
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని కరాచీ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డెరెక్టర్, ప్రముఖ కంటి వైద్యుడు, హిందూ మతస్థుడైన డాక్టర్ బీర్బల్ జినానీని దుండుగులు గురువారం తుపాకీతో కాల్చి చంపారు. కరాచీ సమీపంలోని ల్యారీ ఎక్స్‌ప్రెస్ రహదారిపై కారులో వెళ్తుండగా దుండుగులు ఘాతుకానికి పాల్పడ్డారు.
పాకిస్తాన్‌లో హిందువులే లక్ష్యంగా దాడులు పెరిగిపోతున్నాయి. మార్చి నెలలో ఇది రెండో హత్య కావడం గమనార్హం. ఇటీవలే పాకిస్తాన్‌లోని హైదరాబాద్ పట్టణంలో హిందూ మతానికి చెందిన ధరమ్‌దేవ్ రాఠీ అనే వైద్యుడిని ముష్కరులు పొట్టనపెట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment