అయ్యప్ప దీక్షలోనూ వదిలిపెట్టలేదు.. | rowdy sheeter satyanarayana murdered in guntur | Sakshi
Sakshi News home page

అయ్యప్ప దీక్షలోనూ వదిలిపెట్టలేదు..

Published Mon, Nov 23 2015 7:03 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

అయ్యప్ప దీక్షలోనూ వదిలిపెట్టలేదు.. - Sakshi

అయ్యప్ప దీక్షలోనూ వదిలిపెట్టలేదు..

దుగ్గిరాల: అయ్యప్ప మాల వేసుకున్నాడని కూడా కనికరించలేదు. మాటువేసి మరీ దాడి చేసి వేటకొడవళ్లతో నరికి, కత్తులతో పొడిచిచంపారు. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఆదివారం సంచలనం సృష్టిన ఈ సంఘటనలో మృతులు రౌడీషీటర్. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

తెనాలికి చెందిన రౌడీషీటర్ కాళిదాసు సత్యనారాయణ అలియాస్ వేమూరి సత్యం (33)  ఆదివారం దుగ్గిరాల మండల గ్రామం మంచికలపూడి రోడ్డులో దారుణహత్యకు గురయ్యాడు. అయ్యప్పస్వామి దీక్షలో ఉన్న సత్యం,  మరో వక్యక్తితో కలిసి కంఠంరాజుకొండూరు పొలిమేరల్లోని మహంకాళి అమ్మవారి ఆలయానికి వెళ్లారు. దర్శనం తర్వాత స్కూటర్‌పై తిరిగి వస్తుండగా..

మంచికలపూడి రైల్వే గేటు- కాఫీ పొడి ఫ్యాక్టరీ మధ్యలో ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు ఆటోతో ఢీకొట్టి సత్యంపై విచక్షణా రహితంగా కత్తులతో దాడి చేసి ఆటోలో పరారయ్యారు. సత్యం అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. స్కూటర్ వెనక కూర్చున్న వ్యక్తి గాయాలతో బయటపడ్డాడు. తెనాలి డీఎస్పీ సీహెచ్ సౌజన్య, సీఐలు యు.రవిచంద్ర, బి.శ్రీనివాసరావు, వై.శ్రీనివాసరావు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. పోలీసు జాగిలంతో వచ్చిన క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement