పాయింట్స్‌మెన్ అప్రమత్తతతో తప్పిన పెనుప్రమాదం
గుంటూరు: విరిగిన రైలు పట్టాను సిబ్బంది సకాలంలో గుర్తించడం తో పెను ప్రమాదం తప్పింది. విజయవాడ–చెన్నై రైలుమార్గంలో గుంటూరు జిల్లా దుగ్గిరాల రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఉదయం 6.30 గంటలకు పినాకిని ఎక్స్‌ప్రెస్‌కు సిగ్నల్ ఇచ్చేందుకు దుగ్గిరాల రైల్వే స్టేషన్‌లో పాయింట్స్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న డి. నాగరాజు రైలు పట్టాలు దాటి అవతలివైపునకు వెళ్లాడు.
పినాకిని ఎక్స్‌ప్రెస్ స్టేషన్ దాటి వెళ్ళిన తరువాత తిరిగి పట్టాలు దాటుతున్న సమయంలో పట్టా విరిగినట్లు గమనించి స్టేషన్‌మాస్టర్‌కు, రైల్వే కంట్రోల్‌కు సమాచారం అందించారు. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే రైళ్లను దారిమళ్లించారు.
దుగ్గిరాలలో విరిగిన రైలుపట్టా
Published Mon, Jan 30 2017 3:28 AM | Last Updated on Tue, Sep 5 2017 2:25 AM
Advertisement
Advertisement