వాట్సాప్‌, ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌ సేవలు పునరుద్ధరణ | Restoration Of WhatsApp And Facebook And Instagram Services | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌, ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌ సేవలు పునరుద్ధరణ

Published Tue, Oct 5 2021 4:47 AM | Last Updated on Tue, Oct 5 2021 5:44 AM

Restoration Of WhatsApp And Facebook And Instagram Services - Sakshi

వెబ్‌డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7 గంటల పాటు స్తంభించిన వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలు పునరుద్ధరణ అయ్యాయి. మంగళవారం తెల్లవారు జామున 4 గంటల తర్వాత ఈ సేవలు పునరుద్ధరించారు. సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలకు భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో సోమవారం అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే.

భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటల ప్రాంతంలో భారత్‌ సహా వివిధ దేశాల్లో వీటి సేవలు స్తంభించాయి. ఫేస్‌బుక్‌ సంస్థకు చెందిన ఈ సామాజిక మాధ్యమాల్లో మెసేజ్‌లు వెళ్లకపోవడం, రాకపోవడం, కొత్త పోస్టులు కనబడకపోవడంతో నెటిజన్లు ఇతర వేదికల్లో ఈ సమాచారాన్ని పంచుకున్నారు. సాంకేతిక కారణాలతో సేవలు నిలిచిపోయినట్లు ఫేస్‌బుక్‌ తన వెబ్‌సైట్‌లో స్పందించింది. సేవలు నిలిచిపోవడంతో కొన్ని గంటల పాటు యూజర్లు ఇబ్బందులు పడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement