ఆకట్టుకున్న పేరిణి నృత్య ప్రదర్శన
కోదాడఅర్బన్: కోదాడ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం రిషి డ్యాన్స్ అకాడమీకి చెందిన పేరిణి నృత్యకళాకారులు రాజ్‌కుమార్, నాగేశ్వరరావు, జానిలు పేరిణి నృత్యాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా పేరిని నృత్యకళాకారులు మాట్లాడుతూ కాకతీయుల కాలంలో వైభవంగా ప్రదర్శించిన పేరిణి నృత్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక నృత్యంగా గుర్తిచడం హర్షణీయమన్నారు. విద్యార్థులు పేరిణి నృత్య ప్రదర్శనపై ఆసక్తి పెంచుకుని నృత్యాన్ని నేర్చుకోవాలని వారు కోరారు. ఈ సందర్భంగా కళాకారులను పాఠశాల ఉపాధ్యాయులు వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బాలుర పాఠశాల హెచ్‌ఎం ముత్తవరపు రామారావు, పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.