పేరిణి నాట్యం ప్రదర్శన
పేరిణి నాట్యం ప్రదర్శన
Published Tue, Sep 27 2016 10:22 PM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM
భువనగిరి టౌన్ : పట్టణంలోని గంజ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం పేరిణి నాట్య ప్రదర్శన నిర్వహించారు. ముందు తరాలకు పేరిణి నృత్యాన్ని తెలియజేసేందుకు కళాకారుడు రాజ్‌కుమార్‌నాయక్ జిల్లా వ్యాప్తంగా ప్రదర్శనలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన ఇక్కడకు వచ్చారు. ఈ సంర్భంగా అయన మాట్లాడుతూ పేరిణి నాట్యం గురించి 4, 8, 9వ తరగతి పాఠ్యాంశాలలో రాష్ట్ర ప్రభుత్వ చేర్చిందన్నారు. ఈ నాట్యం గుర్చిం విద్యార్థులకు తెలియజేయాలని ఉద్దేశంలో 101 రోజులు పాటు ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నాట్యాన్ని ప్రదర్శిస్తున్నానని తెలిపారు.
Advertisement
Advertisement