
సాక్షి, పశ్చిమగోదావరి: దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ఎట్టకేలకు అరెస్టయ్యారు. దళితులను దూషించి.. దౌర్జన్యం చేసినట్టు కేసులు ఎదుర్కొంటున్న చింతమనేని గత పన్నెండురోజులుగా పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాటకీయ పరిణామాల మధ్య చింతమనేని బుధవారం ఉదయం దుగ్గిరాలలోని తన ఇంటి వద్ద ప్రత్యక్షమయ్యారు. ఈ సందర్భంగా ఆయన అనుచరులు రెచ్చిపోయారు. చింతమనేని నివాసంలో ఆరుగురు మహిళా కానిస్టేబుళ్లను అనుచరులు నిర్బంధించారు. ఈ క్రమంలో భారీగా మోహరించిన పోలీసులు చింతమనేని అరెస్టు చేశారు.
పినకడిమి గ్రామానికి చెందిన దళిత యువకులపై దాడి ఘటనలో చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇదే కాకుండా పలు అక్రమాలు, దౌర్జన్యాలకు సంబంధించి చింతమనేనిపై పోలీసులు 10 కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసుల అరెస్టు నుంచి తప్పించుకునేందుకు చింతమనేని అజ్ఞాతంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా, చింతమనేని ప్రభాకర్‌ను అరెస్ట్ చేసి తీసుకెళుతున్న పోలీస్ వాహనాన్ని గోపన్నపాలెం వద్ద ఆయన అనుచరులు అడ్డగించారు. ఈ సందర్భంగా పోలీసులకు, చింతమనేని అనుచరులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment