అశోక్‌నగర్‌లో ట్రాఫిక్‌ను నియంత్రించండి | Traffic Control Helpline Ashok Nagar | Sakshi
Sakshi News home page

అశోక్‌నగర్‌లో ట్రాఫిక్‌ను నియంత్రించండి

Published Thu, Aug 22 2013 11:58 PM | Last Updated on Fri, Sep 1 2017 10:01 PM

Traffic Control Helpline Ashok Nagar

భివండీ, న్యూస్‌లైన్: పట్టణంలోని అశోక్‌నగర్, గోపాల్‌నగర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యను నియంత్రించాలని కోరుతూ సామాజిక కార్యకర్త ప్రవీణ్ పాటిల్ ఒక ఫ్లెక్సీని తయారు చేసి స్థానిక రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్‌కు అందజేశారు. ఈ ప్రాంతాల్లో పాఠశాలలు, ప్రైవేటు ఆస్పత్రులు ఎక్కువగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. స్థానికంగా ఉన్న ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసులు, ప్యాకింగ్‌కు సంబంధించిన చిన్న గోదాముల వల్ల రోడ్లపై నిత్యం వాహనాలు, ట్రక్కులు నిలుపుతుండటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement