
పెళ్లిళ్ల మధ్యవర్తి తిట్టాడని..
దుగ్గిరాల (మంగళగిరి): పెళ్లిళ్లు కుదిర్చే మధ్యవర్తి పెళ్లి చెడగొట్టటమేగాక ఫోనులో దుర్భాషలాడటంతో యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. నందివెలుగు గ్రామానికి చెందిన కుసుకుర్తి నీరజకు పెళ్లిచేసేందుకు తల్లిదండ్రులు పెళ్లిళ్లు కుదిర్చే కావూరి సూత్రంరాజును సంప్రదించగా గుంటూరు చెందిన ఓ సంబంధం తీసుకొచ్చాడు. పెద్దలు మాట్లాడుకుని ఏప్రిల్ 29న నిశ్చితార్థం చేసుకోవాలనుకున్నారు. తరువాత పెళ్లి ఆగిపోయింది. సూత్రంరాజు అబ్బాయి తరఫువాళ్లకు అబద్ధాలు చెప్పడం వల్లే వివాహం ఆగిపోయిందని మనస్తాపం చెందిన నీరజ ఎలకలమందు తిని ఆత్మహత్య చేసుకుంది.