లభించని శ్రీనివాసరావు ఆచూకీ
దుగ్గిరాల: నైజీరియా దేశంలో కిడ్నాప్ కు గురైన టంగుటూరి శ్రీనివాసరావు(26) ఆచూకీ ఇంకా తెలియరాలేదు. అతడి ఆచూకీ తెయకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు అతడి విడుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం నైజీరియాలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించింది. కాగా, స్థానిక ప్రజాప్రతినిధులు శ్రీనివాసరావు తల్లిదండ్రులను కలిసి ధైర్యం చెప్పారు.
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలోని చింతలపూడి గ్రామానికి చెందిన శ్రీనివాసరావు ఉద్యోగనిమిత్తం రెండున్నరేళ్లుగా నైజీరియాలో ఉంటున్నాడు. గుర్తుతెలియని దుండగులు శ్రీనివాసరావును కిడ్నాప్ చేశారని అతడి స్నేహితులు మంగళవారం ఫోన్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.