కడప అర్బన్: కడప నగరంలోని చిన్నచౌకు పోలీసుస్టేషన్ పరిధిలోని అశోక్‌నగర్‌లో చోరీ జరిగింది. బాధితురాలు మేరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. తాను ఎదిరింటిలో ఉన్న తన బంధువు ఇంట్లో గత రాత్రి నిద్రించానని, ఉదయం చూసేలోపు చోరీ జరిగిందని ఫిర్యాదులో పేర్కొంది. మూడు తులాల బంగారు ఆభరణాలు, రూ. 6 వేల నగదు దొంగలు దోచుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చిన్నచౌకు పోలీసులు తెలిపారు.