
దుగ్గిరాలలో నిమ్మగడ్డతో టీడీపీ నాయకులు
సాక్షి, తాడేపల్లి రూరల్ (దుగ్గిరాల): ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఆదివారం స్వగ్రామం దుగ్గిరాలకు విచ్చేశారు. ఆయన రాకను పురస్కరించుకొని టీడీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్డు పొడవునా స్వాగతం పలికారు. ఏడాదిగా సొంతూరుకు వెళ్లని నిమ్మగడ్డ, ఇప్పుడు బిజీగా గడుపుతున్న వేళఊర్లో ప్రత్యక్షమవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. దుగ్గిరాల మండలానికి చెందిన కొంత మంది టీడీపీ నాయకులు ఆయన్ను కలిసి ఇంట్లో గంటన్నర పైనే మాట్లాడారు. నిమ్మగడ్డను కలిసిన వారిలో మాజీ సర్పంచ్ జంపాల కృష్ణారావు, దుగ్గిరాల బీజేపీ నాయకురాలు చుండూరు ఉమ తదితరులు ఉన్నారు. దుగ్గిరాల తహసీల్దార్ మల్లేశ్వరి నిమ్మగడ్డకు స్వాగతం పలికారు. చదవండి: (పరిటాల సునీతకు ఎదురుదెబ్బ)
Comments
Please login to add a commentAdd a comment