meghana travels
-
హైదరాబాద్‌లో తృటిలో తప్పిన పెను ప్రమాదం
-
ట్రావెల్స్ బస్సులో మంటలు
-
ట్రావెల్స్ బస్సులో మంటలు
సాక్షి, ఒంగోలు: ప్రకాశం జిల్లాలోని హనుమంతునిపాడు మండలం వేములపాడు సమీపంలో మంగళవారం అర్ధరాత్రి పెను ప్రమాదం తప్పింది. షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కాలి బూడిదైంది. డ్రైవర్ అప్రమత్తతతో 40 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బస్సు కడప నుంచి విజయవాడ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దగ్ధమైన బస్సు విజయవాడకు చెందిన మేఘన ట్రావెల్స్‌కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. బస్సు ప్రమాదంతో ప్రయాణికులు అర్ధరాత్రి రోడ్డుపైనే గడపాల్సి వచ్చింది. -
ప్రైవేటు బస్సులో మంటలు : ప్రయాణికుల ఇక్కట్లు
హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా బూత్పూర్ వద్ద మేఘన ట్రావెల్స్‌కు చెందిన బస్సులో బుధవారం రాత్రి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. వెంటనే గమనించిన డ్రైవర్ బస్సును రహదారి పక్కన ఆపేశాడు. దీంతో ప్రయాణికులు బస్సు నుంచి కిందకు దిగడంతో పెనుప్రమాదం తప్పింది. బస్సు నిలిచిపోవడంతో ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. బస్సులోని మహిళలు, పిల్లలు, వృద్ధులు చీకట్లో, చలికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొద్ది సేపటి తర్వాత మరో బస్సులో ప్రయాణికులను తిరుపతి తరలించామని ట్రావెల్స్ యజమాని తెలిపారు. -
ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం
-
ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం
ఏలూరు: వేగంగా వెళ్తున్న ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 18 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పరిధిలోని అమ్మపాలెం పెట్రోలుబంకు వద్ద సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మేఘనా ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. -
నడిరోడ్డుపై ప్రయాణికులను వదిలేశారు!
-
అర్థరాత్రి నుంచి రోడ్డుపైనే పడిగాపులు
కట్టంగూర్ (నల్లగొండ): నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం అయిటిపాముల వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అర్థాంతరంగా నిలిచిపోవటంతో ప్రయాణికులు అర్ధరాత్రి నుంచి పడిగాపులు కాస్తున్నారు. హైదరాబాద్ నుంచి గురువారం రాత్రి 10 గంటలకు విశాఖ బయలుదేరిన మేఘనా ట్రావెల్స్‌కు చెందిన బస్సు సాంకేతిక లోపంతో అయిటిపాముల సమీపంలో జాతీయ రహదారిపై ఆగిపోయింది. బస్సులో 40 మంది ప్రయాణికులున్నారు. ఆరుగంటల నుంచి రోడ్డు పక్కనే తాము ఇబ్బందులు పడుతున్నా కనీసం పట్టించుకోలేదని ట్రావెల్స్ యాజమాన్యంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్
హైదరాబాద్ : ప్రయాణికుల పట్ల ప్రయివేట్ ట్రావెల్స్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. దాంతో ప్రయివేట్ ట్రావెల్స్ ఆగడాల కారణంగా ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నుంచి నర్సాపురం వెళుతున్న మేఘన ట్రావెల్స్ బస్సు సాంకేతికలోపంతో అశోక్‌నగర్ వద్ద నిలిచిపోయింది. దాంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు గత అర్థరాత్రి నుంచి రోడ్డుపైనే పడిగాపులు కాస్తున్నారు. మరో బస్సులో తమను తరలించేలా ట్రావెల్స్ యాజమాన్యానికి తెలియజేయాలని డ్రైవర్, క్లీనర్‌కు ప్రయాణికులు సూచించారు. అందుకు వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల మొదటి వారంలో కూడా ఇదే ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి నర్సాపురం వెళ్తు కంచికచర్ల సమీపంలో బ్రేక్ డౌన్ అయిన సంగతి తెలిసిందే.