సాక్షి, గుంటూరు: టీడీపీ క్రియాశీలక కార్యకర్త మల్లెల కిరణ్ దారుణానికి ఒడిగట్టాడు. ఓ మహిళా కూలీపై అత్యాచారానికి ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. దుగ్గిరాల మండలం శృంగారపురంలో కిరణ్ శుక్రవారం.. ఓ మహిళా కూలీపై అత్యాచారయత్నం చేశాడు. బాధితురాలిని పొలాల్లోకి లాక్కెళ్తుండగా తోటి కూలీలు గమనించారు. ఈ క్రమంలో డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు అక్కడికి చేరుకుని కిరణ్‌ను అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment