![ఎగిరిన ఎయిర్ కోస్టా విమానాలు](/styles/webp/s3/article_images/2017/09/4/61470430418_625x300.jpg.webp?itok=eO6EcyfD)
ఎగిరిన ఎయిర్ కోస్టా విమానాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ప్రాంతీయ విమానయాన సంస్థ ఎయిర్‌కోస్టా తన సర్వీసులను పునరుద్ధరించింది. విమానాలను లీజుకిచ్చిన సంస్థతో తలెత్తిన వివాదం కారణంగా గురువారం సర్వీసులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఎయిర్‌కోస్టా శుక్రవారం తొమ్మిది సర్వీసులను నడిపింది. శనివారం నుంచి యదావిధిగా 24 సర్వీసులూ నడుస్తాయని సంస్థ సీఈవో వివేక్ చౌదరి వెల్లడించారు. వివాదం సమసిపోయిందని, భవిష్యత్తులో ఎటువంటి సమస్యా రాదని చెప్పారు.