Published
Mon, Sep 19 2016 11:26 PM
| Last Updated on Mon, Sep 4 2017 2:08 PM
పేరిణి నాట్యం ప్రాముఖ్యాన్ని తెలియజేయాలి
సూర్యాపేట మున్సిపాలిటీ : పేరిణి నాట్యం ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయాలని మాజీ మున్సిపల్ చైర్మన్ మీలా సత్యనారాయణ, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ జిల్లాల్లో పేరిణి నాట్యం 101వ రోజులు కార్యక్రమాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ శాస్త్రీయ నృత్యమైన పేరిణి నాట్యాన్ని అందరికి తెలియజెప్పాల్సిన బాధ్యత కళాకారులపైనే ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల వారికి సైతం ఈ నాట్యం యొక్క గొప్పతనాన్ని చెప్పి ఈ నాట్యం వైపు దృష్టి మరలించేలా చేయాలని సూచించారు. అనంతరం పేరిణిలోని లాస్యం, తాండవం ప్రదర్శనలను ప్రదర్శించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం జనార్దన్‌రెడ్డి, పేరిణి వెంకట్‌గౌడ్, వీరునాయుడు, సత్యనారాయణ, నాగేశ్వరరావు, సతీష్, రాజ్‌తదితరులు పాల్గొన్నారు.