
బోల్తా పడిన గూడ్స్ రైలు
ఖమ్మం: కిరణ్‌డోల్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో గూడ్స్ రైలుకు చెందిన రెండు ఇంజన్లతో పాటు ఏడు భోగీలు బోల్తా కొట్టాయి. ఈ సంఘటన దంతెవాడ జిల్లాలో చోటుచేసుకుంది. దంతెవాడ, భంసీ రైల్వేస్టేషన్ల మధ్య మావోయిస్టులు పట్టాలు తొలగించడంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. దీంతో ఈ లైన్‌లో ప్రయాణించే రైల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
(చింతూరు)