ప్రణాళికలో మార్పులపై నివేదిక ఇవ్వాలి | give report on changes to the plan | Sakshi
Sakshi News home page

ప్రణాళికలో మార్పులపై నివేదిక ఇవ్వాలి

Published Tue, Sep 27 2016 10:30 PM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM

ప్రణాళికలో మార్పులపై నివేదిక ఇవ్వాలి

ప్రణాళికలో మార్పులపై నివేదిక ఇవ్వాలి

భువనగిరి : హెచ్‌ఎండీఏ ప్రణాళికలో మార్పులు, చేర్పులు కావాలనుకుంటే చెప్పాలని హెచ్‌ఎండీఏ ప్లానింగ్‌ డైరెక్టర్‌ విద్యాధర్‌ కోరారు. మంగళవారం భువనగిరిలోని ఆర్డీఓ కార్యాలయంలో హెచ్‌ఎండీఏ పరిధిలోని భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి, బొమ్మలరామారం, చౌటుప్పల్‌ మండలాల తహసీల్దార్‌దార్లు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. హెచ్‌ఎండీఏలో రూపొందించిన ప్రణాళికకు కొత్తగా ఏమైనా మార్పులు, చేర్పులు సూచించాలనుకుంటే చెప్పాలన్నారు. కార్యక్రమంలో జేసీ సత్యనారాయణ, ఆర్డీఓ ఎం.వి భూపాల్‌రెడ్డి, తహసీల్దార్‌ కె.వెంకట్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ జి.వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement