చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి
Published Mon, Aug 22 2016 7:40 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
భువనగిరి అర్బన్ : పాముకాటుకు గురై చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. అనాజిపురం గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అనాజిపురం గ్రామానికి చెందిన గొర్రెల, మేకల పెంపకందారుల సంఘం గ్రామశాఖ అధ్యక్షుడు ముంత మైసయ్య(45) తనకు ఉన్న గొర్రెలు, మేకలను మేపుతు జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 18వ తేదీన ఆయన రోజులాగే గొర్రెల కొట్టం వద్దకు వెళ్లగా అక్కడ పాము కాటువేసింది. ఇది గమనించిన ఆయన వెంటనే కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు చికిత్స అందించేందుకు సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు చెప్పారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలిపారు. సీపీఎం జీఎంపీఎస్ నాయకులు మృతదేహంపై పూలమాలలు వేసి నివాళర్పించారు. మృతుని కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 లక్షల ఆర్థికసాయం అందజేయాలని ఎంపీటీసీ దాసరి పాండు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు దయ్యాల నర్సింహ, ఎదునూరి మల్లేషం, ఎల్లంల వెంకటేష్, కడారి కృష్ణ తదితరులు ఉన్నారు.
Advertisement
Advertisement