఇప్పుడు రావడంతో అచ్చన్ పాపం భయంతో వణికిపోతున్నాడు. ఆ టైంలో రెండు సార్లు సమన్లు వస్తే.. బెయిల్ తెచ్చుకున్నాడట. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కేసు వెలుగులోకి రావడంతో పాపం ఆ పెద్దాయన వణికిపోతున్నాడు.
ఇదీ చదవండి: అమ్మను కాపాడుకునేందుకు సాహసం
Comments
Please login to add a commentAdd a comment