
ప్రైవేటు బస్సులో మంటలు : ప్రయాణికుల ఇక‍్కట్లు
హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా బూత్పూర్ వద్ద మేఘన ట్రావెల్స్‌కు చెందిన బస్సులో బుధవారం రాత్రి ఒక్కసారిగా మంటలు వచ్చాయి.
వెంటనే గమనించిన డ్రైవర్ బస్సును రహదారి పక‍్కన ఆపేశాడు. దీంతో ప్రయాణికులు బస్సు నుంచి కిందకు దిగడంతో పెనుప్రమాదం తప్పింది. బస్సు నిలిచిపోవడంతో ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. బస్సులోని మహిళలు, పిల‍్లలు, వృద్ధులు చీకట‍్లో, చలికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొద్ది సేపటి తర్వాత మరో బస్సులో ప్రయాణికులను తిరుపతి తరలించామని ట్రావెల్స్ యజమాని తెలిపారు.