
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నికపై హైకోర్టు స్టే విధించింది. అధ్యక్ష పదవికి పోటీచేస్తున్న షేక్ జబీన్ కులధ్రువీకరణపై వారంలోపు నిర్ణయం ప్రకటించాలని గుంటూరు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. అప్పటివరకు ఎంపీపీ ఎన్నిక నిర్వహించవద్దని ఎన్నికల కమిషన్‌తో పాటు ఇతర అధికారులను హైకోర్టు ఆదేశించింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. తన కులధ్రువీకరణపై కలెక్టర్ వద్ద అప్పీల్ పెండింగ్‌లో ఉండగానే ఎంపీపీ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారని, తనకు బీసీ–ఈ కులధ్రువీకరణ పత్రం ఇచ్చేంతవరకు దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికను నిలిపివేయాలని కోరుతూ టీడీపీ ఎంపీటీసీ సభ్యురాలు షేక్ జబీన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై గురువారం జస్టిస్ దేవానంద్ విచారణ జరిపారు.
Comments
Please login to add a commentAdd a comment