డాన్స్‌తో ట్రాఫిక్‌ కంట్రోల్‌.. వీడియో వైరల్‌! | Policeman Seen Controlling Traffic in Dancing Style | Sakshi
Sakshi News home page

Nagaland: డాన్స్‌తో ట్రాఫిక్‌ కంట్రోల్‌.. వీడియో వైరల్‌!

Published Wed, Feb 28 2024 1:25 PM | Last Updated on Wed, Feb 28 2024 1:25 PM

Policeman Seen Controlling Traffic in Dancing Style - Sakshi

మనిషన్నాక ఏదోఒక అభిరుచి ఉంటుంది. కొందరికి సింగర్ కావాలని, మరికొందరికి యాక్టర్‌ కావాలనివుంటుంది. అలాగే  రచయిత కావాలని,  క్రీడాకారులు కావాలని కూడా కొందరు కోరుకుంటారు. అయితే కొంతమంది తమ అభిరుచిని వదిలి వేరే పని చేయాల్సి వస్తుంది. అలాంటివారు వారి అభిరుచిని వదులుకోలేరు. ఒక ట్రాఫిక్ పోలీస్ విషయంలో ఇదే కనిపించింది. అతనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. 

ఈ వీడియోలో సదరు ట్రాఫిక్ కానిస్టేబుల్‌ రోడ్డుపై ట్రాఫిక్‌ను నియంత్రించడాన్ని గమనించవచ్చు. అయితే అతను డ్యాన్స్ చేస్తూ, ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేయడాన్ని చూడవచ్చు. ఒకసారి మూన్‌వాక్‌తో, మరోమారు స్టెప్పులు వేస్తూ.. వాహనాలకు సిగ్నల్‌ ఇస్తూ కనిపిస్తున్నాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో విపరీతంగా లైక్  చేస్తున్నారు. 

ఈ వీడియోను నాగాలాండ్ ప్రభుత్వ పర్యాటక, ఉన్నత విద్యా శాఖ మంత్రి టెమ్‌జిన్ ఇమ్నా అలోంగ్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్  ‘ఎక్స్‌’లో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకూ  51 వేల మందికి పైగా నెటిజన్లు వీక్షించారు. వీడియోను చూసిన ఒక యూజర్‌ కామెంట్‌ బాక్స్‌లో.. ‘మా సింగం సార్.. ఇండోర్ నుండి వచ్చారు. నేను ఆయనను చూసేందుకు హైకోర్టు స్క్వేర్‌కి వెళ్తుంటాను’ అని రాశారు. మరొక యూజర్‌ ‘సూపర్‌’అని రాశారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement