నైజీరియాలో కిడ్నాపఐన శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బుధవారం పరామర్శించారు.
గుంటూరు : నైజీరియాలో కిడ్నాపఐన శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బుధవారం పరామర్శించారు. నైజీరియా ఎంబసీ అధికారులు, తెలుగు అసోసియేషన్తో ఆయన ..ఫోన్లో మాట్లాడారు. శ్రీనివాసరావును విడిపించేందుకు చర్యలు తీసుకునేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తామని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలోని చింతలపూడి గ్రామానికి చెందిన శ్రీనివాసరావు నైజీరియా దేశంలో కిడ్నాప్ అయ్యాడు. అతని స్నేహితుల మంగళవారం శ్రీనివాసరావు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఇంతవరకూ అతని ఆచూకీ తెలియలేదు.