perini
-
పేరిణి నాట్యం ప్రదర్శన
భువనగిరి టౌన్ : పట్టణంలోని గంజ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం పేరిణి నాట్య ప్రదర్శన నిర్వహించారు. ముందు తరాలకు పేరిణి నృత్యాన్ని తెలియజేసేందుకు కళాకారుడు రాజ్‌కుమార్‌నాయక్ జిల్లా వ్యాప్తంగా ప్రదర్శనలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన ఇక్కడకు వచ్చారు. ఈ సంర్భంగా అయన మాట్లాడుతూ పేరిణి నాట్యం గురించి 4, 8, 9వ తరగతి పాఠ్యాంశాలలో రాష్ట్ర ప్రభుత్వ చేర్చిందన్నారు. ఈ నాట్యం గుర్చిం విద్యార్థులకు తెలియజేయాలని ఉద్దేశంలో 101 రోజులు పాటు ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నాట్యాన్ని ప్రదర్శిస్తున్నానని తెలిపారు. -
ఆకట్టుకున్న పేరిణి నృత్య ప్రదర్శన
కోదాడఅర్బన్: కోదాడ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం రిషి డ్యాన్స్ అకాడమీకి చెందిన పేరిణి నృత్యకళాకారులు రాజ్‌కుమార్, నాగేశ్వరరావు, జానిలు పేరిణి నృత్యాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా పేరిని నృత్యకళాకారులు మాట్లాడుతూ కాకతీయుల కాలంలో వైభవంగా ప్రదర్శించిన పేరిణి నృత్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక నృత్యంగా గుర్తిచడం హర్షణీయమన్నారు. విద్యార్థులు పేరిణి నృత్య ప్రదర్శనపై ఆసక్తి పెంచుకుని నృత్యాన్ని నేర్చుకోవాలని వారు కోరారు. ఈ సందర్భంగా కళాకారులను పాఠశాల ఉపాధ్యాయులు వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బాలుర పాఠశాల హెచ్ఎం ముత్తవరపు రామారావు, పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పేరిణి నాట్యం ప్రాముఖ్యాన్ని తెలియజేయాలి
సూర్యాపేట మున్సిపాలిటీ : పేరిణి నాట్యం ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయాలని మాజీ మున్సిపల్ చైర్మన్ మీలా సత్యనారాయణ, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ జిల్లాల్లో పేరిణి నాట్యం 101వ రోజులు కార్యక్రమాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ శాస్త్రీయ నృత్యమైన పేరిణి నాట్యాన్ని అందరికి తెలియజెప్పాల్సిన బాధ్యత కళాకారులపైనే ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల వారికి సైతం ఈ నాట్యం యొక్క గొప్పతనాన్ని చెప్పి ఈ నాట్యం వైపు దృష్టి మరలించేలా చేయాలని సూచించారు. అనంతరం పేరిణిలోని లాస్యం, తాండవం ప్రదర్శనలను ప్రదర్శించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం జనార్దన్‌రెడ్డి, పేరిణి వెంకట్‌గౌడ్, వీరునాయుడు, సత్యనారాయణ, నాగేశ్వరరావు, సతీష్, రాజ్తదితరులు పాల్గొన్నారు.