
కొచ్చి: లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలపై బెంగళూరు పోలీసులను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ఘటన కేరళలోని కొచ్చి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ వ్యక్తిని కొందరు నిందితులు మోసం చేశారు. దీంతో కర్ణాటకలో ఈ ఘటనపై చీటింగ్ కేసు నమోదు కాగా ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్న నలుగురు పోలీసులు కేరళకు చేరుకున్నారు. నలుగురు నిందితులను గుర్తించిన పోలీసులు వారిని పట్టుకున్నారు.
అయితే అంతటితో ఆగకుండా నిందితులను విడిచిపెట్టడానికి వాళ్లు కొంత డబ్బును డిమాండ్ చేశారు. దీంతో నిందితుల్లో ఒకడు కేరళ పోలీసులకు ఫిర్యాదు చేయగా కర్ణాటక పోలీసులను కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వాహనం నుంచి రూ. 3.95 లక్షలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న నలుగురు పోలీసులపై దోపిడీ ఆరోపణల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారిలో ఒకరు తెలిపారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. ఈ విషయాన్ని పరిశీలించడానికి కర్ణాటక పోలీసు నుంచి సీనియర్ అధికారి కొచ్చికి చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment