duggirala
-
దుగ్గిరాల ఎంపీపీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నిక
సాక్షి, గుంటూరు: దుగ్గిరాల ఎంపీపీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి రూపవాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోటీలో ఒక్కరే ఉండటంతో ఎంపీపీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి దానబోయిన సంతోష రూపవాణి ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మొత్తం 18 ఎంపీటీసీ స్థానాలకు గాను 9 స్థానాల్లో టీడీపీ, 8 స్థానాల్లో వైఎస్సార్సీపీ, ఒక స్థానంలో జనసేన విజయం సాధించింది. కాగా, బీసీ మహిళకు ఎంపీపీ స్థానం రిజర్వ్ చేసి ఉంది. అయితే, టీడీపీ నుంచి బీసీ మహిళ సభ్యురాలు లేకపోవడంతో వైఎస్సార్సీపీ మహిళా సభ్యులను ప్రలోపెట్టేందుకు టీడీపీ ప్రయత్నించింది. దీనిపై అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి టీడీపీలో బీసీ మహిళ లేకపోవడంతో ఎన్నికను ఏకగ్రీవం చేశారు. -
నారా లోకేశ్ దారుణాలు సృష్టిస్తున్నారు: ఆళ్ల రామకృష్ణారెడ్డి
సాక్షి, గుంటూరు: దుగ్గిరాల ఎంపీపీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి రూపవాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోటీలో ఒక్కరే ఉండటంతో ఎంపీపీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి దానబోయిన సంతోష రూపవాణి ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు మొత్తం 18 ఎంపీటీసీ స్థానాలకు గాను 9 స్థానాల్లో టీడీపీ, 8 స్థానాల్లో వైఎస్సార్సీపీ, ఒక స్థానంలో జనసేన విజయం సాధించింది. కాగా, బీసీ మహిళకు ఎంపీపీ స్థానం రిజర్వ్ చేసి ఉంది. అయితే, టీడీపీ నుంచి బీసీ మహిళ సభ్యురాలు లేకపోవడంతో వైఎస్సార్సీపీ మహిళా సభ్యులను ప్రలోపెట్టేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉండగా.. వైఎస్సార్సీపీ నుంచి ఇద్దరు మహిళలు ఎంపీటీసీలుగా గెలుపొందారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రజాస్వామ్యంగా జరగాల్సిన ఎన్నికల్లో ఎందుకు గందరగోళం సృష్టిస్తున్నారు. మేము ఎక్కడా తప్పు చేయలేదు. గెలిచిన 8 మందితోనే మేము ముందుకు వెళ్తాం. టీడీపీలో మహిళా అభ్యర్థి లేకపోవడంతో పచ్చనేతలు వైఎస్సార్సీపీ నేతలను మభ్యపెడుతున్నారని తమ వైపు లాక్కోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రశాంతంగా ఉండే దుగ్గిరాలలో నారా లోకేశ్ దారుణాలు సృష్టిస్తున్నారు’’ అని విమర్శించారు. ఇది కూడా చదవండి: ఈనెల 7,8 తేదీల్లో ఏఎన్‌యూలో వైఎస్సార్ సీపీ మెగా జాబ్ మేళా -
5న దుగ్గిరాల ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నిక
దుగ్గిరాల(తెనాలిటౌన్): దుగ్గిరాల మండల పరిషత్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు, కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక ఈనెల 5న జరుగుతుందని ఎంపీడీఓ కుసుమ శ్రీదేవి ఆదివారం తెలిపారు. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిందని ఆమె వివరించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా తాడేపల్లి ఎంపీడీఓ రామ ప్రసన్న వ్యవహరిస్తారని, గతంలో కోరం లేక పోవడంతో మండల పరిషత్ అధ్యక్షుని ఎన్నిక జరగలేదని వివరించారు. దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయంలో 5న ఉదయం 10గంటలకు కో–ఆప్షన్ సభ్యుడి పదవికి నామినేషన్ల దాఖలు, మధ్యాహ్నం 12 గంటల లోపు నామినేషన్ల పరిశీలన, ఒంటిగంట తరువాత నామినేషన్ల ఉపసంహరణ, అనంతరం కో–ఆప్షన్ సభ్యుని ఎన్నిక జరుగుతుందని, మధ్యాహ్నం మూడు గంటలకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నికతో ఈ ప్రక్రియ ముగుస్తుందని ఎంపీడీఓ వెల్లడించారు. -
టీడీపీ కార్యకర్త అరాచకం.. మహిళపై అత్యాచారయత్నం
సాక్షి, గుంటూరు: టీడీపీ క్రియాశీలక కార్యకర్త మల్లెల కిరణ్ దారుణానికి ఒడిగట్టాడు. ఓ మహిళా కూలీపై అత్యాచారానికి ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. దుగ్గిరాల మండలం శృంగారపురంలో కిరణ్ శుక్రవారం.. ఓ మహిళా కూలీపై అత్యాచారయత్నం చేశాడు. బాధితురాలిని పొలాల్లోకి లాక్కెళ్తుండగా తోటి కూలీలు గమనించారు. ఈ క్రమంలో డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు అక్కడికి చేరుకుని కిరణ్‌ను అరెస్ట్ చేశారు. -
దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికను ఆపండి
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నికపై హైకోర్టు స్టే విధించింది. అధ్యక్ష పదవికి పోటీచేస్తున్న షేక్ జబీన్ కులధ్రువీకరణపై వారంలోపు నిర్ణయం ప్రకటించాలని గుంటూరు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. అప్పటివరకు ఎంపీపీ ఎన్నిక నిర్వహించవద్దని ఎన్నికల కమిషన్‌తో పాటు ఇతర అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. తన కులధ్రువీకరణపై కలెక్టర్ వద్ద అప్పీల్ పెండింగ్‌లో ఉండగానే ఎంపీపీ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారని, తనకు బీసీ–ఈ కులధ్రువీకరణ పత్రం ఇచ్చేంతవరకు దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికను నిలిపివేయాలని కోరుతూ టీడీపీ ఎంపీటీసీ సభ్యురాలు షేక్ జబీన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై గురువారం జస్టిస్ దేవానంద్ విచారణ జరిపారు. -
దుగ్గిరాలలో టీడీపీ నీచ రాజకీయాలు
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో టీడీపీ నీచ రాజకీయాలకు దిగింది. వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన ఇద్దరు బీసీ మహిళలను, కొంతమంది ఎంపీటీసీలను తమవైపు తిప్పుకునేందుకు సొమ్ములు ఆశ చూపి భంగపడిన నారా లోకేశ్ బృందం.. చివరకుబెదిరింపులకు దిగుతోంది. నారా లోకేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరిలో ఘోర పరాజయం పొందిన నాటినుంచీ మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరగకుండా కోర్టులను ఆశ్రయిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్న విషయం విదితమే. దుగ్గిరాల మండల పరిధిలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీకి మెజారిటీ స్థానాలు దక్కినప్పటికీ.. గెలిచిన వారిలో బీసీ మహిళ లేకపోవడంతో శుక్రవారం జరిగిన ఎంపీపీ ఎన్నికలకు టీడీపీ ఎంపీటీసీలంతా గైర్హాజరయ్యారు. ఎలాగైనా ఎంపీపీ పదవిని దక్కించుకోవాలన్న ఉద్దేశంతో గెలిచిన టీడీపీ అభ్యర్ధులందరినీ విజయవాడలోని నోవా టెల్ హోటల్లో ఏర్పాటు చేసిన క్యాంప్‌నకు తరలించారు. ఆ తరువాత అక్కడి నుంచి వారిని సికింద్రాబాద్ తరలించారు. ఎంపీటీసీలకు బెదిరింపులు వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన ఇద్దరు బీసీ మహిళలను, మరికొందరు ఎంపీటీసీలను టీడీపీ వైపు తిప్పుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తూ బేరసారాలు కొనసాగిస్తున్నారు. ఇద్దరు బీసీ మహిళలకు రూ.50 లక్షలకు పైగా ఇస్తామంటూ టీడీపీ నేతలు ఆశ చూపినప్పటికీ వారు సున్నితంగా తిరస్కరించారు. నాయకుల బేరసారాలు ఫలించకపోవడంతో లోకేశ్ బృందం రంగంలోకి దిగింది. బీసీ మహిళా ఎంపీటీసీలకు, ఇతర సభ్యులకు వారి కుల పెద్దలతో ఫోన్లు చేయించి బేరసారాలు చేస్తున్నారు. మరోవైపు వారి బంధువులను ఇళ్లకు పంపించి బెదిరించే కార్యక్రమాలు చేపట్టారు. ఇంకోపక్క ‘భవిష్యత్‌లో మనకు ఇలాంటి అవకాశం రాదు. ఇప్పుడే డబ్బులు సంపాదించుకోవాలి, రేపు పదవి ఉంటుందో ఉండదో. పదవి లేకపోతే ఎవరూ మనవంక చూడరు. లోకేశ్ బాబుకు మద్దతు పలకండి. నాలుగేళ్ల తరువాత జగన్ ఉండడు. జగన్ లేకపోతే వైఎస్సార్ సీపీ ఉండదు’ అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. అధికార పార్టీలో ఉన్నప్పటికీ మేమిచ్చిన డబ్బులు తీసుకుంటే మీరు ఎంపీపీ అయిన తరువాత అభివృద్ధి పనులు ఏం చేసినా సంతకానికి ఒక రేటు ఉంటుందంటూ ఆశ చూపిస్తున్నారు. వారి ప్రలోభాలకు లొంగని వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు తాము ఎట్టి పరిస్థితుల్లో పార్టీని వీడేది లేదని తెగేసి చెబుతున్నారు. శుక్రవారం వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యుడి కుటుంబ సభ్యులతో టీడీపీ నేతలు మాట్లాడిన ఆడియో లీక్ అయ్యింది. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అవినీతి సంపదతో నీతిబాహ్యమైన పద్ధతులతో దుగ్గిరాల ఎంపీపీ పదవిని దక్కించుకునేందుకు చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్ చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు ఛీదరించుకుంటున్నారు. -
తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం: ఏఆర్కే
సాక్షి, గుంటూరు: బకింగ్ హామ్ కెనాల్ రోడ్‌ను రూ. 200 కోట్లతో నాలుగు లైన్లుగా మార్చడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమోదించారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు.ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తెనాలి నుంచి మంగళగిరి నేషనల్ హైవే రోడ్డు వరకు నిర్మించబోయే రోడ్డుకు త్వరలో టెండర్లు ప్రారంభమవుతాయని చెప్పారు. దుగ్గిరాల మండలంలో 18 గ్రామాల్లో రూ.70 నుంచి రూ. 80 కోట్లతో తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశామని పేర్కొన్నారు. దుగ్గిరాల మండలాన్ని రూ. 400 కోట్లతో అభివృద్ధి చేయడానికి ఆమోదం తెలిపిన సీఎం జగన్‌కు ఎమ్మెల్యే ఆర్కే ధన్యవాదాలు తెలిపారు. -
నిమ్మగడ్డ ఊరులో వైఎస్సార్సీపీ అభిమానుల హవా
సాక్షి, తాడేపల్లి రూరల్ (దుగ్గిరాల): రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ స్వగ్రామంలో వైఎస్సార్సీపీ అభిమానులు విజయకేతనం ఎగురవేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల గ్రామంలో సర్పంచ్, ఆయన గృహం ఉన్న వార్డులో కూడా వైఎస్సార్సీపీ అభిమానులు గెలుపొందారు. గ్రామ సర్పంచ్ పదవిని బాలావర్తు కుషీబాయి 1,169 ఓట్ల భారీ మెజారిటీతో గెల్చుకున్నారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ సొంత వార్డులో వైఎస్సార్సీపీ అభిమాని ఆత్మకూరు నాగేశ్వరరావు భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ మొత్తం 490 ఓట్లు పోలవగా నాగేశ్వరరావుకు 256 ఓట్లు వచ్చాయి. టీడీపీ మద్దతుదారుకు 145 ఓట్లు పోలయ్యాయి. చదవండి: (మళ్లీ అదే తీర్పు.. 2,319 పంచాయతీల్లో వైఎస్సార్సీపీ..) (టీడీపీకి మిగిలింది నిమ్మగడ్డ, నిమ్మాడే) (తొలివిడతపై ఎస్ఈసీ నిమ్మగడ్డ సంతృప్తి) -
సొంత గడ్డకు నిమ్మగడ్డ
సాక్షి, తాడేపల్లి రూరల్ (దుగ్గిరాల): ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఆదివారం స్వగ్రామం దుగ్గిరాలకు విచ్చేశారు. ఆయన రాకను పురస్కరించుకొని టీడీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్డు పొడవునా స్వాగతం పలికారు. ఏడాదిగా సొంతూరుకు వెళ్లని నిమ్మగడ్డ, ఇప్పుడు బిజీగా గడుపుతున్న వేళఊర్లో ప్రత్యక్షమవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. దుగ్గిరాల మండలానికి చెందిన కొంత మంది టీడీపీ నాయకులు ఆయన్ను కలిసి ఇంట్లో గంటన్నర పైనే మాట్లాడారు. నిమ్మగడ్డను కలిసిన వారిలో మాజీ సర్పంచ్ జంపాల కృష్ణారావు, దుగ్గిరాల బీజేపీ నాయకురాలు చుండూరు ఉమ తదితరులు ఉన్నారు. దుగ్గిరాల తహసీల్దార్ మల్లేశ్వరి నిమ్మగడ్డకు స్వాగతం పలికారు. చదవండి: (పరిటాల సునీతకు ఎదురుదెబ్బ) -
చింతమనేని ప్రభాకర్ అరెస్టు..
సాక్షి, పశ్చిమగోదావరి: దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ఎట్టకేలకు అరెస్టయ్యారు. దళితులను దూషించి.. దౌర్జన్యం చేసినట్టు కేసులు ఎదుర్కొంటున్న చింతమనేని గత పన్నెండురోజులుగా పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాటకీయ పరిణామాల మధ్య చింతమనేని బుధవారం ఉదయం దుగ్గిరాలలోని తన ఇంటి వద్ద ప్రత్యక్షమయ్యారు. ఈ సందర్భంగా ఆయన అనుచరులు రెచ్చిపోయారు. చింతమనేని నివాసంలో ఆరుగురు మహిళా కానిస్టేబుళ్లను అనుచరులు నిర్బంధించారు. ఈ క్రమంలో భారీగా మోహరించిన పోలీసులు చింతమనేని అరెస్టు చేశారు. పినకడిమి గ్రామానికి చెందిన దళిత యువకులపై దాడి ఘటనలో చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇదే కాకుండా పలు అక్రమాలు, దౌర్జన్యాలకు సంబంధించి చింతమనేనిపై పోలీసులు 10 కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసుల అరెస్టు నుంచి తప్పించుకునేందుకు చింతమనేని అజ్ఞాతంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా, చింతమనేని ప్రభాకర్‌ను అరెస్ట్ చేసి తీసుకెళుతున్న పోలీస్ వాహనాన్ని గోపన్నపాలెం వద్ద ఆయన అనుచరులు అడ్డగించారు. ఈ సందర్భంగా పోలీసులకు, చింతమనేని అనుచరులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. -
పాపకెందుకు శిక్ష ?
