
సాక్షి, హైదరాబాద్: పలు మార్గాల్లో ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్–రేపల్లె–సికింద్రాబాద్ రైలు (17645/17646)ఈ నెల 27 నుంచి రాకపోకలు సాగించనుంది. ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి సాయంత్రం 7.45కు రేపల్లెకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఉదయం 7.50 గంటలకు రేపల్లె నుంచి బయలుదేరి సాయంత్రం 4.55 కు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
కాచిగూడ–నిజామాబాద్ రైలు (07594/07595)ఈ నెల 29 నుంచి రాకపోకలు సాగించనుంది. సాయంత్రం 6.50 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి రాత్రి 11.50కి నిజామాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఉదయం 5.05 గంటలకు బయలుదేరి ఉదయం 9.40గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. రాయచూర్–గద్వాల్ (07496/07495) ఈ నెల 27నుంచి అందుబాటులోకి రానుంది. మధ్యాహ్నం 1.10 కి బయలుదేరి 2.30 కు గద్వాల్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.50 గంటలకు బయలుదేరి సాయంత్రం 4.20 కి రాయచూర్ చేరుకుంటుంది.