అనంతపురం సెంట్రల్ : నగరంలోని శుక్రవారం పట్టపగలే చోరీ జరిగింది. బాధితులు తెలిపిన మేరకు... అశోకనగర్ రెండో క్రాస్‌లో నాగరాజు, అనిత దంపతులు నివాసముంటున్నారు. నాగరాజు వ్యక్తిగత పని నిమత్తం చెన్నైకు వెళ్లాడు. శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో అనిత అదేకాలనీలో నిర్మాణంలో ఉన్న సొంత ఇంటి వద్దకు వెళ్లింది. అరగంట తర్వాత తిరిగి ఇంటికి వచ్చి చూడగా తలుపులు తెరిచి ఉన్నాయి. దుండగులు బీరువా తలుపులు పగలకొట్టి అందులో 20 తులాల బంగారు ఆభరణాలు, రూ. 2లక్షలు నగదు చోరీ చేసినట్లు గుర్తించింది. వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎస్‌ఐ రంగయాదవ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.