శుక్రవారం తెనాలిలో కోర్టు ప్రాంగణం.. ఆరేళ్ల పాప.. ముఖంలో ఆందోళన.. నీళ్లు తిరుగుతున్న కళ్లలో భయం.. ఎటుపోవాలో, ఎవరితో మాట్లాడాలో తెలియదు.. అమ్మ వెళ్లిన వైపే చూస్తోంది. ఎంతకీ అమ్మ కనిపించడం లేదు. ఏం చేయాలో తెలియ లేదు. కొద్ది గంటల ముందు వరకు నాన్న కళ్ల ముందు అలా మెరిసి మాయమైపోయాడు. నా చిట్టి తల్లీ అంటూ దగ్గరకు తీసుకుంటాడేమోనని ఆశ పడింది. నాన్న దూరంగానే వెళ్లిపోయాడు.. బిక్కముఖం వేసుకుని ఉన్న పాపను నల్ల చొక్కాలు పలకరించి ఆరా తీశాయి.. ‘అమ్మ బాత్రూమ్కు వెళ్లి వస్తానని చెప్పి.. ఇంకా రాలేదు.. అందుకే చూస్తున్నాన’ని పాప బదులిచ్చింది. తల్లి గురించి ఆరా తీస్తే.. భార్యాభర్తల విభేదాల కేసు.. తల్లి తనతో పాపను తీసుకొచ్చింది. తండ్రి కనిపించేసరికి పాపను ఆయన ముందు వదిలేసింది.. విభేదాలు నిండిన గొంతుల్లో మాటలు పెగల్లేదు.. పాప గురించి భర్తకు ఆమె చెప్పలేదు.. చట్టాల ఆంక్షలు చుట్టుకుంటాయనే నెపంతో కన్న బిడ్డ చెంతకు తండ్రి రాలేదు.. నాన్న గుండెలపై మమకారం చిందలేదు. ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. అందుకే అమ్మ ఆప్యాయతల ఒడిలో మాధుర్యాన్ని, నాన్న గుండెలపై అనురాగాన్ని అందుకోవాల్సిన బిడ్డ అనాథగా రోడ్డుపై నిలబడింది.. విచ్ఛిమవుతున్న కుటుంబ బాంధ్యవాలకు నిలువెత్తు సాక్ష్యంగా.. తెగిపోతున్న మానవసంబంధాల నడుమ పిల్లలు తెగినగాలిపటాలవుతున్నారు. గాలిపటానికిసూత్రం, దారం ఉంటేనే ఆకసాన ఎగిరేది...పిల్లలకు తల్లిదండ్రుల ఆసరా ఉంటేనే ఉన్నతంగాఎదిగేది...నేటి సమాజంలో చిన్నచిన్న వివాదాలతోదాంపత్యబంధాలను తెగతెంపుకొంటున్న తల్లిదండ్రులు...వారి కడుపున పుట్టిన పాపానికి పిల్లల బతుకులు తెగినగాలిపటాల్లా చిందరవందర అవుతున్నాయి. తెనాలి కోర్టు ఆవరణలో శుక్రవారం తారసిల్లినఈ బాలిక ఉదంతం ఇటువంటి లక్షలాదిఅభాగ్యులకో ఉదాహరణ. గుంటూరు, తెనాలి: అది పట్టణంలోని కొత్తపేటలో రెండో అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేటు కోర్టు. కక్షిదారులు, వారికి తోడుగా వచ్చిన బంధువులు/స్నేహితులు, న్యాయవాదులు, సహాయకులతో బిజీగా ఉంది. న్యాయమూర్తి వచ్చేసరికి కోర్టు హాలంతా నిశ్శబ్దంగా తయారైంది. ప్రతిరోజులాగానే యథావిధిగా కోర్టు కార్యకలాపాలు మొదలయ్యాయి. గంట గడిచేసరికి కక్షిదారుల దగ్గర కూర్చున్న ఆరేళ్ల పాప ఏడవటం ఆరంభించింది. పక్కనున్న మహిళ, ‘ఎవరమ్మా నువ్వు?...మీ అమ్మ లేదా’ అని ప్రశ్నించింది. ‘లేదాంటీ...బాత్రూమ్కు వెళ్లొస్తానంది...ఇంకా రాలేదు’ అని ఏడుస్తూనే సమాధానమిచ్చింది. పాప ఒంటరిగా ఉందని తెలుసుకున్న ఆ మహిళ మంచినీళ్లు, భోజనం పెట్టి ఓదార్చింది. విషయం న్యాయవాదులకు, వారినుంచి న్యాయమూర్తికి తెలిసింది. సాయంత్రానికి ఎవరూ రాకపోతే చట్టప్రకారం చేద్దామని న్యాయమూర్తి సూచించారు. తీరా విచారిస్తే గృహహింస కేసులో వాయిదాలకు తిరుగుతున్న భార్యాభర్తల నిర్లక్ష్యం, ఆ పాపను ఒంటరిని చేసిందని తెలిసి, అక్కడున్న అందరి మనసులు బరువెక్కాయి. దుగ్గిరాల మండలం ఈమనికి చెందిన లక్ష్మీతిరుపతమ్మ, హైదరాబాద్‌లో ఫార్మా కంపెనీలో చేస్తున్న అమృతలూరు మండలం ప్యాపర్రు వాస్తవ్యుడు వెంకటస్వామికి ఎనిమిదేళ్ల క్రితం పెళ్లయింది. రెండేళ్ల తర్వాత మోక్షిత జన్మించింది. అప్పట్నుంచి ఇద్దరి మధ్య కలతలు మొదలయ్యాయి. కొన్నేళ్లు విడిగా ఉన్నారు. మళ్లీ కలిశారు. రెండో కుమార్తె కూడా జన్మించింది. భార్యాభర్తల మధ్య విభేదాలు మాత్రం తగ్గలేదు. ఫలితంగా స్థానిక కోర్టులో గృహహింస కేసు విచారణ జరుగుతోంది. విడివిడిగా ఉంటున్న ఇద్దరూ వాయిదాలకు వస్తున్నారు. పిల్లలిద్దరూ తల్లి లక్ష్మీతిరుపతమ్మ దగ్గరే ఉంటున్నారు. ఈ నేపధ్యంలో శుక్రవారం కోర్టు వాయిదాకు వచ్చిన తిరుపతమ్మ, పెద్ద కుమార్తె మోక్షితను వెంట తీసుకొచ్చింది. అదే కోర్టుకు వచ్చిన భర్త వెంకటస్వామిని చూసింది. మోక్షితను అక్కడే కూర్చోబెట్టి, మూత్రవిసర్జనకు వెళ్లొస్తానని తల్లి ఇంటికి వెళ్లిపోయింది. ఎంతకీ తల్లి రాకపోవటంతో ఆ బాలిక బిక్కముఖం వేసి ఏడుపు మొదలెట్టింది. అక్కడ ఉన్న న్యాయవాదులు గమనించి మోక్షితను ప్రశ్నిస్తే ఈ విషయం వెల్లడించింది. సాయంత్రానికి తల్లిదండ్రులు వేర్వేరుగా కోర్టు వద్దకు చేరుకున్నారు. నవమి పండక్కి నాన్నతో వెళ్లి రెండురోజులు ఉంటానని పాప అంటే, వదిలేశానని తిరుపతమ్మ చెప్పింది. తన వెంట తీసుకెళితే న్యాయపరంగా చిక్కులొస్తాయని లాయరు చెప్పటంతో తాను తీసుకెళ్లలేదని ఆమె భర్త వెంకటస్వామి చెప్పటం గమనార్హం. విచ్ఛిన్నమవుతున్న వివాహ బంధాల నేపథ్యంలో పసిబిడ్డల జీవితాలు ఎలా నిర్లక్ష్యానికి గురవుతున్నాయో? చెప్పేందుకు ఈ ఘటనను పలువురు ఉదహరిస్తున్నారు. తండ్రి దగ్గర వదిలేస్తే బిడ్డను తీసుకెళతాడని తల్లి భావించి నిర్లక్ష్యంగా వదిలేసి వెళ్లిపోయింది. వెంట తీసుకెళితే కేసులో న్యాయపరంగా ఏదైనా సమస్య వస్తుందేమోనని తండ్రి భయపడి, మానవత్వం లేకుండా వదిలేసి వెళ్లిపోయాడు. తండ్రికి అప్పగించి వెళ్లొచ్చు కదాని తల్లిని ప్రశ్నిస్తే, మేం మాట్లాడుకోవటం లేదని సమాధానమిచ్చింది. సరే నువ్వు చూశావు కదా ఎందుకు పట్టించుకోలేదని తండ్రిని అడిగితే, ‘ఒకరిని కాదు...ఇద్దరు పిల్లలను తనతోనే తీసుకెళ్లాలని ఉందని, కాని న్యాయపరంగా చిక్కులొస్తాయని’ తీసుకెళ్లలేదని సమాధానమిచ్చాడు. అంతేగానీ, వదిలేస్తే తమ బిడ్డ ఎంతగా తల్లడిల్లుతుందోనని వారిద్దరూ కనీస ఆలోచన చేయలేదని అక్కడివారు మండిపడ్డారు. తెగిపోతున్న వివాహ బంధాల్లో పిల్లల జీవితాలు తెగిన గాలిపటాలవుతున్న ఉదంతాలను ఈ సందర్భంగా స్థానిక న్యాయవాదులు బేతాళ ప్రభాకర్, శ్రీనాథ్ రెడ్డి ప్రస్తావించారు. న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లి, మరోసారి ఇలా జరక్కుండా చట్టప్రకారం చర్యలు కోరతామని చెప్పారు. -
దుగ్గిరాల పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
-
పెళ్లిళ్ల మధ్యవర్తి తిట్టాడని..
దుగ్గిరాల (మంగళగిరి): పెళ్లిళ్లు కుదిర్చే మధ్యవర్తి పెళ్లి చెడగొట్టటమేగాక ఫోనులో దుర్భాషలాడటంతో యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నందివెలుగు గ్రామానికి చెందిన కుసుకుర్తి నీరజకు పెళ్లిచేసేందుకు తల్లిదండ్రులు పెళ్లిళ్లు కుదిర్చే కావూరి సూత్రంరాజును సంప్రదించగా గుంటూరు చెందిన ఓ సంబంధం తీసుకొచ్చాడు. పెద్దలు మాట్లాడుకుని ఏప్రిల్ 29న నిశ్చితార్థం చేసుకోవాలనుకున్నారు. తరువాత పెళ్లి ఆగిపోయింది. సూత్రంరాజు అబ్బాయి తరఫువాళ్లకు అబద్ధాలు చెప్పడం వల్లే వివాహం ఆగిపోయిందని మనస్తాపం చెందిన నీరజ ఎలకలమందు తిని ఆత్మహత్య చేసుకుంది. -
దుగ్గిరాలలో విరిగిన రైలుపట్టా
పాయింట్స్‌మెన్ అప్రమత్తతతో తప్పిన పెనుప్రమాదం గుంటూరు: విరిగిన రైలు పట్టాను సిబ్బంది సకాలంలో గుర్తించడం తో పెను ప్రమాదం తప్పింది. విజయవాడ–చెన్నై రైలుమార్గంలో గుంటూరు జిల్లా దుగ్గిరాల రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఉదయం 6.30 గంటలకు పినాకిని ఎక్స్‌ప్రెస్‌కు సిగ్నల్ ఇచ్చేందుకు దుగ్గిరాల రైల్వే స్టేషన్లో పాయింట్స్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న డి. నాగరాజు రైలు పట్టాలు దాటి అవతలివైపునకు వెళ్లాడు. పినాకిని ఎక్స్‌ప్రెస్ స్టేషన్ దాటి వెళ్ళిన తరువాత తిరిగి పట్టాలు దాటుతున్న సమయంలో పట్టా విరిగినట్లు గమనించి స్టేషన్‌మాస్టర్‌కు, రైల్వే కంట్రోల్‌కు సమాచారం అందించారు. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే రైళ్లను దారిమళ్లించారు. -
అయ్యప్ప దీక్షలోనూ వదిలిపెట్టలేదు..
దుగ్గిరాల: అయ్యప్ప మాల వేసుకున్నాడని కూడా కనికరించలేదు. మాటువేసి మరీ దాడి చేసి వేటకొడవళ్లతో నరికి, కత్తులతో పొడిచిచంపారు. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఆదివారం సంచలనం సృష్టిన ఈ సంఘటనలో మృతులు రౌడీషీటర్. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెనాలికి చెందిన రౌడీషీటర్ కాళిదాసు సత్యనారాయణ అలియాస్ వేమూరి సత్యం (33) ఆదివారం దుగ్గిరాల మండల గ్రామం మంచికలపూడి రోడ్డులో దారుణహత్యకు గురయ్యాడు. అయ్యప్పస్వామి దీక్షలో ఉన్న సత్యం, మరో వక్యక్తితో కలిసి కంఠంరాజుకొండూరు పొలిమేరల్లోని మహంకాళి అమ్మవారి ఆలయానికి వెళ్లారు. దర్శనం తర్వాత స్కూటర్‌పై తిరిగి వస్తుండగా.. మంచికలపూడి రైల్వే గేటు- కాఫీ పొడి ఫ్యాక్టరీ మధ్యలో ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు ఆటోతో ఢీకొట్టి సత్యంపై విచక్షణా రహితంగా కత్తులతో దాడి చేసి ఆటోలో పరారయ్యారు. సత్యం అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. స్కూటర్ వెనక కూర్చున్న వ్యక్తి గాయాలతో బయటపడ్డాడు. తెనాలి డీఎస్పీ సీహెచ్ సౌజన్య, సీఐలు యు.రవిచంద్ర, బి.శ్రీనివాసరావు, వై.శ్రీనివాసరావు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. పోలీసు జాగిలంతో వచ్చిన క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విషజ్వరాలతో 20 మందికి అస్వస్థత
దుగ్గిరాల (గుంటూరు జిల్లా) : విషజ్వరాల కారణంగా జిల్లాలోని దుగ్గిరాల మండలం మంచకలపూడి గ్రామంలో 20 మందికి పైగా గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారు. గత కొంతకాలంగా గ్రామంలో విషజ్వరాలతో గ్రామస్తులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం నాటికి గ్రామంలో 20మందికి పైగా గ్రామస్తులు ఈ విషజ్వరాల బారిన పడినట్లు సమాచారం. కాగా గ్రామంలో హెల్త్ క్యాంప్‌లు నిర్వహించి వైద్య సేవలు అందిస్తున్నా జ్వరాలు తగ్గుముఖం పట్టడంలేదు. ఇప్పటికే ఈ గ్రామాన్ని కలెక్టర్ కూడా సందర్శించి అధికారులను మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. -
ఎనిమిది రోజులైనా లభించని శ్రీనివాస్ ఆచూకీ
గుంటూరు: నైజీరియాలో కిడ్నాప్ కు గురైన శ్రీనివాస రావు (26) ఆచూకీ ఇంకా లభించలేదు. చింతలపూడి గ్రామానికి చెందిన శ్రీనివాస్ గతవారం నైజీరియాలో కిడ్నాప్ కు గురయ్యాడు. గత ఎనిమిది రోజుల నుంచి ఆ యువకుడి కోసం అన్వేషిస్తున్నా.. అతని ఆచూకీ లభించలేదు. దీంతో శ్రీనివాస్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తన కుమారుని ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. టంగుటూరి శేషయ్య, నాగమణి దంపతుల కుమారుడు శ్రీనివాసరావు ఎంబీఏ పూర్తి చేసి రెండున్నరేళ్లుగా నైజీరియాలోని మెరిట్ నైజీరియా లిమిటెడ్‌కు చెందిన లెగసీ అనే నిర్మాణ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. గుంటూరు పట్టణానికి చెందిన ఓ యువతితో అక్టోబర్ 7వ తేదీన అతనికి నిశ్చితార్థం జరిగింది. ఈ క్రమంలోనే అతను గుంటూరుకు వచ్చాడు. అనంతరం ఆ కార్యక్రమాన్ని ముగించుకుని శ్రీనివాస్ అక్టోబర్ 30 వ తేదీన నైజీరియా వెళ్లాడు. అతనితో పాటు ఉంటున్న ముగ్గురు పాకిస్థానీయులు కూడా కిడ్నాప్ కు గురయ్యారు. అయితే ఈ విషయాన్ని కొన్ని రోజుల పాటు గోప్యంగా ఉంచడం మాత్రం కలవరపెడుతోంది. -
లభించని శ్రీనివాసరావు ఆచూకీ
-
లభించని శ్రీనివాసరావు ఆచూకీ
దుగ్గిరాల: నైజీరియా దేశంలో కిడ్నాప్ కు గురైన టంగుటూరి శ్రీనివాసరావు(26) ఆచూకీ ఇంకా తెలియరాలేదు. అతడి ఆచూకీ తెయకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు అతడి విడుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం నైజీరియాలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించింది. కాగా, స్థానిక ప్రజాప్రతినిధులు శ్రీనివాసరావు తల్లిదండ్రులను కలిసి ధైర్యం చెప్పారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలోని చింతలపూడి గ్రామానికి చెందిన శ్రీనివాసరావు ఉద్యోగనిమిత్తం రెండున్నరేళ్లుగా నైజీరియాలో ఉంటున్నాడు. గుర్తుతెలియని దుండగులు శ్రీనివాసరావును కిడ్నాప్ చేశారని అతడి స్నేహితులు మంగళవారం ఫోన్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.