భువనగిరిలో ముమ్మర తనిఖీలు
Published Mon, Aug 8 2016 11:48 PM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM
భువనగిరి
మాజీ నక్సలైట్, గ్యాంగ్‌స్టర్ ఎండీ నయీం ఎన్‌కౌంటర్‌తో భువనగిరి డివిజన్‌ను పోలీసులు జల్లెడ పట్టారు. డివిజన్‌లోని పలు పోలీస్‌స్టేషన్ల నుంచి సీఐలు, ఎస్‌ఐలు అదనపు బలగాలను రప్పించారు. ఉదయం నుంచి భువనగిరి, యాదగిరిగుట్ట, వలిగొండ, భువనగిరి మండలం బొల్లేపల్లిలో నయీం అనుచరులుగా అనుమానిస్తున్న వారి ఇళ్లపై దాడులు చేశారు. భువనగిరి పట్టణంలోని నయీం ఇంటికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. అలాగే పీడీ యాక్టులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న నయీం అనుచరుడు పాశం శ్రీనివాస్ ఇంటికి వెళ్లి తనిఖీ చేసి అతడి సోదరుడు కౌన్సిలర్ పాÔ¶ ం అమర్‌నాథ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కౌన్సిలర్ ఎండీ నాసర్ ఇంటిని తనిఖీ చేశారు. బొల్లేపల్లిలో ఉన్న జెడ్పీటీసీ ఇంటికి వెళ్లిన పోలీసులు వారింటిని తనిఖీ చేశారు. మండలపరిషత్ అ«ధ్యక్షుడు తోటకూర వెంకటేష్ యాదవ్‌ను ఆయన స్వగ్రామం పగిడిపల్లిలోని అయన ఇంటిలో అదుపులోకి తీసుకున్నారు. వలిగొండ ఎంపీపీ శ్రీరాముల నాగరాజు, కోనపురి శంకర్ ఇళ్లపై పోలీస్‌లు దాడి చేశారు. యాదగిరిగుట్టలో నాలుగు ఇళ్లపైయ దాడులు చేసి నయీం అనుచరులుగా భావిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
నయీం అనుచరులపై నిఘా: నయీం అనుచరులపై పోలీస్‌ల నిఘా పెంచారు. తమకు సమాచారం ఉన్న మేరకు అనుచరుల ఇళ్లపై దాడులు చేసి విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే నయీం అనుచరులతో ఇబ్బందులు పడ్డ వారినుంచి పోలీస్‌లు సమాచారం సేకరిస్తున్నారు. భూదందాలు, బెదిరింపులు, సెటిల్‌మెంట్‌లు చేసినవారి పేర్లను సేకరిస్తున్నారు.
Advertisement
Advertisement