అర్థరాత్రి నుంచి రోడ్డుపైనే పడిగాపులు | private bus stopped and passengers on road since midnight | Sakshi
Sakshi News home page

అర్థరాత్రి నుంచి రోడ్డుపైనే పడిగాపులు

Published Fri, May 29 2015 7:07 AM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM

private bus stopped and passengers on road since midnight

కట్టంగూర్ (నల్లగొండ): నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం అయిటిపాముల వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అర్థాంతరంగా నిలిచిపోవటంతో ప్రయాణికులు అర్ధరాత్రి నుంచి పడిగాపులు కాస్తున్నారు. హైదరాబాద్ నుంచి గురువారం రాత్రి 10 గంటలకు విశాఖ బయలుదేరిన మేఘనా ట్రావెల్స్‌కు చెందిన బస్సు సాంకేతిక లోపంతో అయిటిపాముల సమీపంలో జాతీయ రహదారిపై ఆగిపోయింది. బస్సులో 40 మంది ప్రయాణికులున్నారు. ఆరుగంటల నుంచి రోడ్డు పక్కనే తాము ఇబ్బందులు పడుతున్నా కనీసం పట్టించుకోలేదని ట్రావెల్స్ యాజమాన్యంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement