
ట్రావెల్స్ బస్సులో మంటలు
సాక్షి, ఒంగోలు: ప్రకాశం జిల్లాలోని హనుమంతునిపాడు మండలం వేములపాడు సమీపంలో మంగళవారం అర్ధరాత్రి పెను ప్రమాదం తప్పింది. షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కాలి బూడిదైంది. డ్రైవర్ అప్రమత్తతతో 40 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బస్సు కడప నుంచి విజయవాడ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దగ్ధమైన బస్సు విజయవాడకు చెందిన మేఘన ట్రావెల్స్‌కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. బస్సు ప్రమాదంతో ప్రయాణికులు అర్ధరాత్రి రోడ్డుపైనే గడపాల్సి వచ్చింది